YCP: ఏపీలో( Andhra Pradesh) మరోకూటమి ఏర్పడబోతోందా? వైయస్సార్ కాంగ్రెస్ నేతృత్వంలో కొన్ని పార్టీలు ఏకతాటి పైకి రానున్నాయా? అందులో కాంగ్రెస్ ఉంటుందా? ఉండదా? వామపక్షాలు జతకలుస్తాయా? లేదా? మిగిలిన చిన్నాచితకా పార్టీలు చేరుతాయా? పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో ఏపీలో పోటీ చేసిన ఆమ్ ఆద్మీ, బీఎస్పీ లాంటి పార్టీలకు సైతం వెయ్యి నుంచి 1500 ఓట్లు వచ్చాయి ప్రతి నియోజకవర్గంలో. దీనికి తోడు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా కొన్ని పార్టీలు వచ్చాయి. వాటికి సామాజిక వర్గ పరంగా ప్రతి నియోజకవర్గంలో 1000 నుంచి 2000 వరకు ఓట్లు దక్కుతుంటాయి. అయితే అటువంటి పార్టీలను కలుపుకెళ్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ కు డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. తప్పనిసరి పరిస్థితులు అయితే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి వాటిని కలుపుకు వెళ్లాల్సిందే.
Also Read: రవితేజ వల్లే మా తమ్ముడు కార్తీ కెరియర్ నిలబడింది : సూర్య…
* టిడిపి సరైన ఆలోచన
ఒకానొక దశలో తెలుగుదేశం పార్టీ ( Telugu Desam Party) క్లిష్ట స్థితికి చేరుకుంది. ఒక ప్రాంతీయ పార్టీగా ఏపీలో బలమైన ముద్ర చాటుకుంటూ వచ్చింది తెలుగుదేశం పార్టీ. పటిష్టమైన క్యాడర్ ఆ పార్టీ సొంతం. అటువంటి పార్టీ పొత్తు పెట్టుకునేందుకు ముందుకు వచ్చింది. వైయస్సార్ కాంగ్రెస్ ను ఎదుర్కోవాలంటే పొత్తు అనివార్యమని భావించింది. జనసేనతో పొత్తు పెట్టుకుంది. బిజెపిని సైతం ఒప్పించగలిగింది. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఏపీలో అగ్ర తాంబూలం ఇచ్చింది. ఏకంగా ఆరు పార్లమెంటు స్థానాలను కట్టబెట్టింది. పొత్తు వర్కౌట్ అయింది. తెలుగుదేశం పార్టీ సీట్ల త్యాగానికి తగిన ఫలితం దొరికింది. 23 అసెంబ్లీ సీట్లు గెలిచిన తెలుగుదేశం పార్టీ పొత్తు ద్వారా 135 సీట్లకు ఎగబాకింది.
* ఆ చిన్న పార్టీలతో..
ఇప్పుడు కూడా వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ అదే స్థితికి చేరుకుంది. కానీ ఆ పార్టీతో చేతులు కలిపేది ఎవరు? కాంగ్రెస్ పార్టీని దగ్గర చేర్చుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ఇష్టపడడం లేదు. వామపక్షాలు తటపటాయిస్తున్నాయి. ఈ క్రమంలో జై భీమ్, అమ్ ఆద్మీ, బీఎస్పీ లాంటి పార్టీలు మాత్రం జగన్మోహన్ రెడ్డితో కలిసేందుకు ముందుకు వస్తాయి. ఇటీవల జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ ఇదే విషయాన్ని వెల్లడించారు. ఏపీలో టీడీపీ కూటమికి వ్యతిరేకంగా వైసిపి కూటమి రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇటీవల శ్రావణ్ కుమార్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేసేందుకు సానుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు. నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్టు.. ఎన్నికల సమయానికి వైసీపీ కూటమి కట్టే అవకాశం ఉంది. అయితే ఒంటరి పోరాటం పై ఎక్కువగా వైసీపీ శ్రేణులు సవాల్ విసురుతుంటాయి. ఇప్పుడు ఆ ఒంటరి పోరాటం కాకుండా కూటమి కట్టడాన్ని ఎలా సమర్థించుకుంటాయో చూడాలి.