https://oktelugu.com/

AP Toll Gates: ఏపీలో టోల్ బాదుడు.. ఎన్నిసార్లు వెళ్తే అన్నిసార్లు కట్టాల్సిందే

సాధారణంగా టోల్ ప్లాజాల్లో రోజుకు ఒక్కసారే ఫీజు వసూలు చేయాలి. కానీ ఇప్పుడు వాహనాలు ఎన్నిసార్లు వెళ్తే అన్ని సార్లు వసూలు చేస్తున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : December 18, 2024 / 10:53 AM IST

    AP Toll Gates

    Follow us on

    AP Toll Gates: ఏపీలో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. రహదారులపై టోల్ ఫీజు బాదుడు కొనసాగుతోంది. ఇప్పటివరకు ఒక్కసారి టోల్ ఫీజు చెల్లిస్తే.. రోజంతా ప్రయాణం చేసుకోవచ్చు. కానీ మారిన నిబంధనలతో ఏపీలోని 65 టోల్ ప్లాజాల్లో రోజుల్లో ఎన్నిసార్లు రాకపోకలు సాగిస్తే.. అన్నిసార్లు టోల్ కట్టాల్సిందే. తాజా వసూళ్లతో సాధారణ ప్రజలు సైతం ఆందోళనకు గురవుతున్నారు. గతంలో ఉన్న నిబంధనలను మార్చి కొత్త మార్గదర్శకాలు పేరుతో సామాన్య వాహనదారులను ఇబ్బంది పెడుతున్నారు. దీంతో రహదారులపై ప్రయాణం అంటేనే సామాన్యులు భయపడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 65 టోల్ ప్లాజాలు ఉన్నాయి. వాటిలో కొత్త ధరలు అమలు చేస్తున్నారు.

    * కొత్త మార్గదర్శకాల పేరుతో
    గతంలో టోల్ ప్లాజా మీదుగా ప్రయాణిస్తే రోజులో ఒక్కసారి ఫీజు చెల్లిస్తే సరిపోయేది.కానీ ఈసారి అలా కాదు.ఎన్నిసార్లు ప్రయాణిస్తే అన్నిసార్లు టోల్ ప్లాజా ఫీజు కట్టాల్సిందే.ఈ మేరకు కొత్త మార్గదర్శకాలు వచ్చాయి.గతంలో ఒక్కసారి వెళ్తే కారుకు 160 రూపాయలు చెల్లించేవారు. తిరుగు ప్రయాణంలో 80 రూపాయలు చెల్లిస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు వెళ్ళిన ప్రతిసారి కట్టాల్సి వస్తోంది. రాజా నిబంధనల ప్రకారం ఒక టోల్ ప్లాజా నుంచి ఒక వైపుకు పూర్తి ఫీజు వసూలు చేస్తున్నారు. అదే రూట్ లో రెండోసారి వెళ్తే సగం ఫీజు వసూలు చేస్తున్నారు. అయితే మారిన ధరలు చూసి వాహనదారులైతే గగ్గోలు పెడుతున్నారు. ఇలా అయితే వాహనాలు తిప్పలేమని చెబుతున్నారు.

    * ఆ నాలుగు ప్లాజాల్లో మినహా
    రాష్ట్రవ్యాప్తంగా 69 టోల్ ప్లాజా లు ఉన్నాయి. వాటిలో నాలుగు మినహా మిగిలిన 65 టోల్ ప్లాజాల్లో ఇదే తరహా వసూళ్లు కొనసాగుతున్నాయి. అయితే ఈ విధానం 2031 వరకు కొనసాగుతుందని టోల్ ప్లాజాల నిర్వాహకులు చెబుతున్నారు. అయితే టోల్ ప్లాజాల వద్ద సిబ్బందితో వాహనదారులు వాగ్వాదానికి దిగుతున్నారు. దీంతో ఎక్కడికక్కడే గొడవలు జరుగుతున్నాయి. అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు అని స్థానిక నేతలు భయపడుతున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జాతీయ రహదారుల సంస్థతో మాట్లాడాలని కోరుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.