ATM : ఏటీఎంలో నుంచి డబ్బులు ఉపసంహరించుకుంటే విధించే చార్జీలను మే ఒకటవ తేదీ నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షన్ ఉంది. ఈ క్రమంలో ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేసే వినియోగదారులకు మునుపటికంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. చాలామంది ఏటీఎంలో నుంచి పదేపదే డబ్బులు విత్ డ్రా చేస్తూ ఉంటారు. అయితే అలవాటు ఉంటే వెంటనే సరిదిద్దుకోవడం మంచిది. ఎందుకంటే మే ఒకటి నుంచి ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకోవడంలో ఎక్కువ చార్జీలు విధించబడతాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా అన్ని బ్యాంకులకు ఏటీఎం ఇంటర్ చేంజ్ ఫీజులను పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. దాంతో మీరు ఏటీఎం నుంచి డబ్బులను ఉపసంహరించుకోవాలి అన్న లేదా హోమ్ బ్యాంకు నెట్వర్క్ వెలుపల ఉన్న బ్యాలెన్స్ ను తనిఖీ చేసుకోవాలి అనుకున్నా కూడా మునిపట్టి కంటే మీకు ఇప్పుడు ఎక్కువ ఖర్చు అవుతుంది.
Also Read : SIP ఇన్వెస్ట్మెంట్ చేసి ఆపేస్తున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి..
మీరు గతంలో నీ అకౌంట్ ఉన్న బ్రాంచ్ నుంచి కాకుండా వేరే ఇతర బ్రాంచ్ ఏటీఎం నుంచి డబ్బు తీసుకుంటే మీరు రూ.17 చెల్లించాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం ఇది రూ.19 కి చేరుకుంది. అలాగే గతంలో ఇతర బ్యాంకు ఏటీఎంలో నుంచి బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి ఆరు రూపాయలు చెల్లించాల్సి వచ్చేది. ప్రస్తుతం అది ఏడు రూపాయలకు పెరిగింది. ఇతర బ్యాంకుల ఏటీఎం నుంచి మాత్రమే లావాదేవీ రుసుము వసూలు చేస్తారు. మెట్రో నగరాలలో అలాగే హోం బ్యాంకు కాకుండా ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి మీకు 5 ఉచిత లావాదేవీల పరిమితి ఉంటుంది. మెట్రో నగరాలలో మీకు మూడు ఉచిత లావాదేవీల పరిమితి ఉంటుంది.
తాజాగా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏటీఎం ఫీజులను పెంచే ప్రతిపాదనలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఆమోదించడం జరిగింది. బ్యాలెన్స్ విచారణ చేయడానికి అలాగే మినీ స్టేట్మెంట్ మొదలైన సేవలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలలో ఎటువంటి చార్జీలు విధించబడవు. ఒకవేళ మీరు ఇతర బ్యాంకులో ఏటీఎంలలో ఇలా చేసినట్లయితే ప్రతి లావాదేవీ కి కూడా మీరు రూ.10 తో పాటు జీఎస్టీ కూడా చెల్లించాలి. ఒకవేళ మీకు పొదుపు ఖాతాలో తగినంత నిధులు లేకపోతే మీ ఏటీఎం లాభాదేవి విఫలమైన వర్తించే జరిమానా ప్రకారం మీరు రూ.20 తోపాటు జీఎస్టీ కూడా చెల్లించాలి.
Also Read : విండో, స్ప్లిట్ ఏసీలకు కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా? ఎంతకాలం వాడొచ్చు?