https://oktelugu.com/

Prakashraj : పవన్ వయా బిజెపి.. ప్రకాష్ రాజ్ ఆగ్రహానికి కారణం అదే!

గత కొద్ది రోజులుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పై విరుచుకుపడుతున్నారు నటుడు ప్రకాష్ రాజ్. మునుపెన్నడు లేని విధంగా పవన్ విషయంలో తప్పుపడుతూ ప్రశ్నలు కురిపిస్తున్నారు ప్రకాష్ రాజ్. అయితే ప్రకాష్ రాజ్ ఆగ్రహం వెనుక బిజెపి ఉన్నట్లు తెలుస్తోంది. బిజెపి లైన్లో పవన్ ఉండడం వల్లే ప్రకాష్ రాజ్ స్పందిస్తున్నట్లు తాజాగా స్పష్టమైంది.

Written By:
  • Dharma
  • , Updated On : October 7, 2024 12:32 pm
    Prakashraj Comments

    Prakashraj Comments

    Follow us on

    Prakashraj : తిరుమల లడ్డు వివాదంలో ప్రధానంగా వినిపించిన పేరు ప్రకాష్ రాజ్. విలక్షణ నటుడుగా పేరు తెచ్చుకున్న ఆయన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసుకున్నారు. వరుసగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.తొలుత ప్రకాష్ రాజ్ పై పవన్ రియాక్ట్ అయ్యారు.తరువాత ఆయన సైలెంట్ అయినా.. అభిమానులు రెచ్చిపోయి మరి సోషల్ మీడియా సాక్షిగా ట్రోల్ చేశారు. అయినా సరే ప్రకాష్ రాజ్ వెనక్కి తగ్గడం లేదు. జస్ట్ ఆస్కింగ్ అంటూ పవన్ పై సెటైరికల్ పోస్టులు పెడుతున్నారు. రెండు రోజుల కిందట తమిళనాడులో.. అక్కడి డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పై ప్రశంసలు కురిపించారు ప్రకాష్ రాజ్. అదే సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పై పరోక్ష సంకేతాలు ఇస్తూ విమర్శలు చేశారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. ఏపీలో లడ్డు వివాదం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణకు ఒక బలమైన వ్యవస్థ అవసరమని భావించారు. తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశంలో ఉన్న మత వివాదాలు చాలవా పవన్ కళ్యాణ్ గారు అంటూ ప్రశ్నించారు. అధికారంలో ఉన్నది మీరే కదా అంటూ గుర్తు చేశారు. అయితే తాను ఏ మతానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని.. అసలు ఈ లడ్డు వివాదంతో మీకేం పని అంటూ ప్రకాష్ రాజును పవన్ ప్రశ్నించారు. అప్పటినుంచి రచ్చ కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా పవన్ పై విమర్శలు కురిపిస్తూనే ఉన్నారు.అయితే ఒక్కసారి మాత్రమే పవన్ స్పందించారు.తరువాత ప్రకాష్ రాజ్ విషయంలో సైలెంట్ అయ్యారు. అయితే తాజాగా ప్రకాష్ రాజ్ చేసిన ఒక ట్విట్ చూస్తే మాత్రం.. ఆయన వ్యాఖ్యల వెనుక బిజెపి పై ఉన్న ఆగ్రహం కనిపిస్తోంది.

    * బిజెపి వైఖరికి ప్రకాష్ రాజ్ వ్యతిరేకం
    కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి విషయంలో ప్రకాష్ రాజ్ చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఆ పార్టీ మత రాజకీయాలు చేస్తుందని ఆరోపణలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రానికి ప్రకాష్ రాజ్ టార్గెట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా సరే ప్రకాష్ రాజ్ ఎన్నడు వెనక్కి తగ్గలేదు. బిజెపిపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. బిజెపి వ్యతిరేకులతో స్నేహం కొనసాగిస్తూ.. బిజెపి విధానాలను అనుసరిస్తున్న స్నేహితులపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనేపవన్ చర్యలను తప్పుపడుతూ విమర్శలకు దిగారు ప్రకాష్ రాజ్.

    * హిందుత్వ వాదాన్ని వినిపిస్తున్న పవన్
    ప్రస్తుతం పవన్ చర్యలు చూస్తుంటే హిందుత్వ వాదాన్ని బలంగా వినిపిస్తున్నారు.అయితేఇతర మతాలను గౌరవిస్తూనే మన మతాన్ని ఆచరించాలన్నది పవన్ అభిమతం. ఈ క్రమంలో ఇతర మతాలపై దాడులు జరిగినప్పుడు, ఆ మత హక్కులకు భంగం వాటిల్లినప్పుడు సరైన న్యాయం జరుగుతుందని భావించారు. కానీ హిందూ మతం విషయంలో మాత్రం అలా జరగడం లేదన్నది పవన్ ఆందోళన. అందుకే సనాతన ధర్మ పరిరక్షణకు వ్యవస్థ ఉండాలని పవన్ అభిప్రాయపడ్డారు. అయితే ఇది బిజెపి లైన్లో చేస్తున్నది అన్నది అనుమానం. అందుకే ప్రకాష్ రాజ్ వరుసగా విమర్శనాస్త్రాలు సంధించినట్లు తెలుస్తోంది.

    * ఎట్టకేలకు అభిప్రాయం వెల్లడి
    అయితే ఇప్పటివరకు పెట్టిన ట్వీట్లు ఒక ఎత్తు.. తాజాగా పెట్టిన మరో ఎత్తు అన్నట్టు ఉంది పరిస్థితి. తాజాగా ప్రకాష్ రాజ్ పెట్టిన ఓ పోస్ట్ ఆయన ఆలోచనను తెలియజేస్తోంది.’ పవన్ రాజకీయాల్లో ఫుట్ బాల్ లాంటివారు. ఆయనను ఎవరైనా ఉపయోగించుకుంటారు. ఆయన చెబుతున్నట్టు సనాతన ధర్మం, హిందూ మతం ప్రమాదంలో లేవు. బిజెపి మాత్రమే ఇబ్బందుల్లో ఉంది. యాక్టర్ గా వివిధ చిత్రాల్లో వేరువేరు పాత్రలు పోసిస్తారు. రాజకీయాల్లో అలా కాదు. ఓ స్థిరమైన ఆలోచన ఉండాలి. అది ఆయన తెలుసుకోవాలి’ అంటూ హితవు పలుకుతూ ప్రకాష్ రాజ్ పోస్ట్ చేశారు. తద్వారా బిజెపి లైన్లో పవన్ ఉన్నారని తెలియజెప్పే ప్రయత్నం చేశారు. ఇన్నాళ్లకు ప్రకాష్ రాజ్ అంతరంగం బయటపడిందని.. కేవలం బిజెపి విధానాలను పవన్ అమలు చేస్తున్నారని అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.