Vijayasai Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ( YSR Congress )మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి షాక్ తగిలింది. గత కొద్ది రోజుల కిందట ఆయన రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజ్యసభ పదవిని సైతం వదులుకున్నారు. అయితే ఆయనను కూటమి ప్రభుత్వం లేదు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఓ కేసు విచారణకు హాజరయ్యేందుకు ఇచ్చిన సమయంలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వాటిని ఆధారంగా చేసుకుని ఈరోజు పోలీసులు ఆయనకు నోటీసులు పంపారు. విజయవాడ సిపి కార్యాలయంలో ఈ నెల 18న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో భారీ మద్యం కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ చేపడుతోంది. ఈ కేసులో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఐటీ సలహాదారుగా పనిచేసిన రాజ్ కసిరెడ్డి కీలక పాత్రధారిగా గుర్తించారు. ఆయన కోసం జల్లెడ పడుతున్నారు.
Also Read: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మెగా డీఎస్సీపై కీలక అప్టేట్
* తాజాగా నోటీసులు..
అయితే ఇప్పుడు అదే కేసులో విచారణకు హాజరుకావాలని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి( Vijaya Sai Reddy ) నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. గతంలో ఓ కేసు విచారణకు హాజరయ్యారు విజయసాయిరెడ్డి. అప్పట్లో మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరితో ఆయనకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. మద్యం కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ రాజ్ కసిరెడ్డి అని ఆరోపించారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని.. భవిష్యత్తులో అడిగితే మరిన్ని వివరాలు అందిస్తానని ప్రకటించారు. దీంతో ఈరోజు సిట్ ఆయనకు నోటీసులు పంపింది. ఈనెల 18న విజయవాడ సి పి ఆఫీస్ లో జరిగే విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. దీంతో విజయసాయిరెడ్డి హాజరయ్యే అవకాశం ఉంది. కీలక ఆధారాలు ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది.
* కొద్దిరోజులుగా రాజకీయ సంచలనాలు..
అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పినప్పుడు విజయసాయిరెడ్డి సాఫ్ట్ గానే మాట్లాడారు. రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని ప్రకటించారు. వ్యవసాయం మాత్రమే చేసుకుంటానని చెప్పుకొచ్చారు. కానీ గత కొద్ది రోజులుగా రాజకీయ అంశాలు మాట్లాడుతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ పార్టీ నేతలను ఇరుకున పెట్టేలా మద్యం కుంభకోణం పై కీలక ఆధారాలు ఇచ్చే అవకాశం ఉంది. అయితే కేవలం విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుని ఆయనకు నోటీసులు ఇచ్చారు. అయితే మద్యం కుంభకోణంలో విజయసాయిరెడ్డి పాత్ర ఏమైనా ఉందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అదే జరిగితే విజయసాయిరెడ్డి సైతం చిక్కుల్లో పడడం ఖాయం. అయితే మద్యం కుంభకోణంలో ఆధారాలను తీసుకోవడానికి మాత్రమే విజయసాయిరెడ్డిని పిలిచారా? లేకుంటే ఆయన పాత్ర ఏమైనా ఉందా? అన్నది తెలియాలంటే మాత్రం ఈనెల 18 వరకు వేచి ఉండాల్సిందే. మరి ఆ విచారణ సమయంలో విజయసాయిరెడ్డి మరిన్ని సంచలన విషయాలు బయట పెడతారా? రాజ్ కసిరెడ్డి ఎవరి మనిషి? ఎవరికి బినామీ? అనే అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
* బిజెపిలోకి వెళ్తారని ప్రచారం..
అయితే విజయసాయిరెడ్డి బిజెపిలోకి ( BJP)వెళ్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. త్వరలో ఆయన బిజెపిలోకి వెళ్లడం ఖాయమని మీడియా వర్గాల్లో కథనాలు వస్తున్నాయి. వాటిని ఆయన ఖండించడం లేదు. టిడిపి నేతలు సైతం పెద్దగా స్పందించడం లేదు. అందుకే ఈ అనుమానాలు సైతం బలపడుతున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే సీట్ ఆయనకు నోటీసులు ఇవ్వడం విశేషం.