Shubha Muhurtham : హోలీ నుంచి శ్రీరామనవమి వరకు శుభ కార్యక్రమాలకు సెలవు అన్నట్లుగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో కొందరు కొత్త పనిని లేదా శుభ కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపరు. ఈ సమయంలో ఉగాది వస్తుంది కనుక కొత్త పంచాంగం అందుబాటులోకి వచ్చిన తర్వాత దాని ప్రకారంగానే కార్యక్రమాలు నిర్వహించుకోవాలని అనుకుంటారు. 2025 సంవత్సరంలో ఏప్రిల్ 30న ఉగాది తర్వాత కొత్త పంచాంగం అందుబాటులోకి వచ్చింది. ఈ పంచాంగం ప్రకారం ఇప్పటికే కొంతమంది శుభముహూర్తాలు ఏవో తెలుసుకున్నారు. అయితే ప్రస్తుతం ఏప్రిల్ లో మంచి రోజులు ఉన్నాయని చాలామందికి తెలుసు. కానీ ఏ ఏ రోజులు మంచి రోజులు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
Also Read : పూరీ జగన్నాథ ఆలయంలో గద్ద అద్భుతం.. జెండాతో ప్రదక్షిణ వీడియో వైరల్
కొన్ని రోజులు గ్యాప్ తర్వాత శుభ ముహూర్తాలు మళ్ళీ ప్రారంభం కానున్నాయి. మాంగల్యం తంతునామే అనే పదాలు మళ్లీ వినిపించనున్నాయి. ఏప్రిల్ 16 నుంచి జూన్ వరకు శుభముహూర్తాలు ఉన్నాయి. వీటి ప్రకారం కొన్ని శుభ కార్యక్రమాలు మాత్రమే కాకుండా పెళ్లిళ్లు కూడా చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు. అయితే జూన్ తర్వాత ఆషాడ మాసం ప్రారంభం అవుతున్నందున ఈ మూడు నెలల్లోనే శుభ కార్యక్రమాలు నిర్వహించుకోవాలని అంటున్నారు. ఇందులోను మే నెలలో ఎక్కువగా శుభ ముహూర్తాలు రానున్నాయి. మరి ఏ నెలలో ఎన్ని శుభ ముహూర్తాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
ఏప్రిల్ 16 నుంచి శుభముహూర్తాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెలలో 16, 18, 20, 21, 23, 30 తేదీల్లో వివాహాలు జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. అలాగే మే నెలలో 1,3,4,8,9,10,11,14,16,18,19,21,23,24,30 తేదీల్లో శుభముహూర్తాలు ఉన్నాయి. జూన్లో 2,4,5,6,7 రోజుల్లో వివాహాలు జరుపుకోవడానికి అనుగుణంగా ఉన్నాయని పండితులు చెబుతున్నారు. అయితే జూన్ 11 నుంచి ఆషాడ మాసం ప్రారంభం కానున్నందున ఈరోజుల్లో మంచి ముహూర్తాలు లేవు. మళ్లీ జూలై 25 నుంచి శ్రావణమాసం ప్రారంభం కావడంతో శుభకడియలు రానున్నాయి. ఈ మూడు నెలల్లో మే నెలలో ఎక్కువ గా మంచి రోజులు ఉన్నాయి. అలాగే ఏప్రిల్ 30వ తేదీన అక్షయ తృతీయ సందర్భంగా అత్యధిక పెళ్లిలు జరిగే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.
ఇప్పటికే వివాహాలు నిశ్చయం తీసుకున్న వారు పెళ్లిళ్లు జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో పెళ్లికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయడంతో మార్కెట్లో సందడిగా మారింది. అంతేకాకుండా మే నెలలో ఎక్కువగా ఎండలో ఉండడంతో ఏప్రిల్ నెలలోనే కొందరు వివాహాలు నిర్వహించుకోవడానికి సిద్ధమవుతున్నారు. అయితే వివాహాలు చేసుకునేవారు తమ జాతకాలను బట్టి ఆయా తేదీలు నిర్వహించబడతాయి. అందువల్ల ఏ ఏ తేదీలు అనుకూలంగా ఉంటాయో సంబంధిత పురోహితులను కలిసి నిర్ణయించుకోవాలని అంటున్నారు. అయితే మొత్తంగా మూడు నెలల్లో మంచి రోజులు ఇలా ఉన్నాయని పేర్కొంటున్నారు. ఇక మిగతా కార్యక్రమాల్లో నిర్వహించుకునేవారు సైతం ఈరోజుల్లో అనుగుణంగానే ఉంటుందని చెబుతున్నారు. శుభ ముహూర్తాల కారణంగా మార్కెట్లో వ్యాపారాలు కూడా పుంజుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా పెళ్లిళ్ల కోసం ఫంక్షన్ హాల్, ఇతర సామాగ్రి కోసం బిజీగా మారే అవకాశం ఉంది.