https://oktelugu.com/

America : చెదురుతున్న డాలర్‌ డ్రీమ్‌.. అమెరికాలో తగ్గిపోతున్న అవకాశాలు.. కారణం ఇదే

అమెరికాలో ఉన్నత చదువులు చదవాలి.. అక్కడే ఉద్యోగం సాధించాలి.. వీలైతే అక్కడే సిర్థపడాలి. ఇదీ నేటితరం కల. పిల్లల డాలర్‌ డ్రీమ్‌ నెరవేర్చేందుకు తల్లిదండ్రులు కూడా సహకరిస్తున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : October 7, 2024 / 12:42 PM IST

    America

    Follow us on

    America :  డిగ్రీవరకు భారత్‌లో చదివి.. ఉన్నత చదువుల అబ్రాడ్‌లో చదవాలి.. మత పిల్లలు జీవితంలో ఉన్నతస్థాయిలో స్థిరపడాలి.. ఇదీ నేటితరం తల్లిదండ్రుల ఆలోచన. ఇక చదివితే అబ్రాడ్‌లోనే చదవాలి.. అక్కడే కొలువు కొట్టాలి. అక్కడే స్థిరపడాలి. అక్కడి సొమ్ముతో భారత్‌లో పెట్టుబడులు పెట్టాలి. ఇదీ నేటితరం యువతరం ఆలోచన. దీనిని నెరవేర్చుకునేందుకు యువత చాలా కష్టపడుతోంది. ఇక తల్లిదండ్రుల కూడా పిల్లల డాలర్‌ డ్రీమ్‌ నెరవేర్చేందుకు ఆదాయం కూడబెడుతున్నారు. అప్పో సప్పో చేసి ఉన్నత చదువులు చదివిపిస్తున్నారు. అన్నీ కుదిరితే అబ్రాడ్‌కు పంపుతున్నారు. కరోనా ముందు వరకు అబ్రాడ్‌ చదువులు బాగానే సాగాయి. చదువు పేరుతో వెళ్తున్న చాలా మంది అక్కడ చదువుతూనే సంపాదించడం అలవాటు చేసుకుంటున్నారు. ఇక్కడ చిన్నచిన్న పనులు చేయడానికి మొహమాటపడేవారు. అక్కడ షాప్‌ కీపర్లుగా, పెట్రోల్‌ బంకుల్లో, డెలివరీ బాయిస్‌గా పనిచేస్తున్నారు. ఉన్నత చదువులు చదివి అక్కడ ఏం చేసినా గౌరవంగానే ఉంటుంది. అందుకే చాలా మంది అమెరికాతోపాటు యూకే, కెనడా, జర్మని, ఫ్రాన్స్, రష్యా బాట పడుతున్నారు. చదువు కాస్త తక్కువగా ఉన్నవారు గల్ఫ్‌ దేశాలకు కూలీలుగా వెళ్తున్నారు. కరోనా తర్వాత ఆర్థిక మాంద్యం, వర్క్‌ఫ్రం హోం కల్చర్‌ పెరగడంతో చాలా కంపెనీలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీంతో ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి.

    అమెరికాలో తగ్గిన కొలువులు..
    అమెరికాలో ఉద్యోగాలు క్రమంగా తగ్గిపోతున్నాయి. పెద్దపెద్ద కంపెనీలు ఇప్పటికే ఉన్న కొలువులను కోత విధిస్తున్నాయి. ఇక కొత్త ఉద్యోగాల సంగతి అంతే. పార్ట్‌టైం జాబులు కూడా దొరకడం లేద. దీంతో విద్యార్థులు ఇప్పుడు అమెరికా కన్నా.. యూకే, కెనడా, జపాన్, జర్మనీ, ఆస్ట్రేలియా వెళ్తున్నారు. అక్కడ కూడా ఆ దేశౠలకూ వలసలు పెరగడం కారణంగా ఆయా దేశాలు కూడా నిబంధనలు కఠినతరం చేస్తున్నాయి. స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విదేశాల్లో కొలువు కల చెదురుతోంది.

    సంక్షోభం ఇలా..
    ఇక విదేశాల్లో ఉద్యోగుల సంక్షోభం ఎలా ఉందో చూస్తే విదేశాలకు వెళ్లాలనే ఆందోళన పెరుగుతోంది. తాజాగా కెనడాలో ఒక సూపర్‌వైజర్‌ పోస్టుకు ఇటీవల నోటిఫికేషన్‌ ఇచ్చారట. దీని కోసం 3 వేల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో భారతీయులే 1,800 మంది వరకు ఉండడం గమనార్హం. నిరుద్యోగ రేటుకు నిదర్శనం. అక్కడే సంపాదించి, అక్కడి ఖర్చులు తీర్చుకోవానుకునేవారు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు. మళ్లీ తల్లిదండ్రులపై ఆధారపడుతున్నారు. చదువుకునే సమయంలో అవకాశాలు లేక ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కెనడా, ఆస్ట్రేలియా విధించిన ఆంక్షలు, పెంచిన అద్దెలు భరించలేక స్వదేశానికి వస్తున్నారు.