Hari Hara Veera Mallu Trailer Release Date: అభిమానుల సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది, కానీ ఆ హద్దులు దాటిన తర్వాత వాళ్ళ ఆవేశాన్ని ఆపడం అంత తేలికైన విషయం కాదు. ఇప్పుడు ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veeramallu Movie) చిత్రం విషయం లో ఆ మూవీ టీం అలాగే ప్రవర్తిస్తుంది. సినిమా సరిగ్గా మరో 11 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన బిజినెస్ ని నిర్మాత క్లోజ్ చేయలేదు. కేవలం తెలుగు రాష్ట్రాలకే ఆయన 170 కోట్ల రూపాయిలను ఆశిస్తున్నాడు. సినిమాకు అంత రేంజ్ బజ్ లేదు, కేవలం 140 కోట్లు మాత్రమే ఇవ్వగలమని బయ్యర్స్ నిర్మాతతో చెప్తున్నారు. కానీ ఆయన మాత్రం తగ్గడం లేదు. దీంతో ఈ చిత్రానికి ప్రాంతాలవారిగా బయ్యర్స్ ఎవరో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. మరోపక్క ఈ చిత్రానికి సంబంధించిన ప్రొమోషన్స్ ని మొదలు పెట్టలేదు.
Also Read: 2వ రోజు కూడా ఇరగకుమ్మేసిన ‘ఖలేజా’..నార్త్ అమెరికాలో ప్రభంజనం..ఇప్పట్లో ఆగేలా లేదు!
పాన్ ఇండియా లెవెల్ లో ఒక సినిమాని కష్టపడి తెరకెక్కించినప్పుడు దానిని జనాల్లోకి పర్ఫెక్ట్ గా తీసుకెళ్లాలి. కానీ నిర్మాతలు అది చేయడం లేదు. ‘హరి హర వీరమల్లు’ చిత్రం రెగ్యులర్ కమర్షియల్ చిత్రం కాదు. కాబట్టి ఈ సినిమాపై పాటల ద్వారా బజ్ క్రియేట్ చేయడం అసాధ్యం. కాబట్టి కచ్చితంగా కంటెంట్ తోనే ప్రమోట్ చేయాలి. కానీ ఇప్పటి వరకు ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే ఐడియా కూడా జనాలకు ఇవ్వలేదు మూవీ టీం. పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నుండి ఒక్క డైలాగ్ టీజర్ కూడా రాకపోవడం గమనార్హం. కనీసం థియేట్రికల్ ట్రైలర్ ని అయినా తొందరగా విడుదల చేస్తారని అభిమానులు భావించారు. ఎందుకంటే ఓవర్సీస్ లో ఒక సినిమాకు ప్రేక్షకుడు టికెట్ కొనాలంటే ట్రైలర్ తప్పనిసరిగా ఉండాల్సిందే. మే 28న ట్రైలర్ ని విడుదల చేస్తారని అనుకున్నారు. కానీ ఆరోజు ట్రైలర్ కి బదులుగా ‘తార తార’ పాటని విడుదల చేశారు.
కనీసం జూన్ 2న పాటని విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అది కూడా జరగలేదు. ఎందుకంటే VFX షాట్స్ ఇంకా విదేశాల నుండి రావాల్సి ఉందట. అది డెలివరీ అవ్వడం ఆలస్యం అయ్యేట్టు ఉండడం తో జూన్ 2న కూడా విడుదల చేసే అవకాశం లేదని తేలిపోయింది. కనీసం 4వ తేదీన అయినా ఈ ట్రైలర్ వస్తుందేమో అని ఆశిస్తే, నిన్న సోషల్ మీడియా లో ట్రైలర్ జూన్ 4 నుండి 8 లోపు విడుదల చేయాలని చూస్తున్నట్టు ఒక రూమర్ వినిపించింది. దీంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా భగ్గుమన్నారు. నీ ట్రైలర్ నీ దగ్గరే ఉంచుకో మాకు సినిమా మీద నమ్మకం పోయింది అంటూ నిర్మాతని ట్యాగ్ చేసి అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అభిమానుల ఆవేశాన్ని అర్థం చేసుకున్న మేకర్స్, జూన్ 4న ఎట్టిపరిస్థితిలోనూ విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈరోజు సాయంత్రం, లేదా రేపు ఉదయం వచ్చే అవకాశం ఉంది.