https://oktelugu.com/

CM Chandrababu : ఏపీలో డబుల్ డెక్కర్ జోష్.. చంద్రబాబు ట్వీట్!

CM Chandrababu: గన్నవరం నియోజకవర్గ పరిధిలో అశోక్ లేలాండ్ బస్సుల తయారీ యూనిట్ను మంత్రి లోకేష్ ప్రారంభించారు. దీంతో పరిశ్రమలకు సంబంధించి ఒక అడుగు ముందుకు పడింది.

Written By: , Updated On : March 20, 2025 / 01:17 PM IST
CM Chandrababu Tweet (1)

CM Chandrababu Tweet (1)

Follow us on

CM Chandrababu : ఏపీ ప్రభుత్వం( AP government) దూకుడు మీద ఉంది. నిర్ణయాలను వేగంగా తీసుకుంటోంది. సంక్షేమ పథకాల అమలుపై దృష్టి పెట్టింది. అభివృద్ధి విషయంలోను శరవేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో పారిశ్రామిక రంగంలో అతిపెద్ద విజయాన్ని సాధించింది కూటమి ప్రభుత్వం. ఆటోమొబైల్ రంగంలో దిగ్గజ పరిశ్రమగా గుర్తింపు పొందిన అశోక్ లేలాండ్ పెట్టుబడులను ఆకర్షించింది. బస్సుల తయారీ యూనిట్ను ఏపీలో ఏర్పాటు చేయగలిగింది. గన్నవరం నియోజకవర్గ పరిధిలో అశోక్ లేలాండ్ బస్సుల తయారీ యూనిట్ను మంత్రి లోకేష్ ప్రారంభించారు. దీంతో పరిశ్రమలకు సంబంధించి ఒక అడుగు ముందుకు పడింది.

Also Read : విద్యార్థుల ఫోన్లకు పరీక్షా ఫలితాలు.. లోకేష్ సంచలన ప్రకటన

* 75 ఎకరాల్లో ప్లాంట్
గన్నవరం నియోజకవర్గ పరిధిలో 75 ఎకరాల్లో ఈ ప్లాంట్ ఏర్పాటు అయింది. అశోక్ లేలాండ్( Ashok Leyland) చెందిన అత్యాధునిక బస్సులు ఇక్కడ తయారవుతాయి. డీజిల్, ఎలక్ట్రిక్, డబుల్ డెక్కర్ బస్సులు సైతం ఇక్కడే రూపుదిద్దుకుంటాయి. ఏపీలో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందే విషయంలో ఈ తయారీ ప్లాంట్ సరికొత్త మార్పునకు నాంది పలికిందని ఓటమిస్తోంది. ఈ ప్లాంట్ ఏర్పాటుతో పెద్ద ఎత్తున ఉద్యోగాలు సృష్టించవచ్చని భావిస్తోంది. గ్రీన్ మొబిలిటీ, లాజిస్టిక్ దిశగా అతిపెద్ద ముందడుగు పడిందని మంత్రి నారా లోకేష్ సగర్భంగా ప్రకటించారు. స్విచ్ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు కూడా ఇక్కడే తయారవుతాయని నారా లోకేష్ పేర్కొన్నారు.

* నారా లోకేష్ ఆనందం
ఈ ప్లాంట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు నారా లోకేష్( Nara Lokesh). ప్లాంట్ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫోటోలను తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనికి చంద్రబాబు రిప్లై ఇచ్చారు. రీ ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రజలకు ఇది మరో శుభవార్త అన్నారు. పారిశ్రామిక రంగంలో అతిపెద్ద విజయాన్ని సాధించామని కామెంట్ చేశారు. విజయవాడ సమీపంలో అశోక్ లేలాండ్ అత్యధిక బస్సు తయారీ ప్లాంట్ ఏర్పాటు కావడం రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలకు అద్దం పట్టినట్లు అయిందన్నారు చంద్రబాబు. మంత్రి నారా లోకేష్ ను అభినందించారు.
Also Read : ఢిల్లీలో పయ్యావుల పడిగాపులు.. కొత్త అప్పుల కోసం తంటాలు!