Mudragada : ఒక్క లేఖతో ముద్రగడ పరువు పాయె

అనవసరంగా లేఖ రాసి ముద్రగడ అడ్డంగా బుక్కయ్యారని ఆయన అనుచరులు తెగ బాధపడుతున్నారుట. ఎక్కడో తాడేపల్లి నుంచి వచ్చిన ఆదేశాలతో ఉన్న పరువు పోగొట్టుకున్నారన్న వ్యధ వారిలో స్పష్టంగా కనిపిస్తోంది.

Written By: Dharma, Updated On : June 23, 2023 10:13 am
Follow us on

Mudragada : కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభంకు కాపు సామాజికవర్గంలో గౌరవం ఉండేది. కానీ పవన్ కు లేఖ రాసి  ఉన్న గౌరవాన్ని చెడగొట్టుకున్నారు ముద్రగడ. వైసీపీ అధికారంలోకి రావడంతో కాపు రిజర్వేషన్ ఉద్యమం అవసరం లేదన్నట్టు పక్కకు తప్పుకున్నారు. గత నాలుగేళ్లుగా సొంత వ్యవహారాలకే పరిమితమయ్యారు. ఇప్పుడేమో కాపు కులస్థులను అమ్మనా బూతులు తిట్టే ద్వారపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి మద్దతుగా నిలుస్తూ ఏకంగా పవన్ కే లేఖ రాసి అడ్డంగా బుక్కయ్యారు. కాపుల ఆగ్రహాన్ని చవిచూస్తున్నారు. ద్వారపురెడ్డి స్పాన్సర్ షిప్ తో ఉద్యమాన్ని నడిపించావా అంటూ రూ.1000 చొప్పున మనియార్డర్లు పంపుతుండడంతో ఏం చేయాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు.

వాస్తవానికి మంత్రిగా ఉన్నప్పుడు ముద్రగడ చాలా స్టిట్ గా వ్యవహరించారుట. తన చాంబర్ లోకి కాపులకు నో ఎంట్రీ బోర్డు పెట్టి తానొక ఆదర్శ మంత్రిగా అనిపించుకోవడానికి తహతహలాడేవారుట. కానీ రాజకీయంగా ఫెయిల్యూర్ ఎదురయ్యేసరికి కాపు రిజర్వేషన్ తెరపైకి తెచ్చారుట. కానీ రాజకీయంగా మాత్రం కుదరుకోలేకపోయారు. జాతి పేరిట ఉద్యమం చేసి.. అదే జాతి అభిమానం చూరగొనలేకపోయారు. ఇండిపెండెంట్ గా పోటీచేస్తే కనీసం పది వేల ఓట్లు తెచ్చుకోలేకపోయారుట. ఉద్యమాన్ని నడిపి సామాజికవర్గ ఓట్లను మాత్రం రాజకీయ పక్షాలకు తాకట్టు పెట్టిన ఘనతను మాత్రం సొంతం చేసుకున్నారు.

పడక గదిలో ప్రతాపం చూపలేని వాడు.. బయట ఎంతో పలుకుబడి సంపాదించినట్టు.. కాపులంటే తానొక్కడినే అన్నట్టు ముద్రగడ కాస్తా పరపతి పెంచుకున్నారు. సంఘం పేరిట అనుచర గణాన్ని ఏర్పాటుచేసుకున్నారు. బహుశా ఆ పరపతితోనే ఏకంగా పవన్ కే లేఖ రాశారు. పవన్ స్పందించకపోయినా.. ఆ లేఖపై కాపు సమాజం యావత్ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తోంది. ముద్రగడ చర్యలను తప్పుపట్టడమే కాదు. ఆయన గత చరిత్రను తవ్వి మరీ ప్రజా క్షేత్రంలో పెడుతోంది. దీంతో నవ్వులపాలు కావడం ముద్రగడ వంతైంది.

కాపులను ఘోరంగా కించపర్చుతున్న ద్వారపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం కాపుల అభ్యున్నతికి పాటుపడిందని ముద్రగడ చెప్పడం పుండుకు మరింత గాయపరచింది. కాపు బిడ్డలను, మహిళలను ద్వారపురెడ్డి దారుణంగా కించపరిచారు. అప్పుడు వాడని భాష పవన్ ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడేసరికి ముద్రగడ వినియోగించడం కాపు సమాజంలో ఆగ్రహానికి కారణమైంది. పైగా ఫలాలే లభించని ఉద్యమానికి ద్వారపురెడ్డి ఫండింగ్ చేశారని చెప్పడం కూడా కాపులను గాయపరచింది. ఇదిగో ఆయన పెట్టిన ఉప్మా ప్లేట్లకు ఖరీదు అంటూ రూ.1000 చొప్పున కాపు ప్రతినిధులు ముద్రగడకే మనియార్డర్లు చేయడంతో ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియడం లేదు. అనవసరంగా లేఖ రాసి ముద్రగడ అడ్డంగా బుక్కయ్యారని ఆయన అనుచరులు తెగ బాధపడుతున్నారుట. ఎక్కడో తాడేపల్లి నుంచి వచ్చిన ఆదేశాలతో ఉన్న పరువు పోగొట్టుకున్నారన్న వ్యధ వారిలో స్పష్టంగా కనిపిస్తోంది.