Chandrababu key comments: పులివెందుల( pulivendula) ఎన్నికల ఫలితాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి.. అక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కోల్పోవడం ఏంటనేది హాట్ టాపిక్. వైసీపీ చెబుతున్నట్లు అధికార పార్టీ అధికారాన్ని దుర్వినియోగం చేసిందే అనుకుందాం. 7000 ఓట్లు పోలైతే 600 ఓట్లు పడడం ఏంటి? బయట ప్రాంతాల నుంచి 7000 మందిని తెచ్చి టిడిపి వాళ్ళు ఓటు వేయించరా? ఇది నమ్మడానికి నిజంగా ఉందా? అంటే ఎక్కువ మంది లేదని చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఈవీయంలను మేనేజ్ చేశారని వైసిపి గగ్గోలు పెట్టింది. ఇప్పుడు మాత్రం దొంగ ఓట్లు అంటూ చెబుతోంది. పోనీ నేతలను భయపెట్టారు. మరి వైయస్ కుటుంబ అభిమానులంటూ పులివెందులలో ఉంటారు కదా. వారు అస్సలు ఓటు వేయలేదా? వారిని కూడా టిడిపి అడ్డుకుందా? అందులో ఏది నిజం.
వివరంగా చెప్పిన చంద్రబాబు..
అయితే జగన్మోహన్ రెడ్డిలో( Y S Jagan Mohan Reddy ) ఎన్నడూ లేనంత ప్రస్టేషన్ కనిపించింది. దానికి రకరకాలు కారణాలు ఉన్నాయి. ఏకంగా చంద్రబాబు వయస్సును, ఆయన చావును.. ఇలా ఏదేదో మాట్లాడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి సమయంలో సైతం ఆయన ఇంతలా దిగజారలేదు. అయితే జగన్ ఇలా ఎందుకు ఫ్రస్టేషన్కు గురవుతున్నారు చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు. ‘వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి పులివెందులలో ఏకగ్రీవాలు జరిగాయి. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన నచ్చిన వ్యక్తి మాత్రమే నామినేషన్ వేయాలి. లేకుంటే మాత్రం అహానికి పోయేవారు. ఎంత దాకైనా వెళ్లేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. పోటీ చేసేందుకు 11 మంది అభ్యర్థులు వచ్చారు. వారందరికీ భద్రత కల్పించాం. ప్రజలు కూడా స్వేచ్ఛగా వచ్చి ఓటు వేశారు. ఇది జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడలేదు. ఆయన అహం పై దెబ్బ కొట్టినట్టు అయింది. అందుకే అలా ప్రవర్తిస్తున్నారు’.. అంటూ చెప్పుకొచ్చారు చంద్రబాబు.
Also Read: ఏపీలో మహిళలకు ఉచిత ప్రయాణం.. వారికి మాత్రం 15 రోజుల తర్వాతే!
స్వేచ్ఛగా ఓటింగ్..
వైయస్ రాజశేఖర్ రెడ్డి( Y S Rajasekhara Reddy ) పులివెందులను కంచుకోటగా మార్చారు. ఆయన తనదైన రాజకీయాలు చేస్తూ ప్రజల మన్ననలు పొందారు. ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అయితే పులివెందులలో స్వేచ్ఛగా ఓటింగ్ జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చవిచూశారు. ఒకవేళ రేపు సార్వత్రిక ఎన్నికల్లో ఇదే స్వేచ్ఛ కొనసాగితే మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రమాదానికి గురికాక తప్పదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అక్కడ నేరాలు-ఘోరాలు జరిగిపోయాయని ఆరోపిస్తోంది. కానీ అంతకుమించి స్వేచ్ఛగా ఓటింగ్ జరిగిందని అధికార పార్టీ చెబుతోంది. అయితే పులివెందుల ప్రజలు మాత్రం స్వేచ్ఛగా ఓటు వేశామని చెబుతున్నారు. చివరకు బ్యాలెట్ పత్రాలతో మూడు దశాబ్దాల తర్వాత స్వేచ్ఛగా ఓటు వేసామని స్లిప్పులు పెట్టారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ బయట ప్రపంచానికి పులివెందుల గుట్టు విప్పేసారన్న ప్రస్టేషన్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అంతకుమించి ఏమీ లేదు.