Chandrababu And Pawan: నామినేటెడ్ పోస్టుల్లో ఏ పార్టీ వాటా ఎంత?చంద్రబాబు, పవన్ కసరత్తు

వైసిపి ప్రభుత్వం పెద్ద ఎత్తున సలహాదారులతో పాటు కార్పొరేషన్లకు కార్యవర్గాలను నియమించింది. నామినేటెడ్ పోస్టులతో భర్తీచేసింది. పెద్ద ఎత్తున కుల కార్పొరేషన్లను సైతం ఏర్పాటు చేసింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం అధికార యంత్రాంగంలో నియామకాలు మాత్రమే పూర్తి చేసింది. కీలకమైన సలహాదారులతో పాటు కార్పొరేషన్ చైర్మన్లు, కార్యవర్గ సభ్యుల నియామకం ఇంతవరకు చేపట్టలేదు. అందుకే వాటి భక్తి పై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం.

Written By: Dharma, Updated On : July 8, 2024 1:11 pm

Chandrababu And Pawan

Follow us on

Chandrababu And Pawan: కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఏపీలో ప్రాధాన్యత ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టింది.ఇప్పటికే పింఛన్లు పంపిణీ ప్రక్రియ పూర్తయింది. డీఎస్సీ నోటిఫికేషన్కు కసరత్తు జరుగుతోంది.పాలనాపరమైన అంశాలు గాడిన పడుతున్నాయి. ఇటువంటి తరుణంలో నామినేటెడ్ పదవుల భర్తీపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.మూడు పార్టీల కూటమి ప్రభుత్వం కావడంతో.. నామినేటెడ్ పదవుల పంపకాలు సజావుగా జరపాలని చంద్రబాబుతో పాటు పవన్ భావిస్తున్నారు.తమ పార్టీ నుంచిఆశిస్తున్న పదవులపై పవన్ కళ్యాణ్ కీలక ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబుకు ప్రత్యేక నివేదిక కూడా ఇచ్చినట్లు సమాచారం. దీంతో రాష్ట్రస్థాయిలో పదవుల పందారానికి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

వైసిపి ప్రభుత్వం పెద్ద ఎత్తున సలహాదారులతో పాటు కార్పొరేషన్లకు కార్యవర్గాలను నియమించింది. నామినేటెడ్ పోస్టులతో భర్తీచేసింది. పెద్ద ఎత్తున కుల కార్పొరేషన్లను సైతం ఏర్పాటు చేసింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం అధికార యంత్రాంగంలో నియామకాలు మాత్రమే పూర్తి చేసింది. కీలకమైన సలహాదారులతో పాటు కార్పొరేషన్ చైర్మన్లు, కార్యవర్గ సభ్యుల నియామకం ఇంతవరకు చేపట్టలేదు. అందుకే వాటి భక్తి పై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వివరాలు అందించాలని సాధారణ పరిపాలన శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. వీటితో పాటు సొసైటీ, ప్రత్యేక బాడీలో ఉన్న పోస్టుల వివరాలను కోరారు.

టిడిపి,జనసేన,బిజెపి కూటమి పార్టీలుగా ఉన్నాయి. సీట్ల సర్దుబాటు ప్రాతిపదికన నామినేటెడ్ పోస్టులు సైతం కేటాయించాల్సి ఉంటుంది. అందుకే కూటమిలోని పార్టీలు ఏ పార్టీకి ఎన్ని పోస్టులు ఇవ్వాలి, ఏ పోస్టులు ఎవరికి ఇవ్వాలి అనే అంశంపై కసరత్తు జరుగుతోంది. వివిధ శాఖల్లో సుమారు 95 కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.వీటిల్లో 25 చైర్మన్ పోస్టులు జనసేన కోరినట్లు తెలుస్తోంది.2014లో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు నామినేటెడ్ పోస్టులు ఇతర పార్టీలకు కేటాయించలేదు.అప్పట్లో జనసేన ప్రత్యేక ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో ఆ ప్రస్తావన లేకుండా పోయింది. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు. మూడు పార్టీలకు నామినేటెడ్ పోస్టులు కేటాయించాల్సి ఉంటుంది.

తెలుగుదేశం పార్టీలో ఆశావహుల సంఖ్య అధికంగా ఉంది. పొత్తులో భాగంగా ఆ పార్టీ 31చోట్ల సీట్లను వదులుకుంది. మరో 8 పార్లమెంట్ స్థానాల్లో సైతం ఆ పార్టీ అభ్యర్థులు వెనక్కి తగ్గక తప్పలేదు. వివిధ సమీకరణలో భాగంగా చాలామంది నేతలకు టిక్కెట్లు దక్కలేదు. వారందరికీ నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుంది. మరో మూడేళ్ల వరకు ఎమ్మెల్సీ పోస్టులు కూడా ఖాళీ అయ్యే అవకాశం లేదు. అందుకే నామినేటెడ్ పోస్టుల భర్తీ కొత్త ప్రభుత్వానికి కత్తి మీద సాము.ఆ రెండు పార్టీలకు సర్దుబాటు చేయాలి.టిడిపి నాయకులకు న్యాయం చేయాలి. అందుకే పవన్ తో కలిసి చాలా జాగ్రత్తగా కసరత్తు చేస్తున్నారు చంద్రబాబు. ఒకటి రెండు రోజుల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొలిక్కి రానున్నట్లు తెలుస్తోంది.