HomeజాతీయంPM Modi - WhatsApp Channels : వాట్సాప్ చానెల్ లోకి ప్రధాని.. మోడీతో ఇలా...

PM Modi – WhatsApp Channels : వాట్సాప్ చానెల్ లోకి ప్రధాని.. మోడీతో ఇలా దగ్గరవ్వండి

PM Modi – WhatsApp Channels : మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్.. సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది. వ్యక్తులు లేదా సంస్థలు వాట్సప్ చానల్స్ ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించింది. వాటి ద్వారానే సరికొత్త అప్డేట్స్ తెలుసుకోవచ్చు. అప్డేట్ సెక్షన్లో, స్టేటస్ ల కింద చానల్స్ విభాగం కనిపిస్తుంది. వాట్సప్ యూజర్లు ఎవరైనా సరే ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదా ఆ ఛానల్ ఫాలో అవ్వచ్చు. వాట్సాప్ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటున్నది. టెక్నాలజీ పరంగా అమెరికాలో ప్రయోగించిన తర్వాత మన దేశంలో అందుబాటులోకి తీసుకువచ్చే మెటా.. ఈసారి ముందుగానే ఈ అవకాశాన్ని భారత్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది.

వినియోగదారులు వాట్స్అప్ ఛానల్ ఫీచర్ తో వన్ వే బ్రాడ్కాస్టింగ్ ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు. దీని ద్వారా ఒకేసారి పెద్ద సంఖ్యలో సబ్స్క్రైబర్లతో కనెక్ట్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. తే చానల్స్ లో అడ్మిన్ కు ఎక్కువ కంట్రోలింగ్ ఉంటుంది. సాధారణంగా మిగతా వారితో సులభంగా కనెక్ట్ అవ్వడానికి ఇది అత్యంత వేగంగా ఉపయోగపడుతుంది. ఒకే సారి అందరి అభిప్రాయాలు తెలుసుకోవచ్చు. ఒకేసారి అందరితో మాట్లాడవచ్చు. చాలా విషయాలు పంచుకోవచ్చు. అయితే వాట్సప్ తీసుకొచ్చిన ఈ సౌకర్యాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంది పుచ్చుకున్నారు.

పేరుతో మంగళవారం వాట్స్అప్ చానల్స్ లో జాయిన్ అయ్యారు. పార్లమెంట్ కార్యకలాపాలు కొత్త భవనంలోకి మారిన రోజే ప్రధాని ఈ ఛానల్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. అయితే ప్రధాని సోషల్ మీడియాను విపరీతంగా వాడుకుంటారు. లో చాలా యాక్టివ్ గా ఉంటారు. తనకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తుంటారు. విదేశీ పర్యటనలు, స్వదేశీ పర్యటనలు, తనకు ఆసక్తి కలిగించిన అంశాలను ఎప్పటికప్పుడు పంచుకుంటారు. అయితే వాట్సప్ సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకురావడం.. వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. ప్రజలతో ఎక్కువగా కనెక్ట్ అయ్యేందుకు ప్రధాని వాట్సప్ ఛానల్స్ లో చేరినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రభుత్వ పథకాల వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలతో పంచుకునేందుకు ఆయన ఈ వాట్స్అప్ ఛానల్ ను ఉపయోగించుకుంటారని భారతీయ జనతా పార్టీ వర్గాలు అంటున్నాయి.

ఎలా చేరాలి అంటే
ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ డివైస్ లో వాట్సాప్ ఓపెన్ చేసి అప్డేట్స్ ట్యాబ్ లోకి వెళ్ళాలి. ఈ జాబితాలో స్టేటస్ సెక్షన్ కింద ఫైండ్ ఛానల్ ఆప్షన్ కనిపిస్తుంది. అందులోకి వెళ్లి నరేంద్ర మోడీ అని సెర్చ్ చేయాలి. సెర్చ్ ఇంజన్లో నరేంద్ర మోడీ పేరుతో ఛానల్ కనిపిస్తుంది. పక్కనే ఫాలో ఆప్షన్ పిక్ చేసి ఛానల్ ఫాలో అవ్వచ్చు.

ఇక వాట్స్అప్ చానల్స్ లో అడ్మిన్స్..ఫాలోవర్లకు టెక్స్ట్, ఫోటోలు, వీడియోలు, స్టిక్కర్లు, సెండ్ చేయవచ్చు. ఇది వన్ వే బ్రాడ్ కాస్ట్ టూల్.. వాట్సప్ లోని అప్డేట్ సెక్షన్ కింది భాగంలో వాట్స్అప్ చానల్స్ అనే విభాగాన్ని యాక్సిస్ చేసుకోవచ్చు. యూజర్ల దేశం ఆధారంగా ఆటోమేటిక్ గా చానల్స్ ఫిల్టర్ అవుతాయి. ఫాలోవర్ సంఖ్య ఆధారంగా కొత్తగా అత్యంత యాక్టివ్ గా ఉండే ఛానల్స్, పాపులర్ ఛానల్స్ కూడా చూడవచ్చు. చానల్స్ కు సంబంధించి ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వచ్చు. ఒక పోస్ట్ కు ఎన్ని రియాక్షన్ వచ్చాయో కూడా చూడవచ్చు. అయితే వ్యక్తిగతంగా ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఇతర ఫాలోవర్లకు కనిపించదు. మీ చాట్ లేదా గ్రూపులకు ఏదైనా ఛానల్ అప్డేట్ ను ఫార్వర్డ్ చేస్తే.. ఆ లింక్ క్లిక్ చేసినప్పుడు ఛానల్ ఓపెన్ అవుతుంది. తద్వారా వ్యక్తులు ఆ ఛానల్ కు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ చూడవచ్చు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version