https://oktelugu.com/

Director Shankar: రామ్ చరణ్ లో ఉన్న ఆ ఒక్క విషయం వల్లే ఆయన గ్లోబల్ స్టార్ అయ్యారు అంటున్న శంకర్…

రామ్ చరణ్ గురించి శంకర్ చెప్పడం నిజంగా మెగా అభిమానుల్లో ఒక ఉత్సాహాన్ని నింపిందనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే గేమ్ చేంజర్ సినిమా గురించి మాట్లాడుతూ రామ్ చరణ్ కి సంబంధించిన షూటింగ్ మొత్తం అయిపోయిందట. ఇక మిగతా వేరే నటులతో బ్యాలెన్స్ ఉన్న షూట్ ను కూడా తొందర్లోనే కంప్లీట్ చేసి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తానని ఒక హామీ అయితే ఇచ్చాడు.

Written By:
  • Gopi
  • , Updated On : July 8, 2024 / 01:07 PM IST

    Director Shankar

    Follow us on

    Director Shankar: మెగాస్టార్ తనయుడు గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ మొదటి సినిమాతోనే తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నా కూడా తనకంటూ ఒక సపరేట్ క్యారెక్టర్జేషన్ ని ఏర్పాటు చేసుకున్నాడు, అలాగే ఒక కొత్త స్టైల్ ను అలవర్చుకొని అటు చిరంజీవి, ఇటు పవన్ కళ్యాణ్ మేనియా లను మిక్స్ చేసి మెగా పవర్ స్టార్ గా ఎదిగాడు.

    ఇక ఇలాంటి క్రమం లోనే ప్రస్తుతం ఆయన శంకర్ తో ‘గేమ్ చేంజర్’ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా దర్శకుడు అయిన శంకర్ రీసెంట్ గా ‘భారతీయుడు 2 ‘ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశాడు. ఇక అందులో భాగంగా ఆయన చరణ్ గురించి మాట్లాడుతూ రామ్ చరణ్ చాలా ప్రత్యేకమైన హీరో ఆయన లో ఒక పవర్ ఉంటుంది. ఏ సీన్ లో అయిన తను అల్టిమేట్ గా నటించి మెప్పించాలని చూస్తూ ఉంటాడు.

    అందువల్లే ఆయన గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. అంటూ రామ్ చరణ్ గురించి శంకర్ చెప్పడం నిజంగా మెగా అభిమానుల్లో ఒక ఉత్సాహాన్ని నింపిందనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే గేమ్ చేంజర్ సినిమా గురించి మాట్లాడుతూ రామ్ చరణ్ కి సంబంధించిన షూటింగ్ మొత్తం అయిపోయిందట. ఇక మిగతా వేరే నటులతో బ్యాలెన్స్ ఉన్న షూట్ ను కూడా తొందర్లోనే కంప్లీట్ చేసి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తానని ఒక హామీ అయితే ఇచ్చాడు.

    ఇక దాంతో అభిమానులందరూ చాలా సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి శంకర్ రామ్ చరణ్ ని ఎలాంటి క్యారెక్టర్ లో చూపిస్తాడో, ఇక అలాగే ఈ సినిమా విజువల్ వండర్ గా తెరకెక్కబోతుందట. ఇక ఇదిలా ఉంటే ఈ నెల 12వ తేదీన శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘భారతీయుడు 2’ సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా ప్రస్తుతం ఆయన ఈ సినిమా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తోంది…