Vijayawada Traffic Police
Vijayawada : ఏపీ పోలీసులు( AP Police) గట్టి చర్యలకు దిగుతున్నారు. వాహనదారులను హడలెత్తిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే భారీ జరిమానాలు వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా హెల్మెట్, ఇతర నిబంధనలు పాటించకపోతే భారీగా ఫైన్ తప్పదని సంకేతాలు ఇస్తున్నారు. వాహనాలకు సంబంధించి స్టిక్కర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. తాజాగా ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ గట్టి చర్యలకు దిగుతున్నారు. ఇటీవల కాలంలో వాహనాలపై స్టిక్కర్లతో అమాయకులను మోసం చేస్తున్నారని.. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఒకటి రెండు మోసాలు వెలుగు చూడడంతో ఎస్పీ స్పందించారు. మరోవైపు ఆ స్టిక్కర్ల విషయంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు కూడా జరుపుతున్నారు.
Also Read : ఏపీలో డబుల్ డెక్కర్ జోష్.. చంద్రబాబు ట్వీట్!
* ఇటువంటి స్టిక్కర్లు అధికం..
ప్రధానంగా వాహనాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రెస్, వివిధ శాఖలకు సంబంధించి స్టిక్కర్లు( stickers) అతికిస్తున్నారు. నకిలీలుగా ఎక్కువమంది చలామణి అవుతున్నారు. మరికొందరు ఇవే స్టిక్కర్లతో మోసాలకు పాల్పడుతున్నారు. ఈ తరుణంలో పోలీస్ శాఖ అప్రమత్తం అయ్యింది. ఇటువంటి స్టిక్కర్లు కనిపిస్తే పూర్తి స్థాయిలో ఆరా తీయాలని శాఖా పరమైన ఆదేశాలు జారీ చేసింది. చాలామంది తప్పుడు మార్గాల్లో ఈ స్టిక్కర్లను వినియోగిస్తున్నారని పోలీస్ శాఖ గుర్తించింది. ఎవరైనా అనధికారికంగా స్టిక్కర్లు ఉపయోగిస్తే స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని ఆదేశించింది. అటువంటి వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని కూడా స్పష్టం చేసింది.
* పోలీసులు లేకుండానే..
ఓవైపు విజయవాడలో( Vijayawada) వింత పరిణామం ఒకటి వెలుగు చూసింది. ట్రాఫిక్ పోలీసులు లేరని లైట్ తీసుకున్నారు 200 మందికి పైగా వాహనదారులు. కీరవారికి షాప్ ఇచ్చారు పోలీసులు. విజయవాడకు చెందిన ఆటో డ్రైవర్ ఒక రెడ్ సిగ్నల్ పడిన పట్టించుకోకుండా జంప్ చేశాడు. రెండు రోజుల తర్వాత ఈ చలానా చెక్ చేస్తే వెయ్యి రూపాయల జరిమానా పడింది. మరో విద్యార్థి హెల్మెట్ లేకుండా ఇద్దరు స్నేహితులతో కలిసి ట్రిపుల్ రైడింగ్ చేశారు. దీంతో రెండు వేల రూపాయలు జరిమానా పడింది. అయితే అక్కడ పోలీసులు లేకుండా జరిమాణాలు ఎలా సాధ్యమని ఆరా తీస్తే అసలు సంగతి తెలిసింది. ప్రధాన జంక్షన్ లలో ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థలో భాగంగా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఐటీఎంఎస్ ద్వారా ఈ చలానాలు వసూలు చేస్తున్నారు. దీంతో అక్కడ ట్రాఫిక్ పోలీసులు లేకుండానే భారీగా జరిమానాలు పడుతున్నాయి. ఈ వారం రోజుల వ్యవధిలోనే విజయవాడలో 211 మంది ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించడంతో భారీగా జరిమానాలు పడ్డాయి.
Also Read : ఉచిత బస్సు కోసం ఇది మామూలు నిరసన కాదు..