War 2 Day1 Box Office Collections: ఎన్టీఆర్(Junio NTR),హృతిక్ రోషన్(Hrithik Roshan) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వార్ 2′(War 2 Movie) చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా పై డివైడ్ టాక్ ప్రభావం చాలా గట్టిగానే పడింది. మొదటి రోజు తెలుగు వెర్షన్ వసూళ్లు ఎలా ఉన్నాయంటే ట్రేడ్ పండితులు కూడా ఆశ్చర్యపోయి తల పెట్టుకునేలా ఉన్నాయి. ఎలాంటి డిజాస్టర్ టాక్ వచ్చినా కూడా అద్భుతమైన ఓపెనింగ్ వసూళ్లను రాబట్టే స్టామినా ఉన్న ఎన్టీఆర్ కి ఇలాంటి నంబర్లు చూసి అభిమానులు ఏడవడం ఒక్కటే తక్కువ. రభస లాంటి సినిమాకు కూడా 12 ఏళ్ళ క్రితం టాప్ 3 ఓపెనింగ్స్ ని రాబట్టిన ఎన్టీఆర్ కి ఇలాంటి పరిస్థితి రావడం పై నందమూరి అభిమానులు నోరు మెదపలేకపోతున్నారు. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం.
Also Read: ‘ఎస్ఎస్ఎంబి 29’ సినిమా గ్లింప్స్.. రాజమౌళి ప్లానింగ్ మామూలుగా లేదుగా..!
నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి కేవలం 4 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. అది కూడా రిటర్న్ GST కలిపి. ఇంతటి దారుణమైన ఓపెనింగ్ ఈమధ్య కాలం లో ఏ స్టార్ హీరో కి కూడా రాలేదు. ఇక ఎన్టీఆర్ కి స్ట్రాంగ్ జోన్ గా పిలవబడే సీడెడ్ లో కూడా కేవలం నాలుగు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఎన్టీఆర్ గత చిత్రం ‘దేవర’ కి బెనిఫిట్ షోస్ నుండి వచ్చిన గ్రాస్ వసూళ్లు ఇవి. అలాంటిది ఇప్పుడు ‘వార్ 2’ కి మొదటి రోజు మొత్తానికి కలిపి వచ్చిందంటే ఎంత పెద్ద డిజాస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు. షేర్ వసూళ్లు దాదాపుగా 3 కోట్ల 20 లక్షల రూపాయిల వరకు ఉంటుంది. ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే తూర్పు గోదావరి జిల్లాలో కోటి 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా పశ్చిమ గోదావరి జిల్లాలో కోటి రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.
Also Read:కూలీ మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు..పుష్ప 2 రికార్డ్స్ కూడా ఎగిరిపోయాయిగా!
అదే విధంగా నెల్లూరు జిల్లా నుండి 80 లక్షలు రాబట్టిన ఈ సినిమాకు, కృష్ణ జిల్లా నుండి కోటి 40 లక్షలు, ఉత్తరాంధ్ర నుండి 2 కోట్ల రూపాయిలు,గుంటూరు జిల్లా నుండి 3 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 17 కోట్ల 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇవి కూడా హైర్స్ మరియు జీఎస్టీ కలుపుకొని మాత్రమే. నికార్సైన షేర్ వసూళ్లు మాత్రం కేవలం 12 కోట్ల రూపాయిల షేర్ మాత్రమే ఉంటుందని సమాచారం. అదే విధంగా వరల్డ్ వైడ్ గా తెలుగు వెర్షన్ కి 30 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, షేర్ వసూళ్లు 19 కోట్ల రూపాయిల వరకు ఉంటుందని అంచనా.