Viral Video :మి పార్టీల మధ్య సమన్వయ లోపం బయటపడుతోంది. ఇప్పటివరకు టిడిపి, జనసేన మధ్య విభేదాల పర్వం బయటపడగా.. ఇప్పుడు బిజెపి నేతలతో కూడా టిడిపి నాయకులకు కలహాలు మొదలయ్యాయి. బహిరంగంగానే కార్యకర్తల ఎదుట.. మీడియా సాక్షిగా ఇరు పార్టీలకు చెందిన నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. జగన్ విశాఖ నగరంలో టిడిపి మాజీ మంత్రి వర్సెస్ బిజెపి ఎమ్మెల్యే అన్నట్టు పరిస్థితి మారింది. శనివారం జరిగిన టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బహిరంగంగానే ఘర్షణకు దిగారు. గంటా శ్రీనివాసరావు కారులో కూర్చొని సీరియస్ గా మాట్లాడుతుంటే.. విష్ణుకుమార్ రాజు కారు పక్కనే నిలబడి సమాధానం చెబుతూ ఉన్నారు.
Also Read : వైసిపి మాజీ మంత్రి వర్సెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే.. జగన్ కు కొత్త తలనొప్పి!
* పక్క నియోజకవర్గాల్లో ప్రమేయం..
2024 ఎన్నికల్లో భీమిలి నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు గంటా శ్రీనివాసరావు( Ghanta Srinivasa Rao ). అంతకుముందు ఎన్నికల్లో విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉండేవారు గంటా. అయితే ఈసారి పొత్తులో భాగంగా ఉత్తర నియోజకవర్గాన్ని బిజెపి కి కేటాయించారు. బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన విష్ణుకుమార్ రాజు గెలిచారు. అయితే కొంతకాలంగా ఒకరి నియోజకవర్గంలో ఒకరు కల్పించుకోవడంపై విభేదాలు ఉన్నాయి. భీమిలి నియోజకవర్గంలోని ఫిలింనగర్ క్లబ్ లీజు వ్యవహారంపై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కలెక్టర్ కు వినతిపత్రం అందించారు. దీనిపై గంటా శ్రీనివాసరావు తాజాగా ఫైర్ అయ్యారు. నా నియోజకవర్గమైన భీమిలిలో నాకు తెలియకుండా ఫిలింనగర్ క్లబ్బు లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం ఏమిటి? ఇలా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే సహించేది లేదు అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దీనిపై స్పందించిన విష్ణు కుమార్ రాజు మీరు అందుబాటులో లేరు కాబట్టి కలెక్టర్ ను కలిసి వినతిపత్రం ఇచ్చాం అంటూ వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు.
* గంటా తీవ్ర అసహనం
అయితే ఈ విషయంలో గంటా శ్రీనివాసరావు వాహనంలో ఉండి తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. ఆగ్రహంతో స్పందించారు. అక్కడ ఉన్న నేతలు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ గంటా శ్రీనివాసరావు ఇదేమి పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్లిపోయారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఎవరో సోషల్ మీడియాలో( social media) పెట్టారు. ప్రస్తుతం ఇది విపరీతంగా వైరల్ అవుతోంది. ఇటీవల మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యవహార శైలిలో మార్పు కనిపిస్తోంది. ఆయన ప్రవర్తన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొన్న ఆ మధ్యన విశాఖ నుంచి విమాన సర్వీసులకు సంబంధించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ప్రభుత్వ పెద్దలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
* సిటీ కూటమిలో విభేదాలు..
ఏపీ బీజేపీలో విష్ణుకుమార్ రాజు( Vishnu Kumar Raju) సీనియర్ నేతగా ఉన్నారు. విశాఖ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. విశాఖ నగర పరిధిలో ఉన్న భీమిలి నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు గెలిచారు. సిటీలోని కూటమి నేతల మధ్య విభేదాలు వెలుగు చూడడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. 15 సంవత్సరాల పాటు కలిసి ఉంటామని అధినేతలు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు మాత్రం బహిరంగంగానే మాటల యుద్ధానికి దిగుతున్నారు. మున్ముందు విశాఖ నగర రాజకీయాలు ఎటువైపునకు దారితీస్తాయో చూడాలి.
నడి రోడ్డుపై కూటమి ఎమ్మెల్యేల కొట్లాట.
విష్ణుకుమార్ రాజు పై నీ ధోరణి బాగాలేదని, ఇది తప్పంటూ నడి రోడ్ మీదనే ఫైర్ అయిన గంట శ్రీనివాసరావు.
కలెక్టర్ దగ్గరికి వెళ్లేటప్పుడు మీరు అందుబాటులో లేరని విష్ణుకుమార్ రాజు చెప్పిన నా నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటే బాగుండదని హెచ్చరిస్తూ… pic.twitter.com/dOlpvvKVua
— greatandhra (@greatandhranews) April 26, 2025