Homeఆంధ్రప్రదేశ్‌El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. వచ్చే వానాకాలంలోపు జరిగే దారుణాలివీ..

El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. వచ్చే వానాకాలంలోపు జరిగే దారుణాలివీ..

El Nino Effect: తెలుగు రాష్ట్రాల ప్రజలకు రాబోయే నెలలు కీలకంగా మారనున్నాయా? టెల్ మీ నో ప్రభావం బలపడుతుందన్న వాతావరణ అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే వర్షపాతం లోటు.. జలాశయాలలో తగ్గుతున్న నీటి నిల్వలు.. భూగర్భ జలాలపై పెరుగుతున్న ఒత్తిడి వంటి పరిణామాలు తెలంగాణ.. ఏపీ ప్రభుత్వాలకు సవాల్ గా మారుతున్నాయి. తాగునీటి సరఫరా.. వ్యవసాయానికి విద్యుత్తు.. రబీ పంటల సాగు.. కూరగాయలు.. నిత్యవసరల ధరలపై ప్రభావం వంటి అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాది […]

El Nino Effect: తెలుగు రాష్ట్రాల ప్రజలకు రాబోయే నెలలు కీలకంగా మారనున్నాయా? టెల్ మీ నో ప్రభావం బలపడుతుందన్న వాతావరణ అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే వర్షపాతం లోటు.. జలాశయాలలో తగ్గుతున్న నీటి నిల్వలు.. భూగర్భ జలాలపై పెరుగుతున్న ఒత్తిడి వంటి పరిణామాలు తెలంగాణ.. ఏపీ ప్రభుత్వాలకు సవాల్ గా మారుతున్నాయి. తాగునీటి సరఫరా.. వ్యవసాయానికి విద్యుత్తు.. రబీ పంటల సాగు.. కూరగాయలు.. నిత్యవసరల ధరలపై ప్రభావం వంటి అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

ఈ ఏడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ కాలంలో ఎల్ నీనో మరింత బలపడే అవకాశం కనిపిస్తోంది. పసిఫిక్ మహాసముద్రంలో భూమధ్య రేఖ ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ వాతావరణ పరిస్థితి గతంలో ఉన్నప్పటికీ.. ఈసారి అధికంగా ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అందువల్లే సముద్రం నుంచి వాతావరణంలోకి వెళ్లే వేడి.. గాలుల తీవ్రత వర్షపాతంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నాయి. అందువల్లే మన దేశంలో ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. ఈ గాలుల వల్ల నైరుతి రుతుపవనాలు బలహీనపడ్డాయి. కొన్ని ప్రాంతాలలో వర్షాలు కురిసినప్పటికీ ఆశించిన స్థాయిలో అయితే కాదు.. ఈ ఏడాది ఎల్ నినోవల్ల దేశాప్తంగా వర్షపాత లోటు దారుణంగా ఉంది. అనేక ప్రాంతాలలో తక్కువ వర్షాలు కురిసాయి. మరోవైపు దక్షిణ ద్వీపకల్పంలో కొన్ని ప్రాంతాలలో సాధారణ కంటే అధికంగా వర్షపాతం నమోదయిందని నివేదికలు చెబుతున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో వర్షపాతం లోటు నీటి వనరులపై విపరీతమైన ఒత్తిడి పెంచుతుంది. నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసే సమయానికి రాష్ట్రంలో సాధారణ కంటే దాదాపు 17% తక్కువ వర్షపాతం నమోదైనట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో 33 జిల్లాల్లో 18 జిల్లాలు వర్షపాతం లోటును ఎదుర్కొంటున్నాయి. హైదరాబాద్ నగరంలో దాదాపు 27% లోటు వర్షపాతం నమోదయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 235 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించి.. సహాయం అందించాలని కేంద్రాన్ని కోరినట్టు తెలుస్తోంది.

ఇక ఆంధ్రప్రదేశ్లో వర్షపాతం తక్కువ నమోదయింది. జలాశయాలలో నీటి నిల్వ అంతగా లేకపోవడంతో తాగునీటికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వర్షాలు సరిగా కురువకపోవడంతో చాలా ప్రాంతాలలో భూగర్భ జలాల మీద ఆధార పడాల్సి వస్తోంది. దీనివల్ల విద్యుత్ వినియోగం పెరుగుతోంది. భూగర్భ జలాల మీద ఒత్తిడి కూడా పెరుగుతుంది.

ఇప్పటికే బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇతర నిత్యావసరాల ధరలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో విద్యుత్ వినియోగం తగ్గించుకోవాలి. నీటి పొదుపుని పాటించాలి. లేనిపక్షంలో ఇబ్బందులు ఎదుర్కొక తప్పదు. మూగజీవాలు తినే గడ్డి నుంచి మొదలు పెడితే ధాన్యం వరకు ప్రతిదీ కొరతే ఉంటుంది. అలాంటప్పుడు ధరల స్థాయి పెరిగే ప్రమాదం ఉంది. అందువల్లే ప్రజలు స్వీయ నియంత్రణ పాటించి.. సాధ్యమైనంత వరకు పొదుపు సూత్రం అలవర్చుకోవాలని ప్రభుత్వం చెబుతోంది. ఒక రకంగా ఇది కరోనా కంటే తీవ్రమైన విపత్తు అని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలో ప్రజలు సాధ్యమైనంత వరకు జాగ్రత్తలు పాటిస్తేనే బాగుంటుంది. లేనిపక్షంలో ఇబ్బందులు ఎదుర్కొక తప్పదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper