https://oktelugu.com/

Nainika Elimination: నైనిక ఎలిమినేషన్ కు కారణం అదే.. జానీ మాస్టర్ గురించి నైనిక తల్లి ఏమందంటే..

షో ప్రారంభంలో నైనిక ఎంతో ఎనర్జిటిక్ గా కనిపించి ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసింది. ముఖ్యంగా క్లాన్‌ (టీమ్‌) లీడర్‌గా ఎదిగేందుకు నైనిక ఆడిన గేమ్ బిగ్ బాస్ అభిమానుల మనసులు గెల్చుకుంది. హౌస్ లో అబ్బాయిలకు గట్టి పోటీ ఇచ్చిన ఏకైక కంటెస్టెంట్ గా నిలిచింది ఈ అమ్మడు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : October 7, 2024 / 12:28 PM IST

    Nainika Elimination

    Follow us on

    Nainika Elimination: బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 8 దూసుకొని పోతుంది. సెప్టెంబర్ 1న అట్టహాసంగా మొదలైన ఈ టీవీ రియాలిటీ షోలో ఇప్పటికే ఐదు వారాలు పూర్తయ్యాయి. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ అడుగు పెట్టగా ఐదు వారాల్లో ఏకంగా ఆరుగురు కంటెస్టెంట్స్ ఇప్పటికే బయటకు వెళ్లిపోయారు. ముఖ్యంగా ఐదో వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉండడంతో ఆదిత్య ఓం బయటకు వెళ్లాల్సి వచ్చింది. ఇక వీకెండ్ లో పొట్టి పిల్ల, ఢీ ఫేమ్ నైనిక ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. మరో వైపు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఇప్పుడు ఎంట్రీ ఇచ్చింది ఎవరు? వెళ్లిన నైనికా ఎంత సంపాదించింది అనే వివరాలు తెలుసుకుందాం.

    షో ప్రారంభంలో నైనిక ఎంతో ఎనర్జిటిక్ గా కనిపించి ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసింది. ముఖ్యంగా క్లాన్‌ (టీమ్‌) లీడర్‌గా ఎదిగేందుకు నైనిక ఆడిన గేమ్ బిగ్ బాస్ అభిమానుల మనసులు గెల్చుకుంది. హౌస్ లో అబ్బాయిలకు గట్టి పోటీ ఇచ్చిన ఏకైక కంటెస్టెంట్ గా నిలిచింది ఈ అమ్మడు. ఆ తర్వాత ఎందుకో పూర్తిగా స్లో అవడంతో అభిమానులు కూడా డల్ అయ్యారు. క్లాన్‌ చీఫ్‌గా పెద్దగా ప్రభావం చూపించలేదనే చెప్పాలి. ఆటలోనూ నిరుత్సాహపరిచడంతో ఆమెకు ఓట్లు తక్కువ వచ్చాయి.. స్నేహితులతో ముచ్చట్లు పెట్టడం తప్ప టాస్కులు, గేమ్స్ లో పెద్దగా యాక్టివ్ గా లేదు అమ్మడు. నైనిక ఆట తీరును చూసి నాగార్జున ఆశ్చర్యపోయారు కూడా. ‘ నైనిక నీ గేమ్‌ ఎటు పోయింది? నీలో ఫైర్‌ ఏమైపోయింది’ అంటూ కింగ్ ప్రశ్నించారు కూడా.

    ఈ క్రమంలోనే ఐదో వారం నామినేషన్స్ లో నిలిచిన ఈ అమ్మడును ఆడియన్స్ బయటకు పంపారు. అంటే అందరూ ఊహించినట్లే నైనిక ఎలిమినేట్ అయ్యింది. ఇక ఈ పొట్టి పిల్ల రెమ్యునరేషన్ విషయానికి వస్తే మిగతా కంటెస్టెంట్స్ కంటే గట్టిగానే అందుకుందట. వారానికి రూ.2.20 లక్షల లెక్కన మొత్తం ఐదు వారాలకుగానూ 11 లక్షల పారితోషికం తీసుకుందని టాక్. నైనికా విషయం ఇలా ఉంటే ఈసారి అల్లరి పిల్ల ప్రేక్షకుల అభిమానం గెలుచుకున్న ఆ స్టార్ అమ్మడు ఎంట్రీ ఇచ్చింది.

    నైనిక బిగ్ బాస్ లో మరింత ముందుకెళ్లాలని ఆమె తల్లి ప్రమోషన్స్ కూడా బాగానే చేసింది. ఈ క్రమంలో ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నైనిక తల్లి మాట్లాడి ఇంట్రెస్టింగ్ విషయాలను తెలిపింది.. నైనిక బిగ్ బాస్ కి వెళ్ళాలి అని ముందే కోరుకుందట. సడెన్ గా ఛాన్స్ వచ్చేసరికి మొదట నేను నమ్మలేదట. అయితే నైనికకు గణేష్ మాస్టర్ వద్ద, జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఛాన్సులు వచ్చాయి అని తెలిపింది. అయితే జానీ మాస్టర్ దగ్గరికి వద్దు అని శశి మాస్టర్ చెప్పారని తెలిపింది. దీంతో జానీ మాస్టర్ వద్దకు వెళ్లలేదట. తను నటిగా కూడా మారాలి అనుకోవడంతో ఆ వైపు కూడా అడుగులు వేసిందట. అప్పుడప్పుడు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా వెళ్లి వర్క్ చేస్తుంటుందట.