Yaarlagadda Laxmi Prasad : యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్( yaarlagadda Laxmi Prasad) .. ఈ పేరు తెలుగు రాజకీయాల్లో వినిపిస్తూనే ఉంటుంది. అలాగని ఈయన పూర్తిస్థాయి రాజకీయ నాయకుడు కాదు. అయితేనేం ఏ ప్రభుత్వం ఉన్నా.. ఏ పార్టీ అధికారంలో ఉన్న ఆయన స్థానం పదిలం. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ పదిమంది సలహా సంఘం సభ్యులను నియమించింది. అందులో ఒకరు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్. ఆయనకు ఇప్పుడు ఎలా పదవి వచ్చింది అన్నది ప్రశ్న. తప్పకుండా కూటమి నేతల సహాయం ఆయనకు ఉంటుంది. ఆ సాయంతోనే ఆయన పదవి పొందారు. అయితే చంద్రబాబుతో పాటు టిడిపిని వ్యతిరేకించిన యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కు పదవి ఎలా దక్కింది అన్నది ఇప్పుడు ప్రశ్న.
Also Read : టిడిపి గూటికి యార్లగడ్డ వెంకట్రావు?
* ఎనలేని ప్రాధాన్యం ఇచ్చిన జగన్..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) హయాంలో మంచి గుర్తింపు పొందారు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్. నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అయితే గౌరవం కూడా దక్కించుకున్నారు. టిడిపి తో పాటు చంద్రబాబును విమర్శించడంలో పోటీపడేవారు. సహజంగానే ఇది జగన్ మోహన్ రెడ్డిని ఆకర్షిస్తుంది. అందుకే కీలకమైన నామినేటెడ్ పోస్టులు కేటాయిస్తూ వచ్చారు. అయితే జగన్ గ్రాఫ్ పడిపోయిందని తెలుసుకున్నారో ఏమో కానీ.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు సమయంలో నిరసిస్తూ నామినేటెడ్ పదవికి రాజీనామా చేశారు. అటు తరువాత కూడా జగన్ భజన చేయడం మానలేదు. చంద్రబాబు పై విమర్శలు కూడా మానలేదు. అటువంటి యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కు కూటమిలో పదవి దక్కడం మాత్రం నిజంగా విశేషమే. అయితే అది పెద్ద పదవి కాకపోయినా.. గత అనుభవాల దృష్ట్యా యార్లగడ్డకు ఇవ్వడం మాత్రం నిజంగా సాహసమే.
* టిడిపి సర్కార్ కు వ్యతిరేకంగా..
2014 నుంచి 2019 మధ్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ చేసిన హడావిడి అంతా కాదు. అప్పటివరకు గుర్తించిన ప్రభుత్వాలకు భిన్నంగా చంద్రబాబు సర్కారు( Chandrababu government) వ్యవహరించింది. ఆ మాస్టారు ని దూరం పెట్టింది. దీనిని సహించుకోలేకపోయారు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్. చంద్రబాబు సర్కార్ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిందని రేచ్చిపోయారు. మాతృభాషను చంపేస్తారా అంటూ నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి పంచన చేరి చంద్రబాబు సర్కార్ పై విషం చిమ్మే మేధావుల్లో చేరిపోయారు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. అప్పటినుంచి చంద్రబాబు సర్కార్ పై విమర్శలు చేయడమే ఆయన పని. అందుకే 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే లక్ష్మీప్రసాద్ కు రెండు పదవులు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అయినా సరే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు సమయంలో ఆ రెండు పదవులకు రాజీనామా చేశారు. సరిగ్గా ఎన్నికల ముందు సీన్ చూసి కూటమి తరపున ప్రచారం చేస్తానని చెప్పుకున్నారు. కానీ ఆయన సేవలను కూటమి వినియోగించుకోలేదు.
* ఎన్నెన్నో మైలురాళ్లు..
కృష్ణాజిల్లా గుడివాడ( Gudivada ) నియోజకవర్గంలో జన్మించారు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్. మంచి విద్యాధికుడు కూడా. ఆంధ్ర యూనివర్సిటీ హిందీ విభాగంలో ఆచార్యుడిగా పని చేశారు. హిందీలో ఎంఏ పట్టా పొందారు. తెలుగు హిందీ భాషల్లో పిహెచ్డి పట్టాలు కూడా సాధించారు. నందిగామ కె.వి.ఆర్ కాలేజీలో అధ్యాపకుడిగా పని చేశారు. ఏయూలో ఆచార్యుడిగా 29 మంది విద్యార్థులకు పీహెచ్డీ మార్గదర్శకం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ హిందీ అకాడమీ చైర్మన్ గా, లోక్ నాయక్ ఫౌండేషన్ అధ్యక్షుడిగా, ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా చాలా రకాల పదవులు చేపట్టారు. పద్మ అవార్డులు కూడా దక్కించుకున్నారు. 1992లో అయితే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. అందుకే అన్ని ప్రభుత్వాలు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కు ప్రాధాన్యమిస్తూ వచ్చాయి. అయితే ఇప్పుడు టిడిపిని వ్యతిరేకించిన లక్ష్మీప్రసాద్ కు పదవి రావడం మాత్రం విశేషమే.
Also Read : వల్లభనేని వంశీని క్రాస్ చేస్తున్న యార్లగడ్డ