Vijayasai Reddy : పాపం.. విజయసాయిరెడ్డిని ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారుగా!

సోషల్ మీడియా పరిధి విస్తరిస్తోంది. దానివల్ల ప్రయోజనాల కంటే దుష్పరిణామాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎటువంటి పోస్ట్ దర్శనమిస్తున్నా.. అది తమ కోసమే నన్న భావన వ్యక్తమౌతోంది. ఈ క్రమంలో కొన్ని రకాల అనుమానాలు నెలకొంటున్నాయి.

Written By: Dharma, Updated On : August 20, 2024 5:14 pm

Social media trolls on Vijayasai Reddy

Follow us on

Vijayasai Reddy :మొగుడు కొట్టాడు అనేకంటే.. తోటి కోడలు నవ్వితేనే ఎక్కువగా బాధ ఉంటుంది అంటారు. ఇప్పుడు ఆ పెయిన్ విజయసాయిరెడ్డి అనుభవిస్తున్నారు. వైసీపీలో నెంబర్ 2 గా ఉంటూ గర్జన వెలగబెట్టారు విజయ సాయి రెడ్డి. అప్పుడెప్పుడో జగన్ తో పాటు అక్రమాస్తుల కేసులో ఏ2గా జైలుకుపోయినా.. అటు తరువాత వైసిపి ఏర్పాటు.. అధికారంలోకి రాకపోవడంతో దర్జాను వెలగబెట్టారు.పెద్ద పెద్ద పదవులు అనుభవించారు.పెద్దవారితో సన్నిహిత్యం పెంచుకున్నారు.అంతవరకు బాగానే ఉంది కానీ.. లేటు వయసులో వివాహేతర సంబంధాలను మూటగట్టుకున్నారు. తన భార్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి మరొకరు ఆరోపించేదాకా పరిస్థితిని తెచ్చుకున్నారు. చివరకు డిఎన్ఏ పరీక్షకు సిద్ధం కావాలంటూ డిమాండ్ చేసే పరిస్థితికి వచ్చింది.ఆరోపణలు ఒకరు చేస్తే.. ఒరేయ్ కిట్టుగా..ఒరేయ్ సాంబ.. ఒరేయ్ తురేయ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేయాల్సి వచ్చింది. ఏపీ మీడియా అంటే చాటేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఆరోపించింది ఒక భర్త. ఆరోపణలను విజయసాయిరెడ్డి. కానీ ఆయన ఆక్షేపించింది మాత్రం మీడియాను. ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియాను ఆక్షేపించడం ప్రారంభించారు. పేర్లు మార్చుకొని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కాదు.. అసలు పేర్లు ఉంచుకొని యుద్ధం చేయాలని సవాల్ చేస్తున్నారు విజయసాయిరెడ్డి. సోషల్ మీడియా అంటేనే విస్తృతమైన రోజులు ఇవి. ఎన్నో రకాల పోస్టింగులు అందులో వస్తుంటాయి. అయితే ఆ పోస్టులన్నీ తనకోసమే పెట్టినట్టు విజయసాయిరెడ్డి అనుమానిస్తున్నారు. అందుకే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

* రకరకాల పోస్టింగులు
ఇటీవల సోషల్ మీడియాలో లేటు వయసులో ఘాటు ప్రేమలు. శృంగార కథలు.. వంటివి దర్శనమిస్తున్నాయి. జీవిత చరమాంకంలో ప్రేమలు కంటే.. శృంగారమే పవర్ఫుల్ అన్నట్లు కథనాలు రాస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే అవన్నీ తనను ఉద్దేశించినవేనని విజయసాయిరెడ్డి భ్రమిస్తున్నారు. అందుకే నేరుగా పేరు రాసిసోషల్ మీడియాలో ఫైట్ కి రావాలని సూచిస్తున్నారు.

* మీడియాపై చిందులు
మొన్న ఆ మధ్యన తనపై ఆరోపణలు వచ్చినప్పుడు.. మీడియా అధిపతులతో పాటు ప్రతినిధులపై విరుచుకుపడ్డారు. త్వరలో తాను కూడా మీడియాలో అడుగు పెడతానని.. ఛానల్ ను ప్రారంభిస్తానని.. అప్పుడు అందరితో ఆడుకుంటానని బదులిచ్చారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలకు.. మీడియా ఛానల్ ఏర్పాటుకు సంబంధం ఏంటన్నది ప్రశ్న. తనపై వచ్చిన ఆరోపణలను నివృత్తి చేసుకుంటే ఇట్టే సరిపోతుంది కదా.. దానికోసం మీడియా ఛానల్ పెట్టడం ఏంటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

* సోషల్ మీడియా అంటే ఇష్టం
వాస్తవానికి సోషల్ మీడియా అంటే విజయసాయి రెడ్డికి చాలా ఇష్టం. చాలా యాక్టివ్ గా ఉంటారు. ఒకానొక దశలో వైసీపీ సోషల్ మీడియా విభాగాన్ని హ్యాండిల్ చేసేవారు. అటువంటి సోషల్ మీడియా అంటేనే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు విజయసాయిరెడ్డి. అదే సోషల్ మీడియాకు బాధితుడిగా మిగిలారు.కేవలం రాజకీయ ప్రత్యర్థులే కాదు.. నెటిజన్లు సైతం తమకు తోచిన విధంగా పెట్టుకుంటున్న పోస్టులు.. తనను ఉద్దేశించి పెట్టినవేనని విజయ సాయి భావిస్తున్నారు. అందుకే నేరుగా పేర్లు పెట్టిరాయాలని సూచిస్తున్నారు.మొత్తానికైతే విజయసాయిరెడ్డి ని మామూలుగా ఆడుకోవడం లేదు.