Vijay : రజినీకాంత్ అనంతరం అంతటి స్టార్డం, ఫాలోయింగ్ తెచ్చుకున్న నటుడు విజయ్. మిక్స్డ్ టాక్ తో కూడా ఆయన సినిమాలు వందల కోట్ల వసూళ్లు రాబడతాయి. గత పదేళ్లలో విజయ్ మేనియా విపరీతంగా పెరిగింది. తెలుగులో కూడా ఆయన సినిమాలకు మార్కెట్ ఏర్పడింది. హీరోగా కెరీర్ పీక్స్ లో ఉండగా, రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెప్పి షాక్ ఇచ్చాడు విజయ్. ఆయన పేరిట తండ్రి చంద్రశేఖర్ రాజకీయ కార్యక్రమాలు చేపట్టాడు. వాటిని విజయ్ వ్యతిరేకించాడు. ఈ క్రమంలో తండ్రి కొడుకుల మధ్య వివాదం నడిచింది.
Also Read : హీరో విజయ్ పార్టీ తో త్రిష, కీర్తి సురేష్ కి ఉన్న సంబంధం అదేనా?
గత ఏడాది ఫిబ్రవరిలో విజయ్ అధికారికంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేశాడు. తమిళగ వెట్రి కజగం(TVK) విజయ్ ఏర్పాటు చేసిన పార్టీ పేరు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా విజయ్ ముందుకు వెళుతున్నాడు. ఆయన భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నాడు. తన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్నికలకు కొన్ని నెలల సమయం మాత్రమే ఉండగా TVK ప్రభావం ఎంత వరకు ఉంటుంది అనే చర్చ మొదలైంది. కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి.
ఓ సర్వే ప్రకారం విజయ్ రానున్న ఎన్నికల్లో కింగ్ మేకర్ కానున్నాడని తెలియజేస్తుంది. 234 అసెంబ్లీ సీట్లకు గాను TVK 95-103 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని వెల్లడించింది. విజయ్ పూర్తి స్థాయి మెజారిటీకి దగ్గర్లో ఉన్నాడు. లేదంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి విజయ్ మద్దతు కావాల్సి ఉంటుంది. ఎన్నికల సమయానికి విజయ్ పార్టీకి మరింత మద్దతు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం తమిళనాడులో DMK అధికారంలో ఉంది. అన్నాడీఎంకే మరొక ప్రధాన పార్టీగా ఉంది. ఈ రెండు పార్టీలను విజయ్ తీవ్రంగా దెబ్బ తీస్తాడు అనేది సర్వే ఫలితాలు చూస్తే అర్థం అవుతుంది.
ఇక విజయ్ తన చివరి చిత్రంగా జన నాయగన్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి హెచ్ వినోత్ దర్శకుడు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. బాబీ డియోల్ విలన్ రోల్ చేస్తున్నారు. 2026 సంక్రాంతి కానుకగా జన నాయగన్ విడుదల కానుంది. ఈ చిత్రం అనంతరం సినిమాలు చేయనని విజయ్ ప్రకటించారు. దాంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also read : హీరో విజయ్ కి తృటిలో తప్పిన పెను ప్రమాదం..చెట్టుపై నుండి దూకిన వీరాభిమాని!