Surya Comments On Ravi Teja: రవితేజ హీరోగా వస్తున్న సినిమా ‘మాస్ జాతర’… ఈ మూవీ ఈనెల 31వ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకుంది. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చేపట్టారు… ఈ ఈవెంట్ కి తమిళ్ స్టార్ హీరో అయిన సూర్య గెస్ట్ గా హాజరయ్యారు. ఆయన ఈ సినిమా గురించి మాట్లాడుతూ రవితేజ ఎనర్జీ చాలా అద్భుతంగా ఉంటుంది. గతంలో అతని సినిమాలన్నీ చూశాను. అతనికి తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. నేను కూడా అతనికి అభిమానినే అంటూ సూర్య చెప్పాడు… రవితేజ లాంటి నటుడు ఇండస్ట్రీలో ఉండడం నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం అంటూ ఆయన రవితేజని ఆకాశానికి ఎత్తేశాడు…
Also Read: హత్యకు కుట్ర జరిగినా.. మోడీ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు.. ఈ విషయం ఎలా బయటపడింది?
ఇక రవితేజ హీరోగా వచ్చిన సినిమాలన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ముఖ్యంగా విక్రమార్కుడు సినిమాని తమిళంలో రీమేక్ చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఈ సినిమాను తమిళంలో మా తమ్ముడు కార్తీ రీమేక్ చేశాడు. నిజానికి కార్తీ కెరియర్ ని మార్చేసిన సినిమా కూడా ఇదే కావడం విశేషం…అందుకే రవితేజకు మాకు చాలా మంచి సన్నిహిత సంబంధం ఉంది.
హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి రవితేజని కలుస్తూ ఉంటాను అంటూ సూర్య చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మాస్ జాతర సినిమా గురించి సూర్య మాట్లాడుతూ ఈ సినిమాని చూస్తుంటేనే సక్సెస్ ఫుల్ వైబ్స్ కనిపిస్తున్నాయి.ఈ సినిమాతో రవితేజ మరోసారి సూపర్ సక్సెస్ ని సాధించి తన అభిమానుల్లో ఆనందాన్ని నింపాలని చూస్తున్నాడు. చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది…
ఇక ప్రస్తుతం సూర్య వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని సైతం సితార ఎంటర్ టైన్ మెంట్స్ వాళ్ళే తెరకెక్కిస్తుండటం విశేషం… ఇక ఈ సినిమాతో సూర్య సూపర్ సక్సెస్ ను సాధిస్తాడా? లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…