Hari Hara Veera Mallu Trailer Review: కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu Movie) చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ కాసేపటి క్రితమే విడుదలైంది. అభిమానులు ఈ ట్రైలర్ కంటెంట్ కోసం ఎంతో ఆత్రుతతో ఎదురు చూసారు. ఎందుకంటే ఇప్పటి వరకు విడుదలైన ‘హరి హర వీరమల్లు’ కంటెంట్ ఒక్కటి కూడా వావ్ అని అనిపించుకోలేకపోయింది. పాటలకు కూడా పర్వాలేదు అనే రేంజ్ రెస్పాన్స్ మాత్రమే వచ్చింది. పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) రెగ్యులర్ సినిమాకి ఉండే హైప్ ఈ చిత్రానికి ఏర్పడకపోవడం తో అభిమానులు కాస్త కంగారు పడ్డారు. పవన్ కళ్యాణ్ రేంజ్ ఓపెనింగ్స్ వస్తాయో లేదో అని భయపడ్డారు. కానీ ట్రైలర్ మాత్రం వారిలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. పూనకాలతో ఊగిపోయేలా చేసింది. ఇది కదా పవర్ స్టార్ సినిమా అంటే అంటూ సోషల్ మీడియా లో అభిమానులు గర్వంగా మాట్లాడుకునేలా చేసింది.
Also Read: ఇండస్ట్రీ ని సాధించాల్సిన ఎన్టీఆర్ ఆ ఒక్క సినిమాతో పాతాళానికి పడిపోయాడా..?
ఈ ట్రైలర్ లోని గ్రాండియర్, స్కేల్ ని చూసి అభిమానులు మెంటలెక్కిపోయారు. ఇది అసలు మా పవన్ కళ్యాణ్ సినిమానేనా అని అభిమానులు ఆశ్చర్యపోయేలా చేసింది. అంటే మామూలు కమర్షియల్ సినిమాల్లోనే ఇది వరకు మనం పవన్ కళ్యాణ్ ని చూసాము. అలాంటి హీరో ని ఇలాంటి జానర్ లో చూడడం ఫ్యాన్స్ కి మాత్రమే కాదు, ఆడియన్స్ కి కూడా పెద్ద సర్ప్రైజ్. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ట్రైలర్ పవన్ కళ్యాణ్ బాహుబలి అనే విధంగా ఉంది. ట్రైలర్ ప్రారంభం లో అర్జున్ దాస్ వాయిస్ ఓవర్, దానిని అనుసరిస్తూ భారీ విజువల్స్ ఫ్యాన్స్ ని మెంటలెక్కిపోయేలా చేసింది. ముఖ్యంగా ట్రైలర్ చివరి 40 సెకండ్స్ కి గూస్ బంప్స్ అనే మాట చాలా తక్కువ. అంత అద్భుతంగా ఉంది. డైలాగ్స్ కూడా ఎదో ఇరికించినట్టు కాకుండా చాలా సహజంగా అనిపించాయి.
ఓవరాల్ గా ఈ ట్రైలర్ లో ముందు నుండి చెప్పినట్టు గానే 140 షాట్స్ ఉన్నాయి. ఒక్కో VFX షాట్ పది లేయర్లతో సిద్ధం చేశారట. ఈమధ్య కాలం లో ఇంతటి ఖర్చు ఏ సినిమాకు చేయలేదని సమాచారం. ఇక కీరవాణి అందించిన మ్యూజిక్ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఆయన ఇచ్చిన సంగీతం ఫోన్ లో చూస్తే సరిపోదు, కచ్చితంగా థియేటర్స్ లో చూడాల్సిందే. మాస్ గా చెప్పాలంటే థియేటర్స్ దొమ్మలు అదిరిపోయాయి అనే చెప్పాలి. ఎందుకు ఆయనకు ఆస్కార్ అవార్డు వచ్చిందో చెప్పడానికి ఈ ట్రైలర్ లోని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరో ఉదాహరణ గా భావించొచ్చు. అంతే బాగానే ఉంది కానీ, రెడ్ డ్రెస్ లో పవన్ కళ్యాణ్ చేసే భారీ యాక్షన్ సీక్వెన్స్ క్వాలిటీ మాత్రం ఆశించిన స్థాయిలో లేదని చిన్న నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ఉంది. థియేటర్స్ లో ఈ సీక్వెన్స్ ఎలా ఉంటుందో చూడాలి.
