Vangalapudi Anitha: ఏపీలో నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. హద్దులు దాటుతున్నాయి. తనపై విమర్శలు చేసిన మంత్రి గుడివాడ అమర్నాథ్ కు ఏపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పరిగెత్తించి కొడతాం అన్న అమర్నాథ్ కు.. గుడ్డు పగులుద్ది అంటూ వార్నింగ్ ఇచ్చారు. అక్కడితో ఆగకుండా కోడిగుడ్డు పగులుగొట్టి హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పాయకరావుపేట నియోజకవర్గంలో సోమవారం సిద్ధం సభ నిర్వహించారు. మంత్రి గుడివాడ అమర్ నాథ్.. టిడిపి అభ్యర్థి వంగలపూడి అనిత పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ గురించి, ఆయన భార్య భారతి గురించి అనిత ఇష్టానుసారంగా మాట్లాడుతోందని.. ఇంకోసారి అటువంటి వ్యాఖ్యలు చేస్తే పరిగెత్తించి కొడతామంటూ వార్నింగ్ ఇచ్చారు. మీ నాయకులు పుస్తకాల్లో రాసుకోవాలేమో.. మేము, మా నాయకులకు పుస్తకాలు అవసరం లేదంటూ లోకేష్ రెడ్ బుక్ మీద ఇన్ డైరెక్ట్ కామెంట్స్ చేశారు. అనిత గురించి మాట్లాడితే ఆవిడ స్థాయి పెరుగుతుంది అంటూ చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ నేపథ్యంలో తాజాగా మీడియా సమావేశం నిర్వహించిన అనిత గుడివాడ అమర్ నాథ్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. అన్యాయాలు, అబద్ధాలు, మోసాలకు కేరాఫ్ అడ్రస్ వైసిపి అని ఘాటుగా విమర్శించారు. దండుపాళ్యం బ్యాచ్ లే జగన్ సభలు నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏపీలో చేతకాని చే వలేని మంత్రి ఎవరైనా ఉన్నారంటే.. కోడిగుడ్డు మంత్రి అని చెబుతారని ఎద్దేవా చేశారు. టికెట్ పీకేసిన గుడివాడ అమర్నాథ్ తన నియోజకవర్గానికి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని సెటైర్ వేశారు. తాను తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిని అని .. పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని.. మరి అమర్నాథ్ ఎక్కడ పోటీచేస్తానో ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ఆయనతో తనకు పోలిక ఏంటి అని నిలదీశారు. అమర్నాథ్ ను పరిగెత్తించి కొట్టించేందుకు జనసైనికులు, టిడిపి కార్యకర్తలు రెడీగా ఉన్నారంటూ హెచ్చరించారు. ఫోటోలకు ఫోజులు ఇవ్వడం తప్ప నువ్వు తెచ్చిన పరిశ్రమలు ఏమిటని ప్రశ్నించారు. ఇస్తారాజ్యంగా మాట్లాడితే గుడ్డు పగులుద్ది అంటూ.. లైవ్ లోనే గుడ్డు పగులగొట్టి మాస్ వార్నింగ్ ఇచ్చారు .
నోటికి వచ్చినట్టు ఏది అంటే ఏది మాట్లాడతం అంటే గుడ్డు పగులుతుంది… #ChandrababuNaidu #TDPTwitter#Naralokesh #Andrapradesh pic.twitter.com/BlQLSUsPW7
— (@TEAM_CBN1) February 27, 2024