Vallabhaneni Vamsi: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్( Vamsi Mohan ) జైలు నుంచి విడుదలయ్యారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆయనకు బెయిల్ లభించింది. దాదాపు 137 రోజులు ఆయన జైల్లో ఉండిపోవాల్సి వచ్చింది. ఫిబ్రవరి 16న ఆయన హైదరాబాదులో అరెస్టయ్యారు. కేసుల మీద కేసులు కొనసాగుతూ వచ్చాయి. ఏకంగా ఆయన పై 11 కేసులు నమోదయ్యాయి. చివరకు సుప్రీంకోర్టు జోక్యంతో ఆయనకు బెయిల్ లభించింది. బెయిల్ పై విడుదలైన వంశీకి ఘనస్వాగతం లభించింది. మాజీమంత్రి పేర్ని నాని, ఎమ్మెల్సీ తలసీల రఘురాం వంటి నేతలు జైలు వద్ద ఆహ్వానం పలికారు. భారీ కాన్వాయ్ నడుమ వల్లభనేని వంశీ మోహన్ కారులో వెళ్లిపోయారు. అయితే ఆయన అసలు మీడియాతో మాట్లాడలేదు. దీనిపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. కోర్టు ఆదేశాలు ఉండడంతోనే ఆయన మీడియాతో మాట్లాడలేదని తెలుస్తోంది.
Also Read: ‘తల్లికి వందనం’ రెండో విడత అప్పుడే.. కొత్తగా వారికి!
రాజకీయాలకు ఫుల్ స్టాప్..
వల్లభనేని వంశీ మోహన్ రాజకీయాలకు దూరం అవుతారని ఒక ప్రచారం జరుగుతోంది. మాజీ ఎంపీ కేసినేని నాని( Nani ) మాదిరిగా రాజకీయాల నుంచి తప్పుకోవడమే మేలన్న నిర్ణయానికి ఆయన వచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి 2024 ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేసేందుకు ఆయన వెనుకడుగు వేశారన్న ప్రచారం ఉంది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన గన్నవరంలో పెద్దగా కనిపించిన దాఖలాలు కూడా లేవు. అయితే గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో మాత్రం ఆయన బాధపడుతూ వస్తున్నారు. ఏకంగా 137 రోజులపాటు ఆయన జైల్లో గడపడం.. అనారోగ్య సమస్యలు వెంటాడడంతో వంశీ పూర్తిగా బలహీనంగా కనిపిస్తున్నారు. ఆయన రాజకీయాలు విడిచిపెట్టి ప్రశాంత జీవితంలోకి వెళ్తారని అనుచరులు చెబుతున్నారు.
జైలు నుంచి విడుదల అయిన #vallabhanenivamsi కు భారీగా స్వాగతం పలికిన అభిమానులు, @YSRCParty కార్యకర్తలు. pic.twitter.com/jM9VlSpBOJ
— greatandhra (@greatandhranews) July 2, 2025
టిడిపి ద్వారా ఎంట్రీ..
తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు వల్లభనేని వంశీ మోహన్. 2014, 2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. రెండోసారి గెలిచిన కొద్ది రోజులకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. అయితే ఆయన అనవసరంగా చంద్రబాబుతో పాటు లోకేష్ పై నోరు పారేసుకునేవారు. అందుకే ఆయన రెడ్ బుక్ లో నెంబర్ వన్ గా మారానని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు సుదీర్ఘకాలం జైల్లో ఉండి పోవడంతో పూర్తిగా అనారోగ్యానికి గురయ్యారు. ఇప్పట్లో కోలుకోలేని విధంగా మారారు. అయితే ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటారు అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రశాంత జీవితం వైపు అడుగులు వేస్తారని.. కొద్ది రోజుల్లో దీనికి సంబంధించిన ప్రకటన వస్తుందని కూడా ఎక్కువగా ప్రచారం సాగుతోంది.
Also Read: రండి రాహుల్ ను ప్రధానిని చేద్దాం.. షర్మిలక్కది దింపుడు కళ్లెం ఆశనే?
ప్రత్యామ్నాయ నేత సిద్ధం..
మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy ) సైతం వల్లభనేని వంశీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వల్లభనేని వంశీ మోహన్ ఒప్పుకుంటే ఆయన భార్యకు నియోజకవర్గ ఇన్చార్జి పోస్ట్ ఇస్తారని సమాచారం. ఒకవేళ వద్దంటే మాత్రం కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సుంకర పద్మశ్రీకి పార్టీలోకి రప్పించి బాధ్యతలు అప్పగిస్తారని మరో ప్రచారం నడుస్తోంది. కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు గా ఉన్న పద్మశ్రీ షర్మిల తో విభేదిస్తున్నారు. వల్లభనేని వంశీ మోహన్ యాక్టివ్ కాకుంటే మాత్రం పద్మశ్రీకి బాధ్యతలు అప్పగిస్తారని వైసీపీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
నిన్న జైలు నుంచి విడుదల అయిన #vallabhanenivamsi ను తన ఇంట్లో కలిసి పరామర్శించిన #Perninani , @YSRCParty నాయకులు. pic.twitter.com/YZUV4PCHb1
— greatandhra (@greatandhranews) July 3, 2025