https://oktelugu.com/

Srinivasa Varma: ఆ ఇద్దరినీ తప్పించి శ్రీనివాస్ వర్మకు అవకాశం

శ్రీనివాస వర్మ కు ఆర్ఎస్ఎస్ తో మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలో ఆయన పెద్దగా పదవులు చేపట్టింది లేదు. భీమవరం మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్ గా మాత్రమే పదవి చేపట్టారు. అయితే నరసాపురం నుంచి రఘురామకృష్ణం రాజు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది.

Written By:
  • Dharma
  • , Updated On : June 10, 2024 / 09:18 AM IST

    Srinivasa Varma

    Follow us on

    Srinivasa Varma: ఏపీ నుంచి బిజెపి ఎంపీలుగా ముగ్గురు గెలిచారు. రాజమండ్రి నుంచి దగ్గుబాటి పురందేశ్వరి, అనకాపల్లి నుంచి సీఎం రమేష్, నరసాపురం నుంచి శ్రీనివాస వర్మ విజయం సాధించారు. ఆరు లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తే మూడింటి మాత్రమే బిజెపి గెలిచింది. అయితే అనూహ్యంగా శ్రీనివాస వర్మ కు కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కింది. పురందేశ్వరి, సీఎం రమేష్ కు రిక్త హస్తం ఎదురైంది. అయితే దీని వెనుక ఉన్న కారణాలు ఏంటి అన్నది తెలియడం లేదు. శ్రీనివాస వర్మ బిజెపి సీనియర్ నాయకుడు. కానీ అంతగా ప్రాచుర్యం పొందినది లేదు. అయినా సరే బిజెపి హై కమాండ్ ఆయన సేవలను గుర్తించి మంత్రి పదవికి ఎంపిక చేసింది. అసలు ఆయన పేరు ఉంటుందని ఎవరు అంచనా వేయలేకపోయారు.

    శ్రీనివాస వర్మ కు ఆర్ఎస్ఎస్ తో మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలో ఆయన పెద్దగా పదవులు చేపట్టింది లేదు. భీమవరం మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్ గా మాత్రమే పదవి చేపట్టారు. అయితే నరసాపురం నుంచి రఘురామకృష్ణం రాజు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. చివరి వరకు ఆయన ఆశావహుడిగా ఉన్నారు. బిజెపి టికెట్ కేటాయించకపోవడంతో టిడిపిలో చేరి ఉండి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. శ్రీనివాస వర్మకు ఎంపీ టికెట్ అనూహ్యo అనుకుంటే.. ఆయన కేంద్ర మంత్రి పదవి దక్కించుకోవడం కూడా విశేషమే.

    ఏపీ బీజేపీ కోటాకు సంబంధించి పురందేశ్వరి కి మంత్రి పదవి పక్కా అని ప్రచారం జరిగింది. ఆమె పదేళ్లపాటు కేంద్రమంత్రిగా పనిచేశారు. సీనియర్ నాయకురాలు. ఆపై ఏపీ బీజేపీ చీఫ్ గా ఉన్నారు. సీఎం రమేష్ సైతం బిజెపి అగ్ర నేతలకు అత్యంత సన్నిహితులు. అయితే వీరిద్దరినీ కాదని వర్మకు ఛాన్స్ ఇచ్చారు మోడీ. టిడిపి కోట నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ లకు చాన్స్ దక్కింది.

    అయితే శ్రీనివాస వర్మ కు మంత్రి పదవి దాకడం వెనుక ఉన్న వ్యూహం ఏంటి అన్నది తెలియడం లేదు. ముఖ్యంగా పురందేశ్వరిని పక్కనపెట్టి పదవి ఇవ్వడం కూడా రకరకాల చర్చ నడుస్తోంది. చంద్రబాబు పట్టు పట్టలేదా? లేకుంటే ఆమెకు మరో ఛాన్స్ ఇస్తారా? అన్నది తెలియాల్సి ఉంది