AP Free Bus Scheme
AP Free Bus Scheme: గత వైసిపి ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత పెరగడం.. ఇంకా అనేక కారణాలతో ఏపీ ప్రజలు కూటమి నేతలకు జై కొట్టారు. కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని కట్టబెట్టారు. ఫలితంగా వైసిపికి 11 స్థానాలు మాత్రమే మిగిలాయి. ఈ క్రమంలో ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేస్తుందని ప్రజలు భావించారు. కానీ ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయకపోవడం ప్రజలను ఆగ్రహానికి గురిచేస్తోంది దీనికి తోడు ఏపీ ఆర్థిక పరిస్థితి బాగోలేదని కూటమి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు సందర్భాల్లో చెప్పడాన్ని ఏపీ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష హోదా దక్కించుకోలేని వైసిపి కూడా హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఏదో ఒక రూపంలో నిరసనలను చేపడుతోంది. అందులో భాగంగానే వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Also Read: ఆరు గ్యారంటీలపై..పాల్ మావ మాస్ ర్యాగింగ్..వైసీపీ కి ఇలా ఎందుకు చేతకావడం లేదు?
మహిళలు వినూత్నంగా..
ఎన్నికలకు ముందు తాను ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే గల్లాగుంజి అడగాలని చంద్రబాబు నాయుడు ప్రజలకు సూచించారు. ఇప్పుడు అవే మాటలను ఏపీ ప్రజలు గుర్తు చేస్తున్నారు. తమకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించకపోవడంతో.. ఆర్టీసీ బస్సులలో చంద్రబాబు నాయుడు నాడు ఎన్నికలకు ముందు చేసిన ప్రసంగాలను యూట్యూబ్లో చూస్తూ.. తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. బస్సులో ఉన్న మహిళలు తమ చేతుల్లో ఫోన్లను పట్టుకుని.. అందులో ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోలను చూస్తూ, చూపిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు..”అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం కల్పిస్తామని మాకు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి దాదాపు 6 నెలలు దాటిపోయింది. ఇంతవరకు ఉచిత బస్సు ప్రయాణం మాకు అందుబాటులోకి రాలేదు.. నాడు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే గల్లాగుంజి అడగాలని చంద్రబాబు అన్నారు. మరి ఇప్పుడు ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు.. మరి దీనిపై ఏం చేయాలో టిడిపి నాయకులు మాకు చెప్పాలని” బస్సులో ప్రయాణిస్తున్న మహిళలు వ్యాఖ్యానించినట్టు వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇక ఈ వీడియోను వైసిపి శ్రేణులు సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నాయి. మరోవైపు ఈ వీడియో పై టిడిపి నేతలు కూడా మండిపడుతున్నారు. ఈ వీడియోల వెనుక ఉన్నది వైసీపీ నాయకులని.. సోషల్ మీడియాలో విష ప్రచారం చేయడంలో వారి తర్వాతే ఎవరైనా అని టిడిపి నేతలు అంటున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుపడిన తర్వాత కచ్చితంగా చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తారని వారు భరోసా ఇస్తున్నారు.
ఉచిత బస్సు హామీని నెరవేర్చాలని తిరుపతిలో మహిళల పోరాటం..
pic.twitter.com/iipiTOs1DA— (@karnareddy4512) March 19, 2025