https://oktelugu.com/

Indrakeeladri Dasara Navaratri : ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 15 నుంచి 23వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు

దసరాలో గతంలో ఇంజనీరింగ్ వర్క్స్ కు 2.5 కోట్లు ఖర్చు చేసామని.. పలు దేవాలయాల నుంచీ సిబ్బంది ని తీసుకొచ్చి దసరా కు వినియోగిస్తామని కర్నాటి రాంబాబు తెలిపారు.

Written By:
  • NARESH
  • , Updated On : September 19, 2023 / 09:40 PM IST

    Indrakeeladri Dasara Navaratri

    Follow us on

    Indrakeeladri Dasara Navaratri : ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 15 నుంచి 23వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహించేందుకు నిర్ణయించారు. ఇంద్రకీలాద్రి పై దసరా శరన్నవరాత్రులకు సర్వం సిద్ధం చేసినట్లు అధికారులు, పాలక మండలి తెలిపారు. ఇంద్రకీలాద్రి దుర్గగుడి పాలకమండలి చైర్మన్ కర్నాటి రాంబాబు ఈ మేరకు మహోత్సవాల కోసం చేసిన ఏర్పాట్లను వివరించారు.

    దసరాలో గతంలో ఇంజనీరింగ్ వర్క్స్ కు 2.5 కోట్లు ఖర్చు చేసామని.. పలు దేవాలయాల నుంచీ సిబ్బంది ని తీసుకొచ్చి దసరా కు వినియోగిస్తామని కర్నాటి రాంబాబు తెలిపారు. పది రోజులకు కాంట్రాక్టు పద్ధతిలో కొంతమంది సిబ్బందిని ఏర్పాటు చేస్తామన్నారు.అన్నదాన భవనం కూడా త్వరలో పూర్తి చేస్తామన్నారు.

    ఇంద్రకీలాద్రి పై అక్టోబర్ 15 వ తేదీ నుంచి 23 వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు షెడ్యూల్ ను ప్రకటించారు.

    అక్టోబర్‌ 15 వ తేదీన ఉత్సవాల తొలిరోజు శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి అలంకారంలో దర్శనమివ్వనున్న దుర్గమ్మ

    16 న శ్రీ గాయత్రీ దేవి అలంకారం

    17 న శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం

    18 న శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారం

    19 న శ్రీ మహాచండీ దేవి అలంకారం

    20 న శ్రీ సరస్వతీ దేవి అలంకారం (మూలానక్షత్రం)

    మధ్యాహ్నం 3గంటల నుంచీ 4 గంటల మధ్యలో సీఎం జగన్ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.

    21 న శ్రీ లలితా త్రిపురసుందరీ అలంకారం

    22 న శ్రీ దుర్గాదేవి అలంకారం

    23 న శ్రీ మహిషాసుర‌మర్ధనీ దేవిఅలంకారం… మధ్యాహ్నం నుంచీ శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారం…

    200 మంది ఇతర దేవాలయాల నుంచీ సిబ్బంది వస్తారు : ఈఓ భ్రమరాంబ, ఇంద్రకీలాద్రి

    అన్ని శాఖల అధికారులు భక్తులకు అసౌకర్యం కలుగకుండా చూస్తామని ఇంద్రకీలాద్రి ఈఓ భ్రమరాంబ తెలిపారు. కొండచరియలు జారిపడిన కారణంగా క్యూలైన్లు దుర్గాఘాట్ వైపు మార్చడం జరుగుతుందన్నారు. వినాయకుడి గుడి వద్ద నుంచీ క్యూలైన్లు ప్రారంభం అవుతాయన్నారు.
    ఎప్పటిలాగే ఐదు క్యూలైన్లు ఉంటాయని.. కేశఖండన శాలకు 600 మంది సిబ్బంది ఉంటారని తెలిపారు.

    ‘భక్తులు నిలిచే ప్రదేశాలను గుర్తించి షెడ్లు వేస్తున్నాం. జల్లు స్నానాలకు షవర్ లు ఏర్పాటు చేస్తున్నాం.. పది ప్రసాదం కౌంటర్లు ఉంటాయి.. మోడల్ గెస్ట్ హౌస్, స్టేట్ గెస్ట్ హౌస్ ల వద్ద కూడా ప్రసాదం కౌంటర్లు.. వీవీఐపీల దర్శనం పై స్లాట్లు కూడా నిర్ణయిస్తాం ..బడ్జెట్ 7 కోట్లు పెట్టామని.. గతంలో లాగానే భక్తుల రద్దీ ఆశిస్తున్నాం.. దసరా 9 రోజులూ అంతరాలయ దర్శనం లేదని ’ ఈఓ తెలిపారు.