Homeఆంధ్రప్రదేశ్‌Nara Rohith enters AP politics: ఏపీ రాజకీయాల్లోకి మరో యువ నటుడు!

Nara Rohith enters AP politics: ఏపీ రాజకీయాల్లోకి మరో యువ నటుడు!

Nara Rohith enters AP politics: తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) అంటే ముందుగా గుర్తొచ్చే పేర్లు నందమూరి, నారా కుటుంబాల వారివి. తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే అధికారంలోకి తీసుకు రాగలిగారు నందమూరి తారక రామారావు. అయితే చంద్రబాబు ఆ పార్టీకి సుదీర్ఘకాలం అధ్యక్షుడిగాను వ్యవహరించారు. నాలుగు దశాబ్దాల పాటు ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో చంద్రబాబు పాత్ర మరువరానిది. అయితే ఇప్పుడు ఆ పార్టీకి భవిష్యత్తు నాయకుడు లోకేష్ అనడంలో […]

Nara Rohith enters AP politics: తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) అంటే ముందుగా గుర్తొచ్చే పేర్లు నందమూరి, నారా కుటుంబాల వారివి. తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే అధికారంలోకి తీసుకు రాగలిగారు నందమూరి తారక రామారావు. అయితే చంద్రబాబు ఆ పార్టీకి సుదీర్ఘకాలం అధ్యక్షుడిగాను వ్యవహరించారు. నాలుగు దశాబ్దాల పాటు ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో చంద్రబాబు పాత్ర మరువరానిది. అయితే ఇప్పుడు ఆ పార్టీకి భవిష్యత్తు నాయకుడు లోకేష్ అనడంలో సందేహం లేదు. తనను తాను ప్రూవ్ చేసుకొని ముందుకు సాగుతున్నారు లోకేష్. తెలుగుదేశం పార్టీని అనధికారిక అధ్యక్షుడిగా కొనసాగుతూ.. పార్టీని సమన్వయం చేసుకోవడమే కాదు బలోపేతం చేయడంలో లోకేష్ ముందుంటున్నారు. అదే సమయంలో నందమూరి కుటుంబం నుంచి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు. అయితే ఇప్పుడు నారా కుటుంబం నుంచి మరో యువ నేత రంగంలోకి వస్తారని ప్రచారం నడుస్తోంది. సినీ నటుడు నారా రోహిత్ పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకు బలం చేకూరుస్తూ ఆయన సైతం ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

నారా రామ్మూర్తి నాయుడు కుమారుడు..
చంద్రబాబు నాయుడు( CM Chandrababu Naidu) సోదరుడిగా రామ్మూర్తి నాయుడు ఉండేవారు. ఆయన ఒకసారి చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. చాలా రోజులపాటు అనారోగ్యంతో బాధపడుతూ గత ఏడాది చనిపోయారు రామ్మూర్తి నాయుడు. ఆయన కుమారుడే నారా రోహిత్. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు. అయితే ఇంతవరకు ఆయనకు సినిమా రంగంలో సరైన బ్రేక్ తగలలేదు. మొన్ననే వివాహం చేసుకొని ఒక ఇంటి వాడు అయ్యాడు. అయితే తనకు రాజకీయ ఆసక్తి ఉందని తాజాగా వెల్లడించాడు. నారా రామ్మూర్తి నాయుడు జయంతి వేడుకలు ఆయన సొంత గ్రామం నారావారి పల్లెలో జరిగాయి. తండ్రికి నివాళులు అర్పించేందుకు నారా రోహిత్ వెళ్లారు. పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని మీడియా ప్రతినిధులు అడిగితే.. కచ్చితంగా ఉంటుందని ఆయన చెప్పారు. తనకు రాజకీయాలు అంటే ఇష్టంగా పేర్కొన్నారు. సరైన సమయంలో పొలిటికల్ ఎంట్రీ ఇస్తానని కూడా చెప్పుకొచ్చారు.

అంతా చంద్రబాబు కుటుంబమే..
నారా రామ్మూర్తి నాయుడు అనారోగ్యానికి గురికావడంతో నారా రోహిత్ ( Nara Rohit) బాధ్యతలను ఎక్కువగా చంద్రబాబు చూసుకున్నారు. ఆయన పొలిటికల్ గా బిజీగా ఉండడంతో పెద్దమ్మ భువనేశ్వరి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మొన్న రోహిత్ వివాహంలో కూడా భువనేశ్వరి అన్ని తానై వ్యవహరించారు. పెదనాన్న చంద్రబాబు, సోదరుడు లోకేష్ తో రోహిత్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. 2024 ఎన్నికల్లో టిడిపి కూటమికి మద్దతుగా రోహిత్ ప్రచారం కూడా చేశారు. లోకేష్ తెలుగుదేశం పార్టీ నాయకత్వ బాధ్యతలు తీసుకుంటే కుటుంబ పరంగా ఆయనకు మద్దతు అవసరం. అందుకే నారా రోహిత్ పొలిటికల్ ఎంట్రీ కి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన చంద్రగిరి నుంచి బరిలో దిగుతారని నారా అభిమానులు భావిస్తున్నారు. అయితే ప్రత్యక్ష ఎన్నికల్లోనే కాకుండా పార్టీ పరంగా కూడా నారా రోహిత్ సేవలను టిడిపి నాయకత్వం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. పెదనాన్న చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మరుక్షణం టిడిపిలో యాక్టివ్ అయ్యేందుకు నారా రోహిత్ సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper