Dhee 20 Mega Latest Promo : బుల్లితెర స్టార్ కమెడియన్ హైపర్ ఆది పంచులు ఎంత నవ్వు తెప్పిస్తాయో అదే స్థాయిలో వివాదాలు రాజేస్తాయి. కాంటెంపరరీ, పొలిటికల్ ఇష్యూస్ మీద ఆయన జోక్స్ వేస్తారు. జబర్దస్త్ వేదికగా కొందరు పొలిటికల్ లీడర్స్, యాక్టర్స్ పై ఆయన వేసిన ఇండైరెక్ట్ పంచులు వివాదాస్పదం అయ్యాయి. వ్యతిరేకత తలెత్తడంతో హైపర్ ఆది క్షమాపణలు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం బుల్లితెర మీద హైపర్ ఆది హవా కొనసాగుతుంది. ముఖ్యంగా ఈటీవీలో ప్రసారం అయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ డాన్స్ రియాలిటీ షోకి అతడే ప్రధాన ఆకర్షణ.
Also Read: ఇంగ్లాండ్ 600 టార్గెట్ చేజ్ చేస్తుందా.. గత చరిత్ర ఏం చెబుతోందంటే?
జబర్దస్త్ నుండి బయటకు వచ్చిన హైపర్ ఆది(HYPER AADI) మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షోలో సందడి చేస్తున్నారు. ఈ రెండు షోలలో హైపర్ ఆదిదే పై చేయి. జడ్జెస్, కమెడియన్స్, చివరికి గెస్ట్ ల మీద కూడా పంచులు వేస్తాడు. హైపర్ ఆది మీద పంచులు వేసే వారే ఉండరు. చాలా అరుదుగా అతడిని టార్గెట్ చేస్తారు. హైపర్ ఆది పంచ్ ల ప్రవాహం అప్పుడప్పుడు గతి తప్పుతుంది. అతని జోక్స్ హర్ట్ చేసినా భరించాల్సిందే. ఎందుకంటే అంతగా హైపర్ ఆది ఆధిపత్యం కొనసాగుతుంది.
ఇటీవల ఢీ 20(DHEE 20) స్టార్ట్ అయ్యింది. కొత్తగా రెజీనా కాసాండ్రా జడ్జి సీట్లోకి వచ్చింది. నందు యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. లేటెస్ట్ ఎపిసోడ్ కోసం రీ రిలీజ్ థీమ్ ని ఎంచుకున్నారు. దీనిలో భాగంగా హిట్ సినిమాల్లోని సాంగ్స్ ని డాన్స్ టీమ్స్ పెర్ఫార్మన్స్ చేస్తున్నాయి. మణికంఠ ‘నరసింహ’ సినిమాలోని సాంగ్స్ కి పెర్ఫార్మన్స్ చేశాడు. తన టీం సభ్యులతో వేదిక మీదకు వచ్చిన హైపర్ ఆది… భూమిక అనే డాన్సర్ తో.. నువ్వు ఏ సినిమా సెలెక్ట్ చేసుకున్నావని అడిగాడు. నేను గబ్బర్ సింగ్ అని భూమిక బదులిచ్చింది.
నువ్వు గబ్బర్ సింగ్ అయితే నేను యువరాజ్ సింగ్.. ఊ అంటే ఆరు సిక్సులే.. అంటూ డబుల్ మీనింగ్ పంచ్ వేశాడు హైపర్ ఆది. అందరూ గట్టిగా నవ్వేశారు. చివరికి భూమిక సైతం నవ్వేసింది. హైపర్ ఆది మాత్రం కొంచెం హద్దులు దాటాడేమో అనిపించింది. ఆ పంచ్ లో అంత ద్వందార్థం ఏమీ లేదని హైపర్ ఆది అభిమానులు సమర్థిస్తున్నారు. మరోవైపు హైపర్ ఆది నటుడిగా కూడా బిజీ అవుతున్నాడు. పలు చిత్రాల్లో కమెడియన్ గా కనిపిస్తున్నారు. రచయితగా కూడా పని చేస్తున్నట్లు తెలుస్తుంది.