Thaman : ఇటీవలే ప్రముఖ సంగీత దర్శకుడు తమన్(SS Thaman) ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ వివాదాస్పదంగా మారింది. యూట్యూబ్ లో వందల కొద్దీ మిలియన్ల వ్యూస్ ఎలా వస్తాయి అనే దానిపై ఆయన మాట్లాడిన మాటలు రామ్ చరణ్(Global Star Ram Charan) ఫ్యాన్స్ కి తీవ్రమైన కోపాన్ని తెప్పించాయి. గత నెలలో ఆయన ‘గేమ్ చేంజర్'(Game Changer Movie) చిత్రానికి సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. సినిమా విడుదలకు ముందే కేవలం రామ్ చరణ్ ఇమేజ్ మీదనే ఈ సినిమాకి హైప్ ఏర్పడింది కానీ, కంటెంట్ పరంగా మామూలు ఆడియన్స్ లో ఎలాంటి అంచనాలను ఏర్పాటు చేయలేకపోయింది. అందుకే అభిమానులు తప్ప ఈ సినిమాని ఎవ్వరూ చూడలేదు. మొదటి రోజు ఓపెనింగ్స్ కూడా అందుకే అనుకున్న స్థాయిలో రాలేదు. అయితే ఈ సినిమాకు తానూ మంచి మ్యూజిక్ ఇచ్చానని తమన్ చెప్పుకొచ్చాడు.
Also Read : మా నాన్న చనిపోయినందుకు నాకు ఏడుపు రాలేదు – తమన్
ఆయన మాట్లాడుతూ ‘ఎంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయినా, తమ సొంత టాలెంట్ తో కంపోజ్ చేసిన మ్యూజిక్ కి 20 నుండి 25 మిలియన్ వ్యూస్ మాత్రమే రప్పించగలడు. ఒక మంచి మెలోడీ సాంగ్ అయితే 100 మిలియన్ వ్యూస్ కి చేరుకుంటుంది. ఇక ఆ పైన వచ్చే వ్యూస్ మొత్తం కొరియోగ్రాఫర్ కంపోజ్ చేసే హుక్స్ స్టెప్స్ ని బట్టీ ఉంటుంది. ‘గేమ్ చేంజర్’ లో ఒక్క పాటలో కూడా హుక్ స్టెప్పులు లేవు. అందుకే ఆ పాటలు పెద్ద రేంజ్ కి వెళ్లలేకపోయింది. ఒక సాంగ్ యూట్యూబ్ లో వేరే లెవెల్ కి వెళ్లాలంటే కొరియోగ్రాఫర్ టాలెంట్, హీరో టాలెంట్ మీదనే ఆధారపడి ఉంటుంది, మా వల్ల అయ్యేది ఏమి లేదు’ అంటూ తమన్ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన మాటలపై సోషల్ మీడియా లో రామ్ చరణ్ అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
‘రా మచ్చా మచ్చా’ సాంగ్ లో హుక్ స్టెప్స్ ఉన్నాయి కదా, ఎందుకని ఆ పాట వేరే లెవెల్ కి వెళ్ళలేదు?, పాట ఎప్పుడో మా చిన్నప్పటి కాలం నాటిది లాగా అనిపించింది, కొత్తదనం లేదు, అందుకే ఆ పాట పెద్ద రేంజ్ కి వెళ్లలేకపోయింది అంటూ చెప్పుకొస్తున్నారు. ‘దేవర’ లోని ‘చుట్టమల్లే’ పాటలో ఏమి హుక్ స్టెప్స్ ఉన్నాయని అంత రేంజ్ లో సెన్సేషన్ సృష్టించింది?, పాట బాగుండడం వల్లే కదా, నీకు మంచి మ్యూజిక్ ఇవ్వడం రాదు కానీ, నువ్వు అనుకున్న రేంజ్ కి వెళ్లకపోయేసరికి రామ్ చరణ్ మీదకు నెట్టేస్తావా, ఇదెక్కడి న్యాయం అంటూ సోషల్ మీడియా లో రామ్ చరణ్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ‘గేమ్ చేంజర్’ పాటలకు యావరేజ్ రేంజ్ రీచ్ అయితే వచ్చింది కానీ, అనుకున్న స్థాయి రీచ్ మాత్రం కాలేదు. తమన్ ఈ చిత్రానికి మోడరేట్ రేంజ్ పాటలే ఇచ్చాడు.
Also Read : ‘గేమ్ చేంజర్’ లో డ్యాన్స్ కంటే నీదే బాగుంది..తమన్ సెటైర్స్ వైరల్!