Homeఆంధ్రప్రదేశ్‌Vivekananda Reddy impact: బ్యాలెట్ పత్రాలలో.. 'పులివెందుల' ప్రజల ఆక్రందనలు!

Vivekananda Reddy impact: బ్యాలెట్ పత్రాలలో.. ‘పులివెందుల’ ప్రజల ఆక్రందనలు!

Vivekananda Reddy impact: పులివెందుల( pulivendula) ఫలితం పై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మూడు దశాబ్దాల తర్వాత పులివెందులలో ఏకగ్రీవానికి ఫుల్ స్టాప్ పడింది. జడ్పిటిసి స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కకపోవడం ఆ పార్టీ శ్రేణులను సైతం విస్మయపరిచింది. అధికార దుర్వినియోగంతోనే టిడిపి గెలిచిందని చెబుతున్నా.. లోలోపల మాత్రం ఆ పార్టీకి భయం వెంటాడుతోంది. మరోవైపు లెక్కింపు సందర్భంగా బ్యాలెట్ బాక్సులు తెరిచిన అధికారులకు.. బ్యాలెట్ తో పాటు కొన్ని స్లిప్పులు కూడా లభించాయి. వాటిని చూసిన అధికారులు షాక్ కు గురయ్యారు.

స్వేచ్ఛగా ఓటింగ్..
11 మంది అభ్యర్థులు పోటీ చేసిన ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ( Telugu Desam Party)భారీ విజయం సాధించింది. ఇన్నేళ్ల ప్రజాస్వామ్య సంకెళ్లను ఓటింగ్ తో స్వేచ్ఛ వచ్చింది. టిడిపి సంబరాలు చేసుకుంటే.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిర్వేదంతో ఉంది. అయితే ఈ ఎన్నికలు అక్కడి ప్రజల ఆకాంక్షను తెలియజేశాయి.’ 30 ఏళ్ల తర్వాత తాను ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ కు వచ్చాను. ఈ అవకాశానికి అందరికీ దండాలు’ అంటూ బ్యాలెట్ బాక్స్ లో ఒక చీటీ ప్రత్యక్షమైంది. దీంతో ఇన్ని రోజులు ఏకగ్రీవ నిర్ణయాలతో పులివెందుల ప్రజలు ఎంతగా విసిగిపోయారో రాష్ట్ర ప్రజలకు అర్థమవుతోంది.

Also Read: పులివెందుల గుట్టు విప్పేశారుగా.. జగన్ ప్రస్టేషన్ అదే!

ప్రభావం చూపిన వివేకా హత్య..
పులివెందులలో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ఓడిపోవడానికి వివేకానంద రెడ్డి మరణం కూడా ఒక కారణం. సొంత కుటుంబ సభ్యులే హత్య చేయించారని పులివెందుల ప్రజలు బలంగా నమ్మారు. దానిని కూడా ఈ ఎన్నికలో బయటపెట్టారు.’ మా వివేకా సార్ కి న్యాయం చేయండి సార్’ అంటూ రాసిన ఒక చీటీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది ఓ ఓటర్ రాసి బ్యాలెట్ బాక్స్ లో పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో వివేకానంద రెడ్డి హత్య అక్కడి ప్రాంత ప్రజలను ఎంతలా కలచివేసిందో, ఆ తర్వాత జరిగిన పరిణామాలు వారిలో ఎంతటి నిస్సహాయతను తెచ్చి పెట్టాయో.. స్పష్టమవుతుంది. అయితే ప్రస్తుతం ఈ బ్యాలెట్ బాక్స్ లలో బయటపడిన చీటీలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular