https://oktelugu.com/

Uttarandhra: ఉత్తరాంధ్ర – తెలుగు దేశం – కేంద్రమంత్రులు

Uttarandhra: 1996లో ఎన్డీఏ ప్రభుత్వంలో కింజరాపు రామ్మోహన్ నాయుడుకు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చాన్స్ వచ్చింది. శ్రీకాకుళం ఎంపీగా ఎర్రం నాయుడు ఎన్నికయ్యారు. వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

Written By:
  • Dharma
  • , Updated On : June 10, 2024 / 10:19 AM IST

    Uttarandhra TDP Union Ministers

    Follow us on

    Uttarandhra: ఉత్తరాంధ్రకు అరుదైన గౌరవం మరోసారి దక్కింది. కేంద్ర మంత్రివర్గంలో శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడుకు స్థానం కల్పించారు. క్యాబినెట్ మంత్రిగా ఆయన ప్రమాణస్వీకారం చేశారు. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి మూడుసార్లు తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఎన్నికైన ఆయనకు ఈ అరుదైన గౌరవం దక్కింది. సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటులో తెలుగుదేశం పార్టీ క్రియాశీలక పాత్ర పోషించింది. అలా ప్రభుత్వాలు ఏర్పాటు చేసే సమయంలో టిడిపికి కేంద్రమంత్రి పదవులు లభించాయి. కానీ చంద్రబాబు మాత్రం ఉత్తరాంధ్రకు పెద్దపీట వేయడం విశేషం. గతంలో కింజరాపు ఎర్రం నాయుడు, తర్వాత అశోక్ గజపతిరాజు, ఇప్పుడు రామ్మోహన్ నాయుడుకు కేంద్ర మంత్రి పదవి లభించింది.

    1996లో ఎన్డీఏ ప్రభుత్వంలో కింజరాపు రామ్మోహన్ నాయుడుకు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చాన్స్ వచ్చింది. శ్రీకాకుళం ఎంపీగా ఎర్రం నాయుడు ఎన్నికయ్యారు. వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పుడు కూడా టిడిపి సపోర్ట్ అనివార్యంగా మారింది. చంద్రబాబు సైతం ఎన్డీఏ కన్వీనర్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు.ఆ సమయంలో కేంద్ర మంత్రి పదవి ఎర్రం నాయుడుకు వరించింది. ఒక విధంగా చెప్పాలంటే ఎర్రం నాయుడు జాతీయ నాయకుడుగా మారాడు అంటే ఈ పదవితోనే.

    Also Read: Srinivasa Varma: ఆ ఇద్దరినీ తప్పించి శ్రీనివాస్ వర్మకు అవకాశం

    2014లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కేంద్ర మంత్రివర్గంలోకి టిడిపి, రాష్ట్ర మంత్రివర్గంలోకి బిజెపి చేరాయి. కేంద్రంలో టిడిపికి రెండు మంత్రి పదవులు వచ్చాయి. రాష్ట్రంలో బిజెపికి రెండు మంత్రి పదవులు కేటాయించారు. అప్పట్లో అశోక్ గజపతిరాజుకు మంత్రి పదవి వరించింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఛాన్స్ దక్కింది. ఆ సమయంలోనే భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంతో పాటు విమానాశ్రయాల అభివృద్ధికి బీజం పడింది. 2018లో ఎన్డీఏ నుంచి టిడిపి బయటకు రావడంతో అశోక్ గజపతిరాజు రాజీనామా చేయాల్సి వచ్చింది.

    Also Read: Pemmasani Chandrasekhar : పెమ్మసాని : డబ్బులోనే కాదు, అనుభవంలోనూ సంపన్నుడే !

    ఉత్తరాంధ్రలో కింజరాపు కుటుంబం టిడిపిలో కొనసాగింది. ఎన్ని రకాల ఒత్తిళ్లు వచ్చినా చంద్రబాబుకు అండగా నిలబడింది. పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చింది. అందుకే ఆ కుటుంబానికి పెద్దపీట వేశారు చంద్రబాబు. తండ్రి ఎర్రన్నాయుడుకు కేంద్ర మంత్రిగా ప్రోత్సహించారు. ఇప్పుడు కుమారుడు రామ్మోహన్ నాయుడుకు సైతం వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. మొత్తానికైతే ఉత్తరాంధ్రకు,కేంద్ర మంత్రి పదవులకు అవినాభావ సంబంధం ఉంది.