TDP MP vs MLA: తెలుగుదేశం పార్టీలో( Telugu Desam Party) పరిస్థితి అదుపు తప్పుతోంది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో పార్టీలో విభేదాలు బయటపడుతున్నాయి. గతం నుంచి పార్టీలో కొనసాగుతున్న వారికి.. కొత్తగా చేరుతున్న వారితో పొసగడం లేదు. దీంతో విభేదాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం లో ఇదే పరిస్థితి ఉంది. ఆ నియోజకవర్గంలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే అన్నట్టు పరిస్థితి మారింది. మధ్యలో మాజీ ఎమ్మెల్యే ఎంట్రీ తో పరిస్థితి అదుపు తప్పుతోంది. ఎంపీ బైరెడ్డి శబరి శ్రీశైలం నియోజకవర్గం లో పర్యటనకు సిద్ధపడ్డారు. అయితే స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కి తెలియకుండా ఎలా పర్యటిస్తారంటూ ఆయన వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే దీనికి కారణం మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి అని అనుమానిస్తూ ఆయన ఇంటిపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేయడం ఆందోళన కలిగిస్తోంది. చివరకు పోలీసులు రావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
ఎన్నికలకు ముందు టిడిపిలోకి..
నంద్యాల జిల్లా( Nandyala district) బిజెపి అధ్యక్షురాలుగా ఉండేవారు బైరెడ్డి శబరి. ఆమె మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె. ఎన్నికలకు ముందు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తో పాటు శబరి టిడిపిలో చేరారు. నంద్యాల ఎంపీ టికెట్ దక్కించుకున్నారు. ఎంపీగా విజయం సాధించారు. నంద్యాల పార్లమెంట్ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టిడిపి అభ్యర్థులే విజయం సాధించారు. నంద్యాల, పాణ్యం, బనగానపల్లె, శ్రీశైలం, ఆళ్లగడ్డ, డోన్, నందికొట్కూరు ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. అయితే ఇందులో నంద్యాల ఎమ్మెల్యే ఫరూక్ తో మాత్రమే ఎంపీ శబరికి సత్సంబంధాలు ఉన్నాయి. మిగతా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో ఆమెకు సఖ్యత లేదు.
Also Read: కనిగిరి నుంచి మా కుటుంబం అందుకే పారిపోయింది : పవన్ కళ్యాణ్
ప్రోటోకాల్ విషయంలో..
అయితే ఎంపీ శబరి(MP Shabari) తరచూ శ్రీశైలం నియోజకవర్గంలో పర్యటిస్తూ వచ్చారు. అక్కడ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని ఆమె పెద్దగా లెక్క చేయడం లేదు. దీంతో అక్కడ ఎమ్మెల్యే వర్గీయులు ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం శ్రీశైలం నియోజకవర్గం లోని ఆత్మకూరులో పర్యటనకు సిద్ధపడ్డారు. ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా ఆమె కార్యక్రమానికి రావడంతో ఎమ్మెల్యే వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ బైరెడ్డి శబరిని గట్టిగానే నిలదీస్తారు. అయితే నంద్యాల నియోజకవర్గ పరిధిలో ఏ అసెంబ్లీ నియోజకవర్గంలోనైనా తాను పర్యటిస్తానని.. అలా చేసే హక్కు తనకు ఉందని శబరి అన్నారు. ఈ క్రమంలో ఎంపీ అనుచరులు, ఎమ్మెల్యే అనుచరుల మధ్య వాగ్వాదం ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని సర్ది చెప్పడంతో ఆమె అక్కడ నుంచి వెళ్లిపోయారు.
Also Read: విశాఖ రైల్వే కొత్త జోన్ లోకి ఆ ప్రాంతాలు.. ఆ మార్గాలకు ‘కవచ్’!
మాజీ మంత్రి ఇంటి పై దాడి..
అయితే శ్రీశైలం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి(Budda Rajasekhar Reddy), మాజీమంత్రి ఏరాసు ప్రతాపరెడ్డికి మధ్య విభేదాలు ఉన్నాయి. అయితే బైరెడ్డి శబరి ఏరాసు ప్రతాపరెడ్డిని ఫాలో అవుతున్నారు. ఇది ఎంత మాత్రం బుడ్డా రాజశేఖర్ రెడ్డి అనుచరులకు మింగుడు పడడం లేదు. అయితే అనవసరంగా శ్రీశైలం నియోజకవర్గం లో విభేదాలు సృష్టిస్తున్నారంటూ టిడిపి శ్రేణులు ప్రతాపరెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన ఇంటిపై దాడి చేసినంత పని చేశాయి. చివరకు పోలీసుల కలుగజేసుకొని మాజీమంత్రిని అక్కడ నుంచి పంపిణీ చేయడంతో వివాదం సద్దుమణిగింది. అయితే కర్నూలు జిల్లాలో నివురుగప్పిన నిప్పుల టిడిపిలో విభేదాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది.