https://oktelugu.com/

HIV Virus: HIV కి మందు వచ్చేసింది.. ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి?

తాజాగా ప్రపంచవ్యాప్తంగా హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ వ్యాధితో బాధపడుతున్నవారికి పూర్తి ఉపశమనం లభించింది. హెచ్ఐవీని తగ్గించే మందుల పరీక్షలు సక్సెస్ అయ్యాయని ఉగాండలోని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఈ ఇంజక్షన్ ను సంవత్సరానికి రెండు సార్లు అంటే ఆరునెలలకు ఒకసారి తీసుకోవాలట. ఇలా చేడయం వల్ల HIV పూర్తిగా తగ్గుతుంది అంటున్నారు దక్షిణాఫ్రికా, ఉగాండాలో పరీక్షలు నిర్వహించిన నిపుణులు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : July 8, 2024 / 01:16 PM IST

    HIV Virus

    Follow us on

    HIV Virus: HIV కేసుల్లో భారతదేశమే అగ్రస్థానంలో ఉందంటున్నారు నిపుణులు. ఇక ఈ వ్యాధికి 2004 నుంచి యాంటీ రెట్రోవైరల్ మందులను ఉచితంగా సరఫరా చేస్తుంది ప్రభుత్వం. బాధితులు కూడా వీటిమీదనే ఆధారపడుతున్నారు. ఇవి కేవలం ఉపశమనానికి మాత్రమే అందిస్తున్నారు. పూర్తిగా నివారించడానికి ఇంతవరకు సరైన మందులు రాలేదు. దీనివల్ల ఎంతో మంది మరణిస్తున్నారు. అయితే ఇప్పుడు హెచ్ఐవీ ఉన్నవారికి గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే దీన్ని పూర్తిగా నయం చేసే మందు వచ్చేసింది అంటున్నారు. ఇది నిజమేనా? ఓ సారి చూసేయండి.

    తాజాగా ప్రపంచవ్యాప్తంగా హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ వ్యాధితో బాధపడుతున్నవారికి పూర్తి ఉపశమనం లభించింది. హెచ్ఐవీని తగ్గించే మందుల పరీక్షలు సక్సెస్ అయ్యాయని ఉగాండలోని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఈ ఇంజక్షన్ ను సంవత్సరానికి రెండు సార్లు అంటే ఆరునెలలకు ఒకసారి తీసుకోవాలట. ఇలా చేడయం వల్ల HIV పూర్తిగా తగ్గుతుంది అంటున్నారు దక్షిణాఫ్రికా, ఉగాండాలో పరీక్షలు నిర్వహించిన నిపుణులు.

    ఈ ఇంజక్షన్ వల్ల హెచ్ఐవీ నుంచి బాధితులను కాపాడవచ్చట. దీనిపేరు ‘లెన్‌కావిర్’. మరి ఈ ఇంజెక్షన్ రోజూవారీ మందులు కంటే మెరుగైందా? లేదా అనే అంశం మీద కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ మూడు ఔషదాలు ‘ప్రీ-ఎక్స్‌పోజర్ ప్రొఫిలాక్సిస్ డ్రగ్స్ అంటున్నారు శాస్త్రజ్ఞులు.

    దీని కోసం ఏకంగా 2,134 మంది యువతలో పరీక్షలు చేశారట.‘లెన్‌కావిర్’ ఇంజెక్షన్ ను తీసుకున్న వారిలో ఏ ఒక్కరికి హెచ్‌ఐవీ సోకలేదట. అంటే వందకి వంద శాతం ప్రయోగం సక్సెస్ అంటున్నారు నిపుణులు. ఇక ట్రువడ డ్రగ్స్ ని 1,068 మంది యువతులు తీసుకుంటే అందులో 16 మందికి HIV సోకిందట. ఇక ఈ ఇంజక్షన్ ను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు యుగాండ శాస్త్రజ్ఞులు.