Rajamouli and Mahesh Babu : సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది అంత ఈజీగా రాదు. చాలామంది దర్శకులు విపరీతంగా కష్టపడి భారీ విజయాన్ని అందుకుంటారు. రాజమౌళి లాంటి దర్శకుడు ఒక సినిమా కోసం తన పూర్తి ఎఫర్ట్స్ పెట్టి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అలాంటి సినిమా మరొకటి లేదు అనే రేంజ్ లో తన సినిమాలను తీర్చిదిద్దుతూ ఉంటాడు. అందువల్లే ఆయన సినిమాలకి ప్రేక్షకుల్లో ఎక్కువగా ఆదరణ అయితే లభిస్తుంది. ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో చేస్తున్న సినిమా ప్రపంచంలోనే టాప్ 10 మూవీస్ లో ఒకటిగా నిలవబోతోందంటు రాజమౌళి సన్నిహిత వర్గాల నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలా మంది హీరోలు తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇప్పుడు ప్రతి ఒక్క హీరో పాన్ ఇండియాలో భారీ విజయాన్ని సంపాదించుకోవాలని చూస్తున్న వారే కావడం విశేషం… ఇక రాజమౌళి(Rajamouli) లాంటి స్టార్ డైరెక్టర్ బాహుబలి (Bahubali) సినిమాతో పాన్ ఇండియాలో తన సత్తా చాటుకొని ప్రస్తుతం మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఆయన ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబు తో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న రికార్డులన్నీ బ్రేక్ అవ్వబోతున్నాయనే వార్తలైతే చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో తనకంటూ ఒక హైప్ ని క్రియేట్ చేసుకొని భారీ విజయాన్ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు.
Also Read : రాజమౌళి మహేష్ బాబు ను కొత్త స్టైల్ లోకి మార్చడం వెనక ఇంత కథ ఉందా..?
అయితే ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ ని రీసెంట్ గా కంప్లీట్ చేసిన రాజమౌళి ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ కోసం ఒడిశా కి వెళ్లే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా మొత్తం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో కతెరకెక్కుతుంది. కాబట్టి ఒడిశాలోని ఫారెస్ట్ లో ఈ సినిమాని తెరకెక్కించి ఆ తర్వాత కేరళ, కర్ణాటక లోని ఈ సినిమాకి సంబంధించిన షెడ్యూల్స్ ని ఫినిష్ చేసి ముందుకు సాగాలనే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నట్టుగా తెలుస్తోంది.
మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం ఆయన ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది…
ఇక ఈ సినిమా కోసం ప్రపంచంలో ఉన్న ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఈ సినిమా మీదనే రాజమౌళి కూడా పూర్తి ఎఫర్ట్ అయితే పెడుతున్నాడు. ఇక 1200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా 3000 కోట్ల కలెక్షన్లను రాబడుతుందంటూ రాజమౌళి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు…
Also Read : రాజమౌళి మహేష్ బాబు కాంబోలో వస్తున్న సినిమాలో గెస్ట్ గా కనిపించనున్న హాలీవుడ్ స్టార్ హీరో…