https://oktelugu.com/

AP Liquor Shops: ఏపీలో కొత్త బార్లు.. షాపులపై కఠిన ఆంక్షలు.. వ్యాపారులు ఆసక్తి చూపుతారా?

రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు మద్యం దుకాణాలు నడుస్తున్నాయి. ఇప్పుడు తాజాగా బార్లకు నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం. అయితే మద్యం షాపులతో ఎటువంటి లాభాలు లేవని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో బార్లకు స్పందన పై ఆసక్తి చూపుతారా? లేదా? అన్నది తెలియాలి.

Written By:
  • Dharma
  • , Updated On : December 18, 2024 / 10:55 AM IST

    AP Liquor Shops

    Follow us on

    AP Liquor Shops: ఏపీ మద్యం పాలసీలో భాగంగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మద్యం పాలసీని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.రాష్ట్రవ్యాప్తంగా 3300 మద్యం దుకాణాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం.ప్రైవేటు వ్యక్తులకు టెండర్లు ఖరారు చేసింది.అన్ని రకాల ప్రీమియం బ్రాండ్ల మద్యంను అందుబాటులోకి తెచ్చింది. చాలా రకాల బ్రాండ్లకు సంబంధించి ధరలు కూడా తగ్గించింది. అయితే ఇప్పుడు తాజాగా బార్లకు లైసెన్సులు జారీ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 53 బార్లకు లైసెన్సులు జారీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఎందుకుగా నువ్వు ఫీజులను కూడా వెల్లడించింది. ఏడాది కాలపరిమితికి గాను గార్లకు అనుమతి ఇవ్వనుంది. ఈ వేలం, ఆన్లైన్ లాటరీ విధానంలో బార్లను ఎక్సైజ్ శాఖ కేటాయించినట్లు నోటిఫికేషన్ లో వెల్లడించారు. ఈనెల 22 వరకు రిజిస్ట్రేషన్ కు అనుమతించారు. జనాభా ప్రాతిపదికన బార్లకు లైసెన్స్ ఫీజులు ఖరారు చేశారు.

    * నాన్ రిఫండబుల్ రుసుము
    మద్యం షాపులు మాదిరిగానే నాన్ రిఫండబుల్ దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. 50వేల జనాభా వరకు ఐదు లక్షల నాన్ రెఫండబుల్, 50,000 నుంచి ఐదు లక్షల లోపు జనాభా వరకు ప్రాంతాలకు 7.5 లక్షలు, ఐదు లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో 10 లక్షల రూపాయల దరఖాస్తు రుసుముగా నిర్ణయించారు.అయితే ఇప్పటికే కొన్ని బార్లకు సంబంధించి కాల పరిమితి ఉంది. ఇప్పుడు కొత్తగా 53 బార్లకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయ్యింది.

    * అధికారుల నిఘా
    రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున బెల్టు దుకాణాలు వెలుస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారుల నిఘా పెరిగింది. ఇంకోవైపు మద్యం దుకాణాల్లో సైతం ఎంఆర్పి కంటే అధికంగా విక్రయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఎమ్మార్పీ కి మించి మద్యం అమ్మకాలు జరిపినట్లు రుజువైతే ఐదు లక్షల ఫైన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకటి కంటే రెండుసార్లు ఇలా ధరల విషయంలో పట్టుబడితే షాపు లైసెన్స్ రద్దు చేయాలని కూడా స్ట్రాంగ్ గా డిసైడ్ అయింది. ఎట్టి పరిస్థితుల్లో బెల్ట్ షాపులను ప్రోత్సహించవద్దని యాజమాన్యాలను హెచ్చరించింది ప్రభుత్వం. అయితే మద్యం దుకాణాల్లో నష్టం తప్పదని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఈ తరుణంలో బార్ల నోటిఫికేషన్ జారీ కావడంతో.. వ్యాపారుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.