Naga Chaitanya And Sobhita: నాగ చైతన్య-శోభిత ధూళిపాళ్ల వివాహం టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అయ్యింది. ఆగస్టు 8న ఎంగేజ్మెంట్ జరుపుకున్న ఈ జంట ఇటీవల వివాహం చేసుకున్నారు. నాగ చైతన్య పెళ్ళికి అతికొద్ది మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. నాగ చైతన్య కోరిక మేరకు నాగార్జున వివాహం నిరాడంబరంగా ముగించాడు. కేవలం 300 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం అందింది. అన్నపూర్ణ స్టూడియోలో ఏఎన్నార్ విగ్రహం ఎదుట నాగ చైతన్య- శోబిత ఏడడుగులు వేశారు.
కాగా నాగ చైతన్యతో శోభితకు ఎక్కడ ముడిపడింది. వీరి పరిచయం, ప్రేమకు దారి తీసిన పరిస్థితులు ఏంటి? అనే సందేహాలు ఉన్నాయి. నాగ చైతన్య శోభితను రహస్యంగా ప్రేమించాడు. నాగ చైతన్య, శోభిత రిలేషన్ లో ఉన్నారని కథనాలు వెలువడ్డాయి. ఈ పుకార్లను నాగ చైతన్య దంపతులు ఖండించడం గమనార్హం. సడన్ గా ఎంగేజ్మెంట్ వేడుక చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు.
ఇటీవల శోభిత తన లవ్ స్టోరీ లీక్ చేసింది. నాగ చైతన్యతో తనకు ఎలా పరిచయం అయ్యింది. మొదటిసారి ఎక్కడ కలుసుకున్నారు? వంటి విషయాలు షేర్ చేశారు. 2022 నుండి నాగ చైతన్యను శోభిత ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతుందట. వారిద్దరూ తరచుగా మాట్లాడుకునేవారు. నాగ చైతన్య , శోభిత ఆహార ప్రియులు అట. ఫుడ్ గురించే వారి మధ్య సంభాషణలు నడిచేవట. శోభిత గ్లామరస్ ఫోటో లు షేర్ చేస్తే నాగ చైతన్య స్పందించేవాడు కాదట. అయితే శోభిత ఏదైన స్ఫూర్తిదాయకమైన పోస్ట్ షేర్ చేస్తే… ఇష్టపడేవాడట. లైక్ కొట్టేవాడట.
మొదటిసారి వీరిద్దరూ ముంబైలోని ఒక కేఫ్ లో కలుసుకున్నారట. ఇక అప్పుడు నాగ చైతన్య బ్లూ కలర్ సూట్ ధరించారట. శోభిత రెడ్ కలర్ డ్రెస్ లో వచ్చిందట. అనంతరం తరచుగా ముంబైలో వీరు కలిసేవారట. ఒకసారి కర్ణాటకలోని ఒక పార్క్ లో కలిశారట. ఒకరికొకరు గోరింటాకు పెట్టుకున్నారట. అక్కినేని ఫ్యామిలీ న్యూస్ ఇయర్ వేడుకలకు శోభిత నువు ఆవహించారట. శోభిత పేరెంట్స్ ని నాగ చైతన్య కలిశాడట. గోవాలో పెళ్లి ప్రమోజల్ వచ్చిందట. ఆవిధంగా నాగ చైతన్య-శోభితల పరిచయం పెళ్ళికి దారి తీసిందట.
ఇక నాగ చైతన్య-శోభితలలో ఎవరు ముందు ఐ లవ్ యూ చెప్పారనే విషయంలో క్లారిటీ లేదు. శోభిత మాటల ప్రకారం నాగ చైతన్య ఆమెను బాగా ఇష్టపడ్డాడని తెలుసుంది. అక్కినేని హీరోని భర్తగా శోభిత కోరుకోకపోవచ్చు. కారణం స్టేటస్, అస్సెస్ట్స్ లో నాగ చైతన్య శోభిత కంటే చాలా ఎత్తులో ఉన్నారు.