AP Minister : ఏపీలో( Andhra Pradesh) రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకుంటున్నారు. జూన్ లో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఉంటుంది. మరోవైపు కార్డులు చేర్పులు మార్పులకు సైతం అవకాశం కల్పించారు. వాట్సాప్ ద్వారా కూడా ఈ సేవలు పొందవచ్చు. ఈ నెల 8 నుంచి సచివాలయాల్లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. కొత్త కార్డుల కోసమే కాకుండా ఆరు రకాల సేవలు సైతం అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడున్న రేషన్ కార్డుల స్థానంలో జూన్లో స్మార్ట్ కార్డులను అందించనున్నారు. ఈనెల 15 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇంటి నుంచి ఆరు రకాల సేవలు పొందే సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. ప్రజలు 95523300009 నెంబర్కు హలో అన్న మెసేజ్ పంపడం ద్వారా ఈ సేవలు పొందవచ్చు. మరోవైపు మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటనలు చేశారు. రేషన్ కార్డులతో పాటు రేషన్ లబ్ధికి సంబంధించి కొన్ని వివరాలను వెల్లడించారు.
* నిర్దేశిత ధ్రువ పత్రాలు తప్పనిసరి
రేషన్ కార్డు దరఖాస్తుదారులు నిర్దేశిత ధ్రువపత్రాలు( certificate ) సిద్ధంగా ఉంచుకోవాలి. అర్హత ప్రమాణాలతో పాటు అవసరమైన డాక్యుమెంట్లు పొందుపరచాల్సి ఉంటుంది. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 1.2 లక్షల లోపు ఉండాలి. ఆరు దశల ప్రమాణాలను కలిగి ఉండాలి. Gsws హౌస్ హోల్డ్ డేటా బేస్ నందు నమోదు అయి ఉండాలి. వారిలో ఎవరికీ రైస్ కార్డు ఉండకూడదు. కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు తప్పనిసరి. కార్డులో సభ్యుడు చేర్చడానికి వివాహం లేదా జననం ద్వారా కుటుంబంలో మార్పు. వివాహ ధ్రువీకరణ పత్రంతో పాటు వివాహ సమయంలో తీసిన దంపతుల ఫోటో.. పిల్లలను చేర్చాలంటే జనన ధ్రువీకరణ పత్రం చేర్చాల్సిన వ్యక్తి ఆధార్ కార్డు తప్పనిసరి. ఇక రైస్ కార్డు నుంచి విభజించాలంటే.. ఒకే కార్డులో రెండు కుటుంబాలు ఉన్నప్పుడు విభజించుకోవచ్చు. సంబంధిత సభ్యుల ఆధార్ కార్డు, వివాహ ధ్రువీకరణ పత్రం, ప్రస్తుతం ఉన్న రైస్ కార్డ్, ప్రస్తుతం రైస్ కార్డ్ యొక్క ఆధార్ కార్డు. మరోవైపు మరణించిన వారి పేర్లు తొలగించాలంటే మరణ ధ్రువీకరణ పత్రం, సంబంధిత వ్యక్తి ఆధార్ కార్డ్, ప్రస్తుతం ఉన్న రైస్ కార్డ్, ప్రస్తుతం రైస్ కార్డు హోల్డర్ ఆధార్ కార్డ్. ఆధార్ కార్డులో చిరునామా మార్పుకు సంబంధిత వ్యక్తి ఆధార్ కార్డ్, ప్రస్తుతం ఉన్న రైస్ కార్డు ఉండాలి. ఆధార్ సీడింగ్ సవరణకు రైస్ కార్డులో సభ్యుడి ఆధార్ వివరాలు తప్పుగా ఉన్నప్పుడు సరి చేసుకోవచ్చు. సంబంధిత సభ్యుడి సరైన ఆధార్ కార్డ్, ప్రస్తుతం ఉన్న రైస్ కార్డ్, ప్రస్తుతం రైస్ కార్డు ఆల్టర్ యొక్క ఆధార్ నెంబర్.
* ఆ పన్నెండు కులాలకు అంత్యోదయ కార్డులు..
జూన్ నుంచి కొత్త స్మార్ట్ కార్డులు( Smart cards ) అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఆదివారం కీలక ప్రకటన చేశారు. ఉచితంగానే ఈ స్మార్ట్ కార్డుల జారీ ప్రక్రియ ఉంటుందని చెప్పారు. రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలని సూచించారు. ఏడాదిలోపు పిల్లలకు, 80 సంవత్సరాలు దాటిన వృద్ధులకు ఈ కేవైసీ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో పింఛన్ అందుకుంటున్న కళాకారులు, కొండ ప్రాంతాల్లో నివసించే చెంచులు, యానాదులు వంటి 12 కులాలకు చెందిన వారికి ప్రత్యేకంగా అంత్యోదయ అన్న యోజన కార్డులు అందించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్డుల ద్వారా వారికి 35 కిలోల బియ్యం అందిస్తామని కూడా చెప్పారు మంత్రి నాదెండ్ల మనోహర్.
Also Read : ఇంతకంటే అవమానం ఉంటుందా? ఏపీలో ఆ మంత్రి చాంబర్ కు తాళం..!