Chandrababu: సాధారణంగా రాజకీయాల్లో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. సోషల్ మీడియా( social media) వచ్చాక నేతలు ప్రజలతో మమేకమైన తీరుపై తెగ ప్రచారం నడుస్తోంది. వైసిపి హయాంలో ఐపాక్ స్క్రిప్ట్ ప్రకారం నటీనటులు వచ్చేవారు. జగన్ పర్యటనల సమయంలో ఎలివేషన్ ఇచ్చేవారు. అయితే మొన్నటి జగన్ జైలు సందర్శన సమయంలో.. ఓ పదేళ్ల లోపు బాలిక అద్భుతంగా నటించడం.. తరువాత అది ఐ ప్యాక్ స్క్రిప్టు అని తేలడం కూడా వైసీపీని మరింత పలుచన చేసింది. ఇటీవల ఓ దివ్యాంగుడు మాదిరిగా వైసీపీ కార్యకర్త పింఛన్ తొలగించారంటూ చెప్పడం.. ఆయన దివ్యాంగుడు కాదని తేలడం కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసింది. తద్వారా గతంలో జగన్ ప్రజలతో మమేకం సమయంలో కూడా ఫేక్ అని అందరూ భావిస్తున్నారు. అయితే ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. సామాన్య జనాలతో ఆయన మమేకం అవుతున్న తీరు మాత్రం ఆకట్టుకుంటోంది. ఎక్కడ ఫేక్ అని అనిపించేలా.. నిరూపించే పరిస్థితి లేకుండా సామాన్యులతో.. తనదైన సహజ రీతులతోనే చంద్రబాబు మమేకం అవుతున్నారు. చంద్రబాబు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎలివేట్ అవుతూ వస్తున్నారు.
Also Read: టీ బీజేపీలో కలహాలు.. రామచందర్‌రావు గుర్తించట్లేదా?
* అప్పట్లో ప్రజలకు దూరంగా..
2014లో అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party). నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ప్రజల మధ్య ఎక్కువగా తిరిగారు. కానీ భద్రతాపరమైన కారణాలు, పాలనాపరమైన ఒత్తిడి నేపథ్యంలో ఆయన ఎక్కడికి వెళ్లినా.. తన పనులు చూసుకుని వెనుతిరిగేవారు. ప్రజలతో మాట్లాడే వారు కానీ.. అంతగా ఇంటరాక్షన్ కాలేకపోయేవారు. అయితే గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రయత్నించారు. కానీ అదంతా కృత్రిమ మేనని విమర్శలు వచ్చాయి. ఒకటి రెండు ఘటనలు కూడా వెలుగులోకి రావడంతో అది నిజమేనని ఎక్కువమంది నమ్ముతున్నారు.
* మన సీఎం అనేలా..
అయితే అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఘన విజయం సాధించారు చంద్రబాబు( CM Chandrababu). గత అనుభవాల దృష్ట్యా ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. వారితో కలిసి.. వారి పక్కనే కూర్చుని.. వారితో ముచ్చటించేందుకు ప్రయత్నిస్తున్నారు. అది కూడా చాలా చనువుగా ఉంటున్నారు. మన సీఎం అనుకునే స్థాయిలో అందరితో మమేకం అవుతున్నారు. ప్రతి నెల పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని.. పేదల ఇంట ఎక్కువగా గడుపుతున్నారు. వారి కష్ట సుఖాలను తెలుసుకుంటున్నారు. జిల్లాల సందర్శనకు వెళ్ళినప్పుడు ప్రైవేటు ఆటోలు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి తోటి ప్రయాణికులతో ముచ్చటిస్తున్నారు. అయితే ఈ విషయంలో చంద్రబాబు మారిన తీరు చూస్తుంటే ప్రతి ఒక్కరికి ముచ్చట వేస్తోంది. తమ కుటుంబ సభ్యుడని భావన వచ్చేలా చేస్తోంది.