Shaik Rasheed : ప్రస్తుతం జరుగుతున్న IPL క్రికెట్ లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ టీం తరుపున ఆడేందుకు నిన్న స్క్వాడ్ లోకి షేక్ రషీద్(Shaik Rasheed) అనే కుర్రాడు అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మన ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లాకు చెందిన షేక్ రషీద్ కి ఈ అరుదైన అవకాశం రావడంతో సోషల్ మీడియా లో నిన్న మొత్తం అతని గురించే చర్చ నడిచింది. మొదటి మ్యాచ్ లోనే అద్భుతంగా ఆడి అందరి దృష్టిని షేక్ రషీద్ ప్రత్యేకంగా ఆకర్షించాడు. ఈ సీజన్ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) కి సరిగా కలిసి రాలేదు అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు 7 మ్యాచులు ఆడగా 5 మ్యాచులు ఓడిపోయి కేవలం రెండు మ్యాచులు మాత్రమే గెలిచారు. గెలిచిన ఆ రెండు మ్యాచులలో ఒకటి రషీద్ టీం లోకి అడుగుపెట్టిన రోజే అవ్వడం విశేషం.
Also Read : కూలి పనులు చేసి కొడుకును క్రికెటర్ ను చేశాడు.. కన్నీళ్లు తెపిస్తున్న రషీద్ స్టోరీ
అయితే రషీద్ ఇంత దూరం రావడానికి ప్రధాన కారణం ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అని నిన్న అభిమానులు చెప్పుకొచ్చారు. గతం లో రషీద్ కి అండర్ 19 మ్యాచులు ఆడేందుకు అతని ఆర్ధిక స్తొమత సరిపోక ఇబ్బంది పడుతుంటే, పవన్ కళ్యాణ్ ని అతని తండ్రి ఆశ్రయించాడు. పవన్ కళ్యాణ్ రషీద్ కి అండర్ 19 ఆడేందుకు సరిపడా రెండు లక్షల రూపాయిల ఆర్ధిక సాయాన్ని అందించాడు. పవన్ కళ్యాణ్ సాయంతో వైజ్ కెప్టెన్ గా రషీద్ ఇండియన్ టీం తరుపున ఆడి కప్ ని కూడా సంపాదించాడు. ఈ టోర్నమెంట్ లోనే తన టాలెంట్ ద్వారా అందరి దృష్టిని ఆకర్షించిన రషీద్ ని చెన్నై సూపర్ కింగ్స్ టీం కొనుగోలు చేసి బెంచ్ లో పెట్టింది. కాన్వాయ్, అశ్విన్ సరైన ఫామ్ లో లేకపోవడం వల్ల, వాళ్ళిద్దరినీ టీం నుండి తప్పించి రషీద్, ఆయుష్ లను తీసుకొచ్చారు.
అయితే మొదటి మ్యాచ్ ని ఆడిన తర్వాత రషీద్ తన అనుభూతిని సెల్ఫీ వీడియో ద్వారా చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘చెన్నై సూపర్ కింగ్స్ టీం లో ఉంటున్న నాకు రెండేళ్ల తర్వాత టీం తరుపున అధికారికంగా ఆడే అవకాశం దక్కింది, అందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. మొదటి మ్యాచ్ లోనే బాగా ఆడాను కానీ, ఒక బ్యాడ్ షాట్ వల్ల అవుట్ అవ్వాల్సి వచ్చింది. మొదటి మ్యాచ్ లో జరిగిన ఈ తప్పులను సరిదిద్దుకొని, తదుపరి మ్యాచులలో బాగా ఆడేందుకు ప్రయత్నిస్తాను. ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ టీం వరుసగా ఓడిపోతూ వస్తున్నప్పటికీ కూడా అభిమానులు వదలకుండా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు రషీద్. చూడాలి మరి ఈ తెలుగు కుర్రాడు రాబోయే రోజుల్లో ఏ రేంజ్ లో తన ఆటని ప్రదర్శించబోతున్నాడు అనేది.
Also Read :