Keerthy Suresh: ఈ మధ్య కీర్తి సురేష్ పై ఎఫైర్ రూమర్స్ ఎక్కువైపోయాయి. ఫ్రెండ్ తో పెళ్లి క్లాస్ మేట్ తో పెళ్లి అంటూ వరుస కథనాలు వెలువడుతున్నాయి. ఈ వార్తలను కీర్తి కుటుంబ సభ్యులు ఖండిస్తున్నారు. అయినా కొత్త పుకార్లు పుట్టుకొస్తున్నాయి. ఈసారి ఏకంగా కీర్తి సురేష్ డ్రైవర్ ని ప్రేమించారంటూ వార్తలు రాసుకొచ్చారు. ఒక వ్యక్తితో కీర్తి సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకు రాగా… ఆ ఫోటోల ఆధారంగా దారుణ కథనాలు వల్లించారు.
కీర్తి సురేష్ తన డ్రైవర్ ని ప్రేమించారు. ఆ ఫొటోల్లో ఉన్న వ్యక్తి అతనే అని కోలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై కీర్తి సురేష్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కీర్తి మీద ఇష్టం వచ్చినట్లు రాతలు రాస్తున్నారని వాపోతున్నారు. ఆ వ్యక్తి ఎవరో వివరణ ఇస్తున్నారు. నిజానికి కీర్తి సురేష్ పక్క ఉన్న ఆ అజ్ఞాత వ్యక్తి టెక్నీషియన్. భోళా శంకర్ చిత్రానికి పని చేస్తున్నాడు. ఆ చిత్ర సెట్స్ లో కీర్తి సురేష్ తో ఫోటోలు దిగాడు. అవి కాస్తా వైరల్ అయ్యాయి.
దాంతో డ్రైవర్ తో ఎఫైర్ అంటూ కథనాలు రాసుకొచ్చారు. ఈ వార్తలను కీర్తి సురేష్ లైట్ తీసుకుంటున్నారు. ఆమె కనీసం స్పందించడం లేదు. కీర్తి కెరీర్ పీక్స్ లో ఉంది. ఆమె తీరిక లేకుండా పలు భాషల్లో చిత్రాలు చేస్తున్నారు. దసరా చిత్రంతో భారీ విజయం అందుకుంది. దసరా వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అలాగే మహేష్ బాబుకు జంటగా నటించిన సర్కారు వారి పాట సైతం హిట్ స్టేటస్ అందుకుంది.
ప్రస్తుతం భోళా శంకర్ చేస్తుంది. ఈ మూవీలో ఆమె చిరంజీవి చెల్లిగా నటించారు. ఒక స్టార్ హీరోయిన్ చెల్లి పాత్రలు చేయడం అరుదైన విషయం. రజినీకాంత్ కి కూడా కీర్తి సిస్టర్ రోల్ చేశారు. భోళా శంకర్ ఆగస్టు 11న విడుదల కానుంది. టీజర్ జూన్ 24న విడుదల చేస్తున్నారు. తమన్నా హీరోయిన్ గా నటించింది. తమిళంలో ఆమె బిజీగా ఉన్నారు.