Pawan Kalyan: సినిమా నటులు రాజకీయాల్లోకి రావడం కొత్తకాదు. దశాబ్దాలుగా మన దేశంలో ఈ ట్రెండ్ కొనసాగుతోంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. ఇలా అన్ని భాషల నుంచి నటీనటులు రాజకీయాల్లో ఉన్నారు. కొందరు జాతీయ పార్టీల్లో ఉంటే.. కొందరు ప్రాంతీయ పార్టీల్లో ఉన్నారు. కొందరు కేంద్ర మంత్రులు అయితే కొందరు ముఖ్యమంత్రులు అయ్యారు. ఎలాంటి అనుభవంతో పనిలేకుండా సుపరి పాలన అందించారు. అయితే తాజాగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పాలనా అనుభంపై చేసిన వ్యాఖ్యలు ఇటు ఆయన అభమానులు, ఆయన సామాజికవర్గ ఓటర్లను ఆశ్చర్యపరిచాయి.
Also Read: ఇంగ్లాండ్ 600 టార్గెట్ చేజ్ చేస్తుందా.. గత చరిత్ర ఏం చెబుతోందంటే?
తెలుగు, తమిళ రాజకీయాల్లో సినీ తారలు నేరుగా రాజకీయాల్లోకి వచ్చి, పాలనా అనుభవం లేకుండానే ముఖ్యమంత్రి పదవిని అధిరోహించిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. తమిళనాడులో ఎంజీఆర్, జయలలిత, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ నటన నుంచి రాజకీయాల్లోకి వచ్చి, ప్రజాదరణతో అధికారం చేపట్టారు. వీరిలో ఎవరికీ ముందుగా పాలనా అనుభవం లేదు. అయినా, సంక్షేమ పాలన, ప్రజల మనస్సుల్లో స్థిరమైన గుర్తింపు సాధించారు. పవన్ కళ్యాణ్ 2024లో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యాటకం, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి శాఖలను నిర్వహిస్తున్నారు. ఏడాది కాలంగా ఆయన పాలనా అనుభవాన్ని సంపాదిస్తున్నారు. అయినప్పటికీ, ఇటీవల సభల్లో ‘నాకు పాలనా అనుభవం లేదు‘ అని చెప్పడం చర్చనీయాంశమైంది.
రాజకీయ వ్యూహంలో భాగమా?
పవన్ కళ్యాణ్‌పై ముఖ్యమంత్రి పదవిపై కొన్ని సామాజిక వర్గాల్లో భారీ ఆశలు పెట్టుకున్నాయి. కానీ, ఆయన మాత్రం తనకు పాలనా అనుభవం లేదని చెప్పడం, ఆ ఆశలకు కొంత నిరాశ కలిగించింది. గతంలో ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత వంటి నాయకులు అనుభవం లేకపోయినా ప్రజల సంక్షేమాన్ని ముందుకు పెట్టి పాలన చేశారు. అనుభవం కన్నా నిబద్ధత, ప్రజలపై ప్రేమ, మంచి పాలనకు కీలకం అంటున్నారు విశ్లేషకులు. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వెనుక తనను నిరాడంబరంగా చూపించుకోవాలన్న వ్యూహం ఉండొచ్చు అని పేర్కొంటున్నారు. అలాగే, పాలనా లోపాలను ముందుగానే ఒప్పుకోవడం ద్వారా భవిష్యత్ విమర్శలకు తగిన రక్షణ కల్పించుకోవాలన్న ఉద్దేశం కూడా ఉండవచ్చని అంటున్నారు.
అనుభవం కొలమానం కాదు..
భారత రాజ్యాంగంలో ముఖ్యమంత్రి, మంత్రి పదవులకు పాలనా అనుభవం తప్పనిసరి అని ఎక్కడా లేదు. వయస్సు, విద్యార్హతలకు మాత్రమే పరిమితులు ఉన్నాయి. పాలనా వ్యవస్థలో నిపుణులైన అధికారుల సహకారం ఉండటం వల్ల, నాయకుడి నిబద్ధత, దృక్పథమే ముఖ్యమని రాజ్యాంగం సూచిస్తోంది.
చంద్రబాబు గారు లేకపోతే ఆర్థిక పరిస్థితి చక్కదిద్దేవాళ్లు ఉండరు
– నాకు పోరాడే శక్తి ఉన్నా.. అనుభవం లేదు
– అందుకే 15 ఏళ్ల పాటు కూటమి ఉండాలని కోరుకుంటున్నాచిన్న చిన్న సమస్యలు ఉంటే కూర్చుని మాట్లాడుకుందాం
– డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ pic.twitter.com/T7QWYfblmO— మన ప్రకాశం (@mana_Prakasam) July 4, 2025