Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీ మోహన్( vallabhanni Vamsi Mohan) .. ప్రత్యేక గుర్తింపు పొందిన నేత ఈయన. రాజకీయంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఏరి కోరి కష్టాలను తెచ్చుకున్నారు. వరుసగా కేసులు నమోదయి.. జైలుకు పరిమితం అవుతున్నారు. ఆయనపై రిమాండ్ల మీద రిమాండ్లు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆయన పోల్చుకోలేని విధంగా మారడం విశేషం. సాధారణంగా వల్లభనేని వంశీ మోహన్ చలాకీగా ఉంటారు. చక్కగా మాట్లాడతారు. చాలా యాక్టివ్ గా కనిపిస్తారు. యంగ్ లుక్ తో ఉంటారు. కానీ గడిచిన కొద్ది రోజులుగా జైలు జీవితం అనుభవిస్తుండడంతో పూర్తిగా మారిపోయి కనిపించారు. తెల్లటి జుట్టుతో ఆయన లుక్ పూర్తిగా మారిపోయింది. అసలు ఆయన వల్లభనేని వంశీయేనా? అనే అనుమానం వచ్చేలా పరిస్థితి వచ్చింది.
Also Read : సిట్ ఏర్పాటు.. కబ్జాలపై ఫిర్యాదులు.. వల్లభనేని వంశీకి ఈజీ కాదు!
* కొనసాగుతున్న కష్టాలు
వల్లభనేని వంశీ మోహన్ కు కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. కోర్టు వరుసగా రిమాండ్( remand) విధిస్తూ వస్తోంది. తాజాగా వంశీ పై బెదిరించి భూమిని విక్రయించారని ఆరోపణలతో నమోదైన కేసులో గన్నవరం కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆవరణలో వంశీని ఆయన భార్య, లాయర్లు కలిశారు. ఈ క్రమంలో వల్లభనేని వంశీ కారు దిగగానే అందరూ ఆశ్చర్యంగా చూశారు. వంశి గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. తెల్ల జుట్టు, తెల్ల గడ్డంతో కనిపించారు. వంశీ కొత్త లుక్ లో ఉన్నారని చర్చించుకుంటున్నారు. ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
* రెండు నెలల కిందట
దాదాపు నెల రోజుల కిందట వల్లభనేని వంశీ అరెస్టు( arrest ) జరిగింది. ఆయనపై కేసుల మీద కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఉంగటూరు మండలం ఆత్కూరు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో రిమాండ్ విధిస్తూ గన్నవరం అదనపు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పును వెల్లడించింది. అలాగే గన్నవరం టిడిపి కార్యాలయం పై దాడి, సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులలో కూడా వంశీ అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇప్పటికే రెండు రిమాండ్లు కొనసాగుతుండగా.. తాజాగా మూడో రిమాండ్ కోర్టు విధించింది.
* శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదుతో..
వంశీ తన అనుచరులతో కలిసి బెదిరింపులకు పాల్పడి దాదాపు 9 ఎకరాలను విక్రయించారని ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు తేలప్రోలు కు చెందిన శ్రీధర్ రెడ్డి( Sridhar Reddy ) అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఉంగటూరు మండలం ఆత్కూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ఈ కేసులో వల్లభనేని వంశీ మోహన్ ఏ 2గా ఉన్నారు. దీంతో పోలీసులు పీటీ వారెంట్ సమర్పించారు. దీంతో విజయవాడ జిల్లా జైలు నుంచి మంగళవారం సాయంత్రం గన్నవరానికి తీసుకొచ్చి కోర్టులో హాజరు పరిచారు. ఏప్రిల్ ఒకటో తేదీ వరకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. అనంతరం వంశీని తిరిగి విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. అయితే కోర్టు ఆవరణలో వల్లభనేని వంశీని చూసిన ఆయన భార్య కన్నీటి పర్యాంతం అయ్యారు. వంశీ పూర్తిగా మారిపోయినట్టు కనిపించారు.
Also Read : వల్లభనేని వంశీ కేసులో ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు.. ఆ మూడు రోజులు అక్కడ ఉండాల్సిందే..
