YCP : ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు సమూలంగా మారాయి. సిద్ధాంతపరంగా విభేదాలు కంటే.. వ్యక్తిగతంగానే ఎక్కువమంది విభేదించుకుంటున్నారు. ఎదురుపడినా పలకరించే పరిస్థితి లేదు. ఒక్క పార్టీ అధికారంలో ఉంటే మరో పార్టీ శ్రేణులపై కేసులు, దాడులు కొనసాగుతున్నాయి. కేసులతో ఉక్కు పాదం మోపుతున్నారు. అరెస్టులతో భయపెడుతున్నారు. అయితే గత కొంతకాలంగా ఏపీలో ఈ పరంపర కొనసాగుతోంది. ఇటువంటి తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు గొప్ప దాతృత్వం చాటారు. ఓ వైసిపి నేతకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పది లక్షల రూపాయలు విడుదల చేశారు. ఇప్పుడు ఇదే వైరల్ అవుతోంది.
* తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ
ఉమ్మడి అనంతపురం( Ananthapuram ) జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం లోని బాల వెంకటాపురం గ్రామానికి చెందిన జిలాని బాషా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్థానికంగా మంచి గట్టి నాయకుడు కూడా. ఇటీవల ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరాడు. దాదాపు ఓ 20 లక్షలు రూపాయలు అవసరం ఏర్పడింది ఆయన వైద్యానికి. కానీ జిలాని కుటుంబ పరిస్థితి అంతంత మాత్రమే. వైద్యం కోసం ఉన్న ఆస్తులను అమ్ముకున్నాడు. అందిన దగ్గర అప్పులు చేశాడు. స్థానిక టిడిపి నేతలను కూడా ఆశ్రయించాడు. తనకు సాయం చేయాలని కోరాడు. టిడిపి నేతలు సైతం కొంత మొత్తాన్ని సర్దుబాటు చేశారు.
Also Read : అంతన్నారు ఇంతన్నారు.. చివరకు తేలిపోయిన వైఎస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా!*
* స్పందించిన ఎమ్మెల్యే
అయితే జిలాని( Jilani ) ఆరోగ్య పరిస్థితిని టిడిపి నాయకులు స్థానిక టిడిపి ఎమ్మెల్యే అలిమినేని సురేంద్ర బాబు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయానికి సంప్రదించారు. సీఎం రిలీఫ్ ఫండ్ విడుదల అయ్యేలా చేయాలని సూచించారు. వెంటనే జిలానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పది లక్షల రూపాయల నగదు మంజూరు అయింది. సంబంధిత చెక్కును ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు. దీంతో ఎమ్మెల్యే తో పాటు టిడిపి నేతలకు కృతజ్ఞతలు తెలిపింది జిలాని కుటుంబం.
* రాజకీయ ప్రత్యర్థికి సాయం
ప్రస్తుతం రాజకీయాలంటే( politics) ప్రత్యర్థులను వెంటాడడం అన్న పరిస్థితి నుంచి.. ఒక ప్రత్యర్థి నేతకు సాయం చేయడం నిజంగా శుభ పరిణామం. సీఎం రిలీఫ్ ఫండ్ తో విడుదలైన ఈ మొత్తం నగదుతో జిలాని ఆరోగ్యం కుదుటపడితే మాత్రం ఆయనకు పునర్జన్మే. అయితే గతంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో టిడిపి శ్రేణులకు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేది కాదు. కానీ ఈ విషయంలో సీఎం చంద్రబాబుతో పాటు టిడిపి శ్రేణులు ఉదారంగా వ్యవహరించడం మాత్రం ఆకట్టుకుంటోంది.
Also Read : వైసీపీలో అసంతృప్త స్వరాలు!