Homeఆంధ్రప్రదేశ్‌Jagan pressure Vallabhaneni Vamsi: జగన్ ఒత్తిడితోనే గన్నవరంలో వల్లభనేని వంశీ

Jagan pressure Vallabhaneni Vamsi: జగన్ ఒత్తిడితోనే గన్నవరంలో వల్లభనేని వంశీ

Jagan pressure Vallabhaneni Vamsi: వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress )పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. మొన్ననే ఆయన జైలుకు వెళ్లి వచ్చిన తరువాత కొద్ది రోజులపాటు సైలెంట్ గా ఉన్నారు. ఆ తరువాత గన్నవరం నియోజకవర్గంలో పర్యటనలను మొదలుపెట్టారు. అయితే ఆయన అంతగా రాజకీయ ఆసక్తితో లేరని తెలుస్తోంది. ఒకవేళ పార్టీ పట్టుపడితే తన భార్యను రంగంలోకి దించేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అందుకు అంగీకరించలేదు. వల్లభనేని వంశీ అయితే గన్నవరంలో నెగ్గుకు రాగలరని జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం. అందుకే జగన్ బలవంతం మీద ఆయన ఇప్పుడు గన్నవరంలో పర్యటనలు చేస్తున్నారు. అయితే ఒక వైపు కూటమి ఇక్కడ బలంగా ఉంది. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పై వంశీ రూపంలో రిమార్క్ ఉంది. దానిని అధిగమిస్తే గాని అక్కడ విజయం సాధించలేదు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.

అనేక రకాల ఆరోపణలు..
వల్లభనేని వంశీ మోహన్( vallabhavani Vamsi Mohan ) రెండుసార్లు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. 2014లో తొలిసారిగా గెలిచిన ఆయన ఐదేళ్లపాటు అధికార టిడిపిలో కొనసాగారు. 2019లో టిడిపిలో రెండోసారి గెలిచి వైసీపీలో చేరారు. అయితే ఇలా పదేళ్లపాటు అధికార పార్టీగా కొనసాగిన ఆయనపై నేరుగా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. టిడిపి హయాంలో సైతం చాలా అవినీతి కేసులు ఉన్నాయి. వాటిని సాకుగా చూపి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆయనను ఆకర్షించింది. వైసీపీలో చేరిన తర్వాత ఆయన అవినీతి మరింత పెరిగిందే కానీ తగ్గలేదు. అనుచరులపై కాకుండా నేరుగా ఆయన పైనే విమర్శలు, అవినీతి ఆరోపణలు వచ్చాయి. పైగా చంద్రబాబుతో పాటు లోకేష్ పై నిత్యం అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. మరోవైపు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పై కూడా అసెంబ్లీ వేదికగా వల్లభనేని వంశీ మోహన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన జైలు పాలయ్యారు. కానీ ఆయనపై ఉన్న ఆరోపణల నేపథ్యంలో పెద్దగా సానుభూతి రాలేదు వల్లభనేని వంశీ మోహన్ పై.

యార్లగడ్డ కు మంచి పేరు..
అయితే వల్లభనేని వంశీ మోహన్ పై రెండు సార్లు పోటీ చేశారు సిటింగ్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు( yaar Lagda Venkat Rao ). 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ మోహన్ పై పోటీ చేసి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో మాత్రం అదే వల్లభనేని వంశీ మోహన్ పై పోటీ చేసి టిడిపి అభ్యర్థిగా గెలిచారు. అయితే ఇక్కడ వైసిపి తో పోల్చుకుంటే టిడిపికి బలమైన క్యాడర్ ఉంది. పైగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అనుచరులపై అవినీతి ఆరోపణలు రావొచ్చేమో కానీ.. యార్లగడ్డ వెంకట్రావుకు మాత్రం నియోజకవర్గంలో మంచి పేరు ఉంది. అందుకే ఇప్పుడు వల్లభనేని వంశీ చేసే ప్రయత్నాలు ఏవి వర్కౌట్ కావు. అందుకే వల్లభనేని వంశీ మోహన్ సైతం దూకుడు రాజకీయాలు చేయడం లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి ఒత్తిడితోనే ఆయన గన్నవరంలో పర్యటనలు చేస్తున్నారు. వాస్తవానికి 2024 ఎన్నికలకు ముందు పోటీకి వల్లభనేని వంశీ పెద్దగా ఇష్టపడలేదని ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు కేసుల దృష్టి ఆయన స్థానికంగా ఉండాల్సిన పరిస్థితి. అందుకే ఏదో నామమాత్రంగా ఉంటున్నారే తప్ప యాక్టివ్ పాలిటిక్స్ చేయడం లేదన్న టాక్ ఉంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...
Narendra Modi

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....
Cockroach Janata Party youth politics

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...
CJP Protests

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper