Homeఎంటర్టైన్మెంట్Anjali: ఇంటర్ నెట్ లో గోదారి పిల్ల అంజలి సంచలనం... ఆ అందాలు చూస్తే కళ్ళు...

Anjali: ఇంటర్ నెట్ లో గోదారి పిల్ల అంజలి సంచలనం… ఆ అందాలు చూస్తే కళ్ళు తిప్పుకోలేరు!

Anjali: నటి అంజలి లేటెస్ట్ మూవీ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’. ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్న అంజలి లేటెస్ట్ ట్రెండీ వేర్లో మనసులు దోచేసింది. అమ్మడు అందాలు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. అంజలి అందాలకు అభిమానులు దాసోహం అంటున్నారు. 2014లో విడుదలైన గీతాంజలి మంచి విజయం సాధించింది. ఈ ఫ్రాంచైజీలో రెండో చిత్రంగా వస్తుంది గీతాంజలి మళ్ళీ వచ్చింది. కామెడీ హారర్ జోనర్లో తెరకెక్కించిన ఈ చిత్రంలో సునీల్, శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్, సత్య కీలక రోల్స్ చేస్తున్నారు.

అంజలి… గీతాంజలిగా మరోసారి అలరించనుంది. గీతాంజలి మళ్ళీ వచ్చింది మార్చి 22న విడుదల కానుంది. ఈ క్రమంలో ఇటీవల టీజర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి అంజలి ఎర్రని దుస్తుల్లో స్టైలిష్ గా హాజరైంది. సదరు బట్టల్లో ఒక ఫోటో షూట్ చేయగా వైరల్ అవుతుంది. గీతాంజలి మళ్ళీ వచ్చింది చిత్రానికి కోనా వెంకట్ కథ అందించారు. దర్శకత్వం శివ తుర్లపాటి వహించాడు.

గీతాంజలి మూవీ సక్సెస్ నేపథ్యంలో ఈ సీక్వెల్ ఫై అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్లో కథపై హింట్ ఇచ్చారు. ఓ సినిమా షూటింగ్ కోసం పాడుపడిన బంగ్లాకి చిత్ర యూనిట్ వెళతారు. ఆ భవనంలో మూడు దెయ్యాలు తిరుగుతూ ఉంటాయి. ఆ దెయ్యాలు ఎవరు? వాటి నేపథ్యం ఏమిటీ? గీతాంజలితో వాళ్లకు ఉన్న సంబంధం ఏమిటీ? అనేదే ప్రధాన కథ. అంజలికి పవర్ ఫుల్ పాత్ర దక్కింది. నటనకు ప్రాధాన్యత ఉన్న రోల్ ఆమెది.

మరోవైపు అంజలి కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తుంది. ఏకంగా ఆమె రామ్ చరణ్ సరసన ఛాన్స్ కొట్టేసింది. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రంలో అంజలి నటిస్తుంది. రామ్ చరణ్ ఎన్నికల అధికారిగా, రాజకీయ నాయకుడిగా రెండు భిన్నమైన రోల్స్ చేస్తున్నారు. ఫ్లాష్ బ్యాక్ లో చరణ్ నిజాయితీ పరుడైన రాజకీయ నాయకుడిగా కనిపిస్తారు. ఆ పాత్రకు భార్యగా అంజలి నటిస్తుంది. అలాగే విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీలో అంజలి నటిస్తుంది.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version