Kesineni Nani: విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని( Nani ) వెనక్కి తగ్గడం లేదు. ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు నాని. కానీ ఇటీవల ఆయన కామెంట్స్ చూస్తుంటే మాత్రం మళ్లీ యాక్టివ్ అయినట్లు కనిపిస్తోంది. అప్పుడు ఇప్పుడు చంద్రబాబు అంటే గౌరవం అనే సంకేతాలు పంపుతూనే.. ఇప్పుడు సోదరుడు, ఎంపీ చిన్నిని టార్గెట్ చేసుకొని.. చంద్రబాబును ఇరుకున పెట్టేలా చేస్తున్నారు నాని. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం ఉన్న నాని.. కేవలం పార్టీలో ఉన్న ప్రత్యర్థులు, తమ సోదరుడు చిన్ని కారణంగా టిడిపికి దూరమయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పంచన చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తనపై తన తమ్ముడు చిన్ని గెలవడాన్ని జీర్ణించుకోలేకపోయారు. అందుకే ఇప్పుడు సోదరుడు చిన్నిని టార్గెట్ చేసుకున్నారు.
Also Read: ఒంగోలులో బాలినేని కి నో ఛాన్స్!
* ‘ఉర్సా’ కేటాయింపుల పై విమర్శలు
రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా విశాఖను ఐటీ హబ్ గా( IT hub) మార్చాలని భావిస్తున్నారు చంద్రబాబు. అందులో భాగంగా విశాఖలో ఉర్సా అనే ఐటీ సంస్థ వచ్చింది. దానికి విశాఖ నగరంలో విలువైన భూమిని కేటాయించింది కూటమి ప్రభుత్వం. అయితే ఆ సంస్థకు అంత సీన్ లేదని.. దాని వ్యవస్థాపకుడు విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని స్నేహితుడని..ఆది స్టార్టప్ కంపెనీ అని.. దానికి భూమి కేటాయించడం తగదని అభ్యంతరం వ్యక్తం చేశారు మాజీ ఎంపీ నాని. అది విజయవాడ ఎంపీ చిన్ని బినామీ సంస్థ అని సంచలన ఆరోపణలు చేశారు. అప్పటి నుంచి రచ్చ ప్రారంభం అయ్యింది. ఇద్దరు సోదరుల మధ్య వివాదం కూటమి ప్రభుత్వంపై ప్రభావం చూపుతోంది.
* పరువు నష్టం నోటీసులు..
అయితే దీనిపై విజయవాడ ఎంపీ చిన్ని( Vijayawada MP Chinni) స్పందించారు. కేశినేని నాని పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో పరువు నష్టం దావా నోటీసు ఇచ్చారు. అయినా సరే కే సినేని నాని వెనక్కి తగ్గడం లేదు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూనే ఉన్నారు. తాజాగా అమెరికాలో ఉర్సా సంస్థ స్టేటస్ ను చెబుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. దీంతో ఇది కూటమి ప్రభుత్వంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ఇద్దరు అన్నదమ్ములు కాగా.. ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వివాదాలు నడుస్తున్నాయి. చివరకు ఇది రాజకీయ యుద్దంగా మారింది.
దీనికేమి సమాధానం చెపుతావు బాబు Satish Abburi నువ్వు నీ మిత్రుడు చార్లెస్ శోభ రాజ్ కలసి 21 century ద్వారా ఎంతో మందిని మోసం చేసింది వాస్తవం ,
ఇప్పుడు ప్రజా సంపద దోచుకుందామని URSA పెట్టింది కూడా నిజం .
చేసేది పచ్చి మోసాలు పైగా బెదిరింపులు .#URSAClusters @ncbn pic.twitter.com/Dz7OlxSPCM— Kesineni Nani (@kesineni_nani) April 26, 2025
* టిడిపిలో ప్రాధాన్యం..
తెలుగుదేశం పార్టీలో( Telugu Desam Party) నానికి మంచి ప్రాధాన్యత ఉండేది. కానీ పార్టీ నేతలతో విభేదాలు పెట్టుకున్నారు నాని. లోకేష్ నాయకత్వాన్ని ప్రశ్నించారు. అధినాయకత్వంతో చాలా గ్యాప్ పెంచుకున్నారు. ఈ గ్యాప్ లో చిన్ని పార్టీలో ప్రాధాన్యత పెంచుకున్నారు. అన్నకు ప్రత్యామ్నాయం తానే అని ప్రూవ్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు. అయితే పార్టీలో ప్రత్యర్థులతో చేతులు కలిపి తనను పతనం చేసిన తమ్ముడు చిన్నిపై గట్టిగానే తీర్చుకోవాలని చూస్తున్నారు నాని. చూడాలి మరి ఫైనల్ గా ఏం జరుగుతుందో?
Also Read: ఒంగోలులో బాలినేని కి నో ఛాన్స్!