Singayya Wife: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఘోర పరాభవం చవి చూశారు. 151 స్థానాలతో 2019 అధికారంలోకి వచ్చిన వైసీపీ 2024 ఎన్నిల్లో కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. ఇక ఇటీవల పల్నాడు నియోజకవర్గ పర్యటనకు జగన్ వెళ్లారు. ఈ సమయంలో సింగయ్య అనే వైసీపీ కార్యకర్తలు జగన్ కారుకింద పడి మృతిచెందడం వివాదాస్పదంగా మారింది.
Also Read: ఇక మీదట దిల్ రాజు కి మెగా హీరోల నుంచి అవకాశాలు రావా..?
సింగయ్య మృతి..
Singayya Wife పల్నాడు జిల్లాలోని రెంటపాళ్లలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో వైసీపీ కార్యకర్త సింగయ్య మరణించాడు. ఈ ఘటన తర్వాత, సింగయ్య భార్య లూర్దు మేరి, తన భర్త మరణం వెనుక అనుమానాస్పద అంశాలున్నాయని, ముఖ్యంగా నారా లోకేశ్, ఆయన అనుచరుల పాత్రపై సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలు రాజకీయ రీతిలో తీవ్ర దుమారం రేపాయి.
లూర్దు మేరి సంచలన ఆరోపణలు..
సింగయ్య మరణం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వివాదానికి కేంద్రబిందువైంది. ఈ ఘటన జగన్ పర్యటన సమయంలో జరగడంతో, టీడీపీ. వైసీపీ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తీవ్రమయ్యాయి. లూర్దు మేరి తన ఆరోపణలతో నారా లోకేశ్‌ను టార్గెట్ చేశారు. దీంతో ఈ ఘటన రాజకీయ కోణంలో మరింత సంక్లిష్టమైంది. వైసీపీ అనుకూల మీడియా ఈ ఆరోపణలను విస్తృతంగా ప్రచారం చేస్తుండగా, టీడీపీ నాయకులు ఈ ఆరోపణలను రాజకీయ కుట్రగా అభివర్ణిస్తున్నారు.
Also Read: ఇండస్ట్రీ ని సాధించాల్సిన ఎన్టీఆర్ ఆ ఒక్క సినిమాతో పాతాళానికి పడిపోయాడా..